Blog

Enquire Now
Uncategorized

రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్నారా?రెండవ సంతానం పొందలేకపోవడానికి సంతానలేమి కారణం అయ్యుండచ్చు

రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్నారా?రెండవ సంతానం పొందలేకపోవడానికి సంతానలేమి కారణం అయ్యుండచ్చు

మీకు మొదటి సంతానం కలిగినంత మాత్రాన  మీరు సంతానలేమి నుంచి బయటపడినట్టు కాదు. అవును ,ఈ సమస్య మీరు రెండో సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ,దీనినే రెండవ సంతానం పొందడం లో సంతానలేమి అంటారు. ఇలాంటి సమస్య ఉందని చాలా మందికి తెలియను కూడా తెలియదు. చాలా మంది దంపతులు వాళ్ళ ముప్పయ్యేళ్ల ప్రాయంలో రెండవ బిడ్డ కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు,కానీ,వాళ్ళు కోరుకున్నపరిమాణంలో కుటుంబాన్ని పొందలేరు ఈ రెండవ సంతానం పొందడంలో సంతానలేమి మూలంగా. ఇది భావోద్వేగపరంగా చాలా కఠినమైన పరిస్థితి .దంపతులు అప్పటికే వాళ్ళకి ఒక బిడ్డ ఉండడం వల్ల దీని గురించి బయటకి చెప్పుకోలేరు. ఈ విషయం లో వాళ్ళ బాధ వినడానికి మనసుపెట్టి వినే మనుషులు కూడా దొరకరు  

రెండవ సంతానంలో సంతానలేమి సమస్య రావడానికి ఏంటి కారణం ? 

ఉద్యోగం మరియు ఇతర వ్యక్తిగత నిర్దేశిత లక్ష్యాల మూలంగా బిడ్డని కనాలని అనే ఆలోచనని  29 లేదా 30 ఏళ్ళ వయసు వచ్చాక చూద్దాం అని వాయిదా వేస్తున్నారు ,రెండవ బిడ్డను కనాలని అనే ఆలోచన వచ్చే సరికి దంపతుల వయసు 34 లేదా 35 కి వచ్చేస్తుంది. ఈ సమయంలో ,స్త్రీలలో సంతానోత్పత్తి అప్పటికే క్షీణ స్థితికి వచ్చేస్తుంది .పురుషులలో వీర్యకణాల పరిమాణం మరియు వాటిలో నాణ్యత వాళ్ళ వయసు మరియు వాళ్ళ జీవితాలలోని జీవనశైలిలో మార్పుల వల్ల తగ్గుముఖం పడతాయి. 

స్త్రీలకి రెండవసంతానంలో సంతానలేమి రావడానికి గల ప్రధానమైన కారణాలు ఏంటంటే ఎండోమెట్రియోసిస్,ఫాలోపియన్ నాళాలు బ్లాక్ అవ్వడం ,సరైన సమయంలో అండోత్సర్గం కాకపోవడం ,గర్భాశయంలో పొరలు ,లైంగికంగా సంక్రమించే వ్యాధులు ,పోలి సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్,గతంలో సి-సెక్షన్ శస్త్రచికిత్స జరగడం, చెప్పలేని సంతానలేమి కారణాలు మొదలైనవి. 

ఈ రెండు గర్భధారణ సమయాల మధ్యలో ,స్త్రీల వయసు పెరుగుతుంది ,ఆడవారికి పి.సి.ఓ. ఎస్ రావచ్చు  లేదా ఆడ మగా ఇద్దరికీ ఎక్కువగా వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహ వ్యాధి రావడం అనేవి గర్భధారణ ని ఇంకా జటిలం చేస్తాయి. ధూమపానం అలవాటున్నాకూడా అది గర్భధారణ అవకాశాన్ని దెబ్బ తీస్తుంది ఆడ మగా ఇద్దరికీ. 

దంపతులు ఇంతకు మునుపు పిల్లలు కలగట్లేదని మానసికంగా కుంగిపోయి ఉంటారు, స్త్రీలకి 35 ఏళ్ళ లోపు వయసు ఉండి,రెండవ సంతానం కోసం ప్రయత్నించి ఒక సంవత్సరం అయి ఫలితం లేకపోయినా, స్త్రీలకి 35 ఏళ్ళకన్నా ఎక్కువ వయసు ఉండి రెండవ సంతానం కోసం ప్రయత్నించి 6 నెలలు అయి ఫలితం లేకపోయినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సంతానోత్పత్తి నిపులను కలవడం చాలా మంచిది 

రెండవ సంతానం పొందడంలో సంతానలేమి సమస్యని ఎలా అధిగమించాలి ? 

రెండవ సంతానం పొందడంలో సంతానలేమి సమస్యని మందులు వాడడం, శస్త్ర చికిత్స చేయించుకోవడం లేదా అసిస్టెడ్ రి ప్రోడక్టివ్ టెక్నిక్ అనగా ఐ. యూ .ఎఫ్ ,ఐ .వి .ఎఫ్ మొదలగు వాటి ద్వారా నివారించవచ్చు సంబంధిత దంపతులు వయసు మరియు ఆరోగ్య పరిస్థితులను ఆధారం చేసుకొని. 

రెండవ సంతానం పొందడంలో సంతానలేమి సమస్య వలన దంపతులకి వాళ్ళ బిడ్డకి ఒక తోడబుట్టిన వారిని ఇవ్వలేకపోతున్నాం అని ఒత్తిడి మరియు నిరుత్సహం ఎక్కువయి నిరాశ అధికమవుతుంది. జీవనశైలిలో సరైన మార్పులు తీసుకురావడం వల్ల దంపతుల ఆరోగ్యంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. దంపతులకి వాళ్ళు కోరుకున్న పరిపూర్ణమైన కుటుంబం పొందడానికి అత్యంత అధునాతమైన సంతానోత్పత్తి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 

దంపతులు వాళ్ళ మొదటి సంతానాన్ని కనడం ఆలస్యం చేస్తే ,రెండవ సంతానం కనడ కూడా ఆలస్యం అవుతుంది .చాలా మంది దంపతులు రెండవ బిడ్డని కనాలని కనలేక బాధతో జీవితం సాగిస్తున్నారు. దంపతులు వాళ్ళ భయాల్ని, బాధలని పక్కనపెట్టి రెండవ సంతానం పొందడానికి సంతానోత్పత్తి నిపుణుల సహాయం తీసుకోవాలి 

Write a Comment