Blog

Enquire Now
Uncategorized

దంపతులు సంతానోత్పత్తి క్లినిక్ ని సందర్శించినప్పుడు సంతానోత్పత్తి నిపుణులను అడగవలసిన పది ప్రశ్నలు

దంపతులు సంతానోత్పత్తి క్లినిక్ ని సందర్శించినప్పుడు సంతానోత్పత్తి నిపుణులను అడగవలసిన పది ప్రశ్నలు

పిల్లలని కనడానికి ఇబ్బంది పడుతున్న దంపతులకి సంతానోత్పత్తి కేంద్రానికి వెళ్ళడం అనేది ఒక పీడకల లాంటిది .పిల్లల్ని కనలేకపోవడం అనేది చాల బాధాకరమైన మనోవేదన .దంపతులు వాళ్ళు పిల్లలు కనలేకపోవడానికి సరైన కారణం ఏంటో తెలియక భయానికి గురవుతుంటారు అంతేకాకుండా వాళ్ళకి తల్లితండ్రులు అవ్వడానికి సంతానోత్పత్తి చికిత్స ఉందనే విషయం తెలియకపోవడం  వాళ్ళు భయపడడానికి ఇంకొక కారణం  .ఇబ్బందికరమైన ,అపరాధభావం తో కూడిన అస్థిరమైన ఆలోచనలు వాళ్ళని వేదనకు గురి చేస్తాయి .కానీ సంతానోత్పత్తి సమస్యలని అధిగమించి తల్లితండ్రులు అవ్వాలనే కలను నిజం చేసుకోవడానికి సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం .కనుక మొట్టమొదటి సారి దంపతులు సంతానోత్పత్తి నిపుణలని సంప్రదించినపుడు మరియు కౌన్సిలింగ్ తీసుకున్నపుడు ,దంపతులు అడగవలసిన పది ప్రశ్నలు ఇప్పుడు చూద్దాం .

1 .గర్భం రాకుండామమ్మల్ని ఆపుతున్నది ఏంటి ?

రోగ నిర్ధారణ అనేది చాలా ముఖ్యమైన అడుగు .దంపతులు సంతానోత్పత్తి కేంద్రాన్ని సందర్శించినప్పుడు ముందుగా వాళ్ళకి రక్తపరీక్షలు ,స్కానింగ్ లు చేసి ,వాళ్ళ గతం తాలూకు వైద్య సంబంధిత వివరాలు తెలుసుకుని ,తరువాత వాళ్ళు మునుపు తీసుకున్న వైద్య చికిత్స రికార్డు లు పరిశీలించి ,వాళ్ళ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు .దంపతులలో ఆడ ,మగ ఇద్దరికీ సంతానోత్పత్తి పరీక్షలు చేస్తారు .దీని వలన సంతానోత్పత్తి నిపుణలకు దంపతులలో సంతానలేమికి గల కారణం తెలుస్తుంది

2 .జీవనశైలిలో మార్పులు తెస్తేమాకు పిల్లలు కలుగుతారా ?

కొన్ని సార్లు బరువు తగ్గడం ,తరచూ వ్యాయాయం చేయడం మరియు సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వలన సహజం గానే పిల్లల్ని కనచ్చు .అంతే కాకుండా దీనివలన సంతానోత్పత్తి చికిత్స లో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం మెరుగుపడుతుంది

3 .మేము ఏ రకమైన సంతానోత్పత్తి చికిత్స తీసుకోవాలి ?

సంతానోత్పత్తి చికిత్స అనేది  చాలా వ్యక్తిగతాత్మక చికిత్స విధానం ,ఇది ఒకొక్క దంపతులకి ఒకోలా ఉంటుంది .

సంతానోత్పత్తి చికిత్స లో ఒకే చికిత్స విధానం అనేది అందరికి పని చేయదు .ప్రాథమిక చికిత్స విధానాలు అంటే ఒవ్యులేషన్ ఇండక్షన్ ,ఐ.యూ.ఐ  మొదలుకుని  అత్యాధునిక చికిత్స విధానాలు అంటే ఐ.వి.ఎఫ్ ,ఐ .సి.ఎస్ .ఐ మరియు ప్రీ ఇంప్లాంటేషన్ జనరిక్ టెస్టింగ్ వరకు చాలా రకాలైన చికిత్స విధానాలు

అందుబాటులో ఉన్నాయి. దంపతులు యొక్క ఆరోగ్య పరిస్థితి ,వయసు ,జీవనశైలి మొదలైనవాటిని ఆధారంగా చేసుకుని వారికీ తగిన వైద్య చికిత్స విధానాన్ని సూచిస్తారు .దంపతులు వాళ్ళకి ఏ విధమైన చికిత్స విధానం వల్ల వాళ్ళకి పిల్లలు కలుగుతారో అనేది వాళ్ళు తెలుసుకోవడం చాలా ముఖ్యం .దంపతులకి వాళ్ళు చికిత్స తీసుకోకముందే ఈ మొత్తం చికిత్స విషయాలపై సరైన స్పష్టత ఉండాలి .

4 .చికిత్స తీసుకుంటే పిల్లలు కలిగే అవకాశాలు ఏ మాత్రం ఉంటాయి ?

చికిత్సకి వెళ్ళడానికి ముందుగా దంపతులు ఆ నిర్దిష్టమైన చికిత్స విధానానికి ఎంత వరకు సానుకూలమైన ఫలితం పొందే అవకాశం ఉందో తెలుసుకోవాలి .పిల్లల్ని పొందే అవకాశాలు దంపతుల యొక్క ఆరోగ్య పరిస్థితి, వయసు, జీవనశైలిని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క జంటకి ఒక్కొక్కలా ఉంటాయి .దంపతులు సంతానం పొందడంలో సాధ్యాసాధ్యాల మీద ఒక ఆలోచనతో ఉండాలి .వాస్తవానికి దగ్గరగా అంచనాలు ఉండడం అనేది మేలు ఎల్లప్పుడూ .

5 .సంతానోత్పత్తి చికిత్స తీసుకోవడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయా ?

చికిత్స విధానం లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయా లేదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం గా మారింది.సంతానోత్పత్తి కోసం తీసుకునే మందుల వలన కొంత మంది స్త్రీలకి వికారం ,నొప్పి ,వెంట వెంటనే మనస్థితి మారిపోవడం జరుగుతూ ఉంటుంది .కనుక ,దంపతులు చికిత్స తీసుకోక ముందే రావడానికి అవకాశమున్న సైడ్ ఎఫెక్ట్ ల గురించి క్లిష్టతరమైన పరిస్థితుల గురించి తెలుసుకోవాలి .

6 .కవల పిల్లలు పుట్టే అవకాశం ఎంత ఉంటుంది ?

ఐ .వి .ఎఫ్ చికిత్స తీసుకోవడం లో కొన్ని సార్లు ఒక బిడ్డ కన్నా ఎక్కువ మంది పుట్టచ్చు .కవల పిల్లలు పుట్టే అవకాశాలు గురించి తెలుసుకోవడం వలన దంపతులకి చాలా రకాలుగా చాలా ఉపయోగం ఉంటుంది .ఒక బిడ్డే పుట్టాలనుకుంటే దానికి మార్గాలు ఉన్నాయి అని వాళ్ళు తెలుసుకోవాలి మరియు ఐ .వి.ఎఫ్ వల్ల ప్రతీసారి కవలపిల్లలు,ముగ్గురు పిల్లలు కలగరు

7 .స్వయంగా పిల్లలని కనలేకపోతే దాత నుంచి సేకరించిన అండము లేదా వీర్యంతో పిల్లల్ని కనేవసతి   అందుబాటులో ఉంటుందా?

కొంత మంది దంపతులకి సంతానం పొందడానికి  దాత నుంచి సేకరించిన అండం లేదా వీర్యం అవసరం పడతాయి , కనుక దాత నుంచి సేకరించిన అండం లేదా వీర్యంతో పిల్లల్ని కనే చికిత్స అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవాలి

8 .ఈ సంతానోత్పత్తి కేంద్రంలో క్రియోప్రెజర్వేషన్ సదుపాయం ఉందా ?

ఐ .వి .ఎఫ్ చికిత్స విధానం లో భాగంగా చాలా మటుకు పిండాలు రూపుదిద్దుకుంటాయి .కానీ వాటన్నిటిని మనం ఒకేసారి ఉపయోగించుకోలేము ,కనుక సంతానోత్పత్తి కేంద్రంలో క్రియోప్రెజర్వేషన్ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం .అదనంగా ఉన్న పిండాలను ద్రవ రూపంలో ఉన్న నైట్రోజన్ లో  క్రియోప్రెజర్వేషన్ చేస్తారు ,దీని వలన మరోసారి సంతానం కోసం ఈ పిండాలను ఉపయోగించుకోవచ్చు,ఒక వేళ రుతు చక్రం విఫలమైతే పిండాలని గడ్డ రూపంలో అండాశయంలో బదిలీ చేయచ్చు మరోసారి స్త్రీలు అండోత్పత్తి కోసం చికిత్స తీసుకోనక్కరలేకుండా

9 .మమ్మల్ని మేము ఈ చికిత్స కి ఎలా సిద్ధపరచుకోవాలి ?

దంపతులు ఈ వైద్య చికిత్స తీసుకోవడానికి ముందు ఏం చేయాలి ,ఏం చేయకూడదు అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవాలి

10 .చికిత్స తీసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది ?

ఖర్చు విషయంలో ఒక స్పష్టత ఉండడం చాలా ముఖ్యంగా మారింది .కొన్ని సార్లు దంపతులకి ఐ .వి .ఎఫ్ లేదా ఐ.యూ .ఐ ఒక ఋతుచక్రం చికిత్స తీసుకున్నా పిల్లలు కలగకపోవచ్చు .దంపతుల యొక్క ఆరోగ్య పరిస్థితిని ఆధారం చేసుకుని, వాళ్ళకి ఒక సారి కన్నా  ఎక్కువ రుతు చక్రాలు చికిత్స  జరగాలి  సంతానం పొందడానికి .ఖర్చు విషయంలో దంపతులకి సరైన ఆలోచన ఉండడం వలన వాళ్ళని వాళ్ళు మానసికంగాను ,ఆర్ధికంగానూ సంతానోత్పత్తి చికిత్స కై సిద్ధం చేసుకోగలరు .

సంతానోత్పత్తి చికిత్స గురించి మీకున్న భయాలని,అపోహల్ని,దిగులులని మరిచిపోండి .ఒక్కసారి సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించి తల్లి తండ్రులు అవ్వాలనే మీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ,సానుకూల దృక్పథంతో మొదలుపెట్టండి .అమ్మ నాన్న అవ్వాలనే మీ కలను నిజం చేసుకోండి

Write a Comment