Site icon Oasis Fertility

HSG పరీక్ష గురించి మీరు తెలుసుకోవలసిన సమస్తం

Everything you need to know about the HSG test

Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist

HSG పరీక్ష అంటే ఏమిటి?

HSG పరీక్ష అనేది స్త్రీ పునరుత్పత్తి మార్గాన్ని అంచనా వేయడానికి ఒక రోగ నిర్ధారణ  సాధనం. దీనినే హిస్టెరోసాల్పింగోగ్రామ్ అని కూడా పిలుస్తారు, గర్భాశయం లోపల మరియు ఫెలోపియన్ గొట్టాల లోపల ఏవైనా అసాధారణతలను అంచనా వేయడానికి ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి. ఇందులో గర్భాశయంలోకి కాంట్రాస్ట్ డైని ఇంజెక్ట్ చేయడం ద్వారా, తక్కువ మోతాదు X- కిరణాలకు లోబడి, గర్భాశయ కుహరం మరియు ఫెలోపియన్ గొట్టాల ఆకారం మరియు నిర్మాణం గురించి అవగాహన కల్పిస్తుంది.

HSG పరీక్ష ఎందుకు చేయబడుతుంది?

గర్భాశయ పరిస్థితులను నిర్ధారించడానికి:

పుట్టుకతో వచ్చే గర్భాశయ క్రమరాహిత్యాలు, ఫైబ్రాయిడ్ ‌లు, కణితులు, పాలిప్స్, పొత్తికడుపు సంశ్లేషణల కోసం గర్భాశయాన్ని పరిశీలించడానికి వంధ్యత్వ నిర్ధారణలో భాగంగా HSG పరీక్ష నిర్వహిస్తారు, ఎందుకంటే ఈ పరిస్థితులు బీజ ప్రవేశమును మరియు పిండం పెరుగుదలను ప్రభావితం చేయవచ్చు.

ట్యూబల్ లిగేషన్ (ఫాలోపియన్ గొట్టాలను మూసివేసే శస్త్రచికిత్స)  యొక్క విజయాన్ని తనిఖీ చేయడానికి:

ట్యూబల్ లిగేషన్ ప్రక్రియ తర్వాత గొట్టాలు పూర్తిగా మూసుకున్నాయో లేదో నిర్ధారించడానికి కూడా ఇది చేస్తారు (గర్భధారణను నిరోధించడానికి ఫెలోపియన్ గొట్టాలను మూసివేసే విధానం).

ఫాలోపియన్ ట్యూబ్ ‌లలో అడ్డంకులను తనిఖీ చేయడానికి: 

మహిళల్లో నిరోధించబడిన ఫాలోపియన్ గొట్టాలు వంధ్యత్వానికి గల ప్రధాన కారణాలలో  ఒకటి.  శ్లేష్మం, కణ శిధిలాలు, పాలిప్స్ మరియు ఫైబ్రాయిడ్లు ఉండటం వల్ల ఫెలోపియన్ ట్యూబ్‌లలో అడ్డంకులు ఏర్పడతాయి ఈ అడ్డంకులు వీర్యాన్ని ఫలదీకరణం కోసం అండాన్ని చేరుకోవడానికి అనుమతించవు లేదా ఫలదీకరణం చేసిన అండాన్ని బీజప్రవేశము కోసం గర్భాశయాన్ని చేరనీయవు అంతేకాక ఎక్టోపిక్ గర్భధారణకు కూడా దారితీయవచ్చు. ఫాలోపియన్ గొట్టాలలోని ఈ అడ్డంకులను HSG పరీక్ష సహాయంతో నిర్ధారించవచ్చు.

HSG పరీక్షకు ఎలా సిద్ధం చేయాలి?

HSG పరీక్ష తర్వాత ఏమి ఆశించవచ్చు?

దీని తాలూకా దుష్ప్రభావాలు సాధారణంగా పరీక్ష తర్వాత కొన్ని రోజుల్లోనే తొలగిపోతాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.

