Site icon Oasis Fertility

ICSI చికిత్స అంటే ఏమిటి? పిల్లల కోసం ఆశకు కొత్త మార్గం

ఒక చిన్న ఆశ… ఒక పెద్ద నిర్ణయం…! ప్రతి నెలా ఒకే ప్రశ్న…! “ఈ సారి అయినా ఆ గుడ్ న్యూస్ వింటామా?” ప్రతి నెగెటివ్ టెస్ట్ తర్వాత ఒక చిన్న నిరాశ…! కానీ వెంటనే మళ్లీ ఒక ఆశ. 

సంతానం కోసం ఎదురుచూసే వారికి ఇది ఒక వైద్య ప్రక్రియ మాత్రమే కాదు… అది ఒక ఎమోషనల్ జర్నీ. ప్రశ్నలుసందేహాలుకన్నీళ్లుప్రార్థనలు ఇవన్నీ ఈ మార్గంలో సహజం. 

అలాంటి సమయంలో దంపతులకు డాక్టర్ ఒక కొత్త మాట చెబుతారు.    

ICSI చికిత్సకు సిద్ధం కావాలి.”

ఈ పదం మొదట వినగానే భయం కలగొచ్చు. ఇది పెద్ద ప్రక్రియలా అనిపించొచ్చు. 

 “మనకు ఇది అవసరమా?” అని అనిపిస్తుంది. కానీ నిజానికి, ICSI చికిత్సకు సిద్ధం కావాలి అంటే ఓటమి అంగీకరించడం కాదు. అది ఆశను వదిలేయడం కాదు. అది మీ కలను మరింత దగ్గర చేయడానికి తీసుకునే ధైర్యమైన అడుగు. ఇది కేవలం ఒక మెడికల్ ప్రొసీజర్ కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం. 

 మీ కుటుంబాన్ని పూర్తి చేయాలనే మీ కోరికకు ఒక శాస్త్రీయ సహాయం. 

మీరు ఈ ప్రయాణంలో ఒంటరిగా లేరు. సరైన సమాచారంసరైన మార్గదర్శకంసరైన మద్దతుతో   

ICSI చికిత్సకు సిద్ధం కావాలి అనే నిర్ణయం మీ జీవితంలో ఒక ఆశాజనక మలుపు కావచ్చు.

ముఖ్యంగా గర్భధారణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న దంపతులకు ICSI (ఇంట్రా సైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్) చికిత్స ఆధునిక ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో ఎంతో ప్రభావవంతమైన పరిష్కారంగా నిలుస్తోంది.

 ICSI చికిత్సకు సిద్ధం కావాలి:  

సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ గర్భం దాల్చలేక పోతేఅది శారీరకంగా మాత్రమే కాదు  భావోద్వేగంగా కూడా భారంగా అనిపించవచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్లు సూచించే ఒక ప్రత్యేక విధానం ICSI (Intracytoplasmic Sperm Injection). 

ICSI అంటే ఏమిటి? 

ICSI అనేది IVF చికిత్స (In Vitro Fertilization) లో భాగంగా చేసే ఒక అధునాతన విధానం. ఇందులో ఒకే ఒక్క ఆరోగ్యకరమైన వీర్యకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. ఇది సహజంగా జరిగే ఫర్టిలైజేష

ప్రత్యేకంగా పురుష వంధ్యతకు ICSI చికిత్స చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటంకదలిక సరిగా లేకపోవడం లేదా వీర్యకణం అండాన్ని దాటలేకపోవడం వంటి సమస్యలున్నప్పుడు ఇది ఒక మంచి మార్గం అని చెప్పవచ్చు. 

 

ICSI మరియు IVF మధ్య తేడా: 

చాలామందికి సందేహం ఉంటుంది  ICSI మరియు IVF మధ్య తేడా ఏమిటి అని. IVFలో అండాలు మరియు వీర్యకణాలను ఒకే డిష్‌లో ఉంచుతారు. వాటిలో ఒక వీర్యకణం సహజంగా అండాన్ని ఫర్టిలైజ్ చేస్తుంది. 

 ICSIలో మాత్రంఒకే ఒక్క వీర్యకణాన్ని ఎంపిక చేసి నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఇంకా సరళంగా చెప్పాలంటే: 

పురుష సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ICSIను ఎక్కువగా సూచిస్తారు. 

ఎప్పుడు ICSI అవసరం అవుతుంది? 

క్రింది పరిస్థితుల్లో డాక్టర్లు ICSI సూచించవచ్చు: 

  1. పురుషవంధ్యతకు ICSI చికిత్స 

మీ భాగస్వామి వీర్య పరీక్షలో తక్కువ వీర్యకణాల సంఖ్యవీర్యకణాల కదలిక తక్కువగా ఉండటంఆకృతి సమస్యలు ఉన్నప్పుడు సహజంగా ఫర్టిలైజేషన్ జరగదు. అప్పుడు పురుష వంధ్యతకు ICSI చికిత్స ఒక ముఖ్య మార్గం. 

  1. గతIVFలో ఫర్టిలైజేషన్ జరగలేదంటే 

కొన్నిసార్లు IVF చేసేందుకు సరైన పరిస్థితులు ఉన్నా కూడా ఫర్టిలైజేషన్ జరగకపోవచ్చు. అప్పుడు ICSI సహాయం చేస్తుంది. 

  1. ఇతర ప్రత్యేక పరిస్థితులు: శస్త్రచికిత్స ద్వారా సేకరించిన వీర్యకణాలు,హార్మోన్ సమస్యలుఎగ్ నాణ్యత పరిమితి 

ప్రత్యేకంగా పురుష వంధ్యతకు ICSI చికిత్స ఒక ముఖ్యమైన పరిష్కారం.  

ICSI చికిత్సకు సిద్ధం కావాలి: శారీరకంగా ఎలా సిద్ధం కావాలి? 

ICSI చికిత్సకు సిద్ధం కావాలి అంటే కేవలం వైద్య ప్రక్రియకే కాదు  మీ శరీరంమనసుజీవనశైలిని కూడా సిద్ధం చేయాలి. 

మహిళలకు: 

పురుషులకు: 

సమగ్రంగా చూస్తే, ICSI చికిత్సకు సిద్ధం కావాలి అంటే వైద్య బృందంతో కలిసి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడం. 

మానసికంగా ICSI చికిత్సకు సిద్ధం కావాలి 

ఈ ప్రయాణం భావోద్వేగంగా కష్టంగా ఉండవచ్చు. నిరీక్షణఆశభయం  ఇవన్నీ సహజమే. 

ICSI చికిత్సకు సిద్ధం కావాలి అంటే మీ మనసును కూడా బలంగా ఉంచుకోవాలి. 

ICSI ప్రక్రియ ఎలా జరుగుతుంది? 

  1. హార్మోన్స్టిమ్యులేషన్:  శరీరంలో అండాల (eggs)ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేకమైన హార్మోన్ మందులు ఇవ్వడం. 
  2. అండాల సేకరణ: హార్మోన్స్టిమ్యులేషన్ద్వారా పెరిగిన అండాలను గర్భాశయానికి సమీపంలోని అండాశయాల (ovaries) నుండి సేకరించే ప్రక్రియను అండాల సేకరణ అంటారు 
  3. వీర్యకణం ఎంపిక: ఈ ప్రక్రియలో ప్రయోగశాలలో నిపుణులు ఆరోగ్యకరమైన,బలమైన వీర్యకణాన్ని గుర్తించి ఎంపిక చేస్తారు.
  4. అండంలోకి వీర్యకణం ఇంజెక్షన్: ఒకే ఒక్క ఉత్తమమైన వీర్యకణాన్ని నేరుగా అండంలోకి ప్రవేశపెడతారు. 
  5. ఎంబ్రియోపెంపకం: అండం మరియు వీర్యకణం కలిసిన తర్వాత ఏర్పడేఫర్టిలైజ్డ్ ఎగ్‌ను ఎంబ్రియో అంటారు. ఆ ఎంబ్రియోను కొన్ని రోజుల పాటు ప్రయోగశాలలో జాగ్రత్తగా పెంచే ప్రక్రియనే ఎంబ్రియో పెంపకం అంటారు. 
  6. ఎంబ్రియోనుగర్భాశయంలోకