Author: Dr Jigna Tamagond, Consultant – Fertility Specialist
గర్భాశయ అడెనోమయోసిస్ అనేది ఒక బాధాకరమైన ఋతుకాలం కంటే కాస్త ఎక్కువ. అడెనోమయోసిస్ గురించి తెలుసుకోవడానికి గర్భాశయం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.
గర్భాశయం క్రింద పేర్కొన్న పొరలతో కూడి ఉంటుంది.
మైయోమెట్రియం: బయటి మృదు కండరం.
ఎండోమెట్రియం: ఋతు చక్రంలో పెరిగే లోపలి పొర మరియు తనను తాను మందంగా చేసుకోవడం ద్వారా ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాశయం స్వీకరిస్తుంది.
“జంక్షనల్ జోన్” లేదా “ఇన్నర్ మైమెట్రియం” అనేది ఎండోమెట్రియం మరియు కండరాల పొరను వేరు చేసే ఈ రెండు పొరల మధ్య ఉన్న ప్రాంతం. ఆరోగ్యకరమైన గర్భాశయంలో, ఈ ప్రాంతం యొక్క మందం 2-8 మిమీ వరకు ఉంటుంది.
స్త్రీకి అడెనోమయోసిస్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియాల్ కణజాలం గర్భాశయ కండరాల గోడలోకి పెరుగుతుంది, ఇది జంక్షనల్ జోన్ ను గట్టిపరుస్తుంది. అడెనోమయోసిస్ విషయంలో, ఈ జంక్షనల్ జోన్ యొక్క మందం 12 మిమీ లేదా అంతకంటే ఎక్కువ. ఇది ఎన్లార్జెడ్ గర్భాశయం దారి తీసి తద్వారా ఇతర అసౌకర్య మరియు నొప్పి కలగచేసే లక్షణాలకు దారితీస్తుంది. మైయోమెట్రియంలో తిత్తులు ఉండటం కూడా అడెనోమియోసిస్ స్థితిని సూచిస్తుంది.
35 ఏళ్లు పైబడిన మధ్య వయస్కులైన మహిళలు లేదా ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలలో అడెనోమియోసిస్ అభివృద్ధి చెందడానికి అధిక అవకాశాలు ఉన్నాయి.
ఈ సంకేతాల పట్ల జాగ్రత్త వహించండి:
– నొప్పితో కూడిన కడుపునొప్పి లేదా కటి నొప్పి
– సుదీర్ఘమైన మరియు భారీ ఋతు రక్తస్రావం
– బాధాకరమైన లైంగిక సంపర్కం
– వంధ్యత్వం
ఈ లక్షణాలు ఇతర అంతర్లీన సమస్యలను కూడా సూచిస్తాయి మరియు ఎండోమెట్రియోసిస్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి.
సమస్యలు:
అడెనోమియోసిస్ వ్యాధి ప్రభావిత మహిళల దైనందిన జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.
అడెనోమయోసిస్ ఉన్న మహిళలలో రక్తహీనత, వంధ్యత్వం మరియు ఇతర గర్భాశయ పరిస్థితులు అభివృద్ధి జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.