 

HSG పరీక్ష వలన ప్రమాదాలు ఏమిటి?

HSG పరీక్ష సాపేక్షంగా సురక్షితమైనది, కానీ అప్పుడప్పుడూ క్రింద పేర్కొన్న అరుదైన  సమస్యలు తలెత్తవచ్చు:

HSG పరీక్ష బాధాకరమైన ప్రక్రియా?

HSG పరీక్ష అనేది సాధారణంగా నొప్పిలేకుండా చేసే ప్రక్రియ మరియు వారి నొప్పి తట్టుకునే సామర్ధ్యం కారణంగా మహిళ నుండి మహిళకు ఈ అనుభవం మారవచ్చు. కొంతమంది మహిళల్లో ఈ ప్రక్రియ తేలికపాటి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఈ రంగు యోని ద్వారా గర్భాశయం మరియు ఫెలోపియన్ గొట్టాలలోకి  నొప్పి లేకుండా ప్రవేశపెట్టబడుతుంది. కొంతమంది మహిళలు రంగును ఇంజెక్ట్ చేసేటప్పుడు కొంచెం తిమ్మిరిని అనుభవించవచ్చు.

ఓవర్-ది-కౌంటర్ నొప్పి ఉపశమన మందులు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

HSG పరీక్షను ఎవరికి చెయ్యరాదు?

ఒకవేళ మహిళలు క్రింద పేర్కొనబడిన అంశాలను కలిగి ఉంటే HSG పరీక్ష చేయించుకోకుండా ఉండాలి

HSG పరీక్ష ఫలితాల వివరణ

మీ సంతానోత్పత్తి నిపుణుడు స్కాన్ చిత్రాలను అంచనా వేస్తారు మరియు చికిత్స యొక్క తదుపరి దశలు ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఇచ్చిన రిపోర్ట్, ఫాలోపియన్ గొట్టాలలో అడ్డంకిని చూపిస్తే, సమస్యను మరింత నిర్ధారించడానికి లాపరోస్కోపీ చేయబడుతుంది లేదా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సను సిఫారసు చేయవచ్చు.

HSG పరీక్ష గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుందా?

కొన్ని సందర్భాల్లో, HSG పరీక్ష పరోక్షంగా జంటల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది. ఈ పరీక్ష తర్వాత దాదాపు 3 నెలల వరకూ ప్రయత్నించడం సురక్షితం. ఇటువంటి సందర్భాల్లో, పరీక్ష సమయంలో ఉపయోగించిన కాంట్రాస్ట్ డై (అయోడిన్) ఫాలోపియన్ ట్యూబ్ ‌ను నిరోధక రహితంగా మరియు గర్భధారణను నిరోధించే శ్లేష్మం లేదా ఇతర సెల్ శిధిలాలను తొలగించడంలో సహాయపడుతుందని భావించబడుతుంది. ఇది చక్కని దుష్ప్రభావం అయినప్పటికీ, ఇదే అవసరమైన ఫలితం కాకపోవచ్చునని గుర్తుంచుకోవడం ముఖ్యం.

HSG పరీక్ష మాత్రమే ఏకైక ఎంపికా?

లాపరోస్కోపీ మరియు హిస్టెరోస్కోపీ వంటి ఇతర విధానాలు ఉన్నాయి. గర్భాశయ కుహరంలోని సమస్యల కారణంగా తలెత్తే సమస్యలను నిర్ధారించడానికి వీటిని ఉపయోగిస్తారు, అయితే అవి ఫాలోపియన్ గొట్టాలలోని అడ్డంకుల గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వవు.

పునరావృత గర్భస్రావాలు మరియు అసాధారణ రక్తస్రావం సందర్భాలలో కూడా HSG పరీక్ష పరిగణించబడుతుంది.

Was this article helpful?
YesNo
Exit mobile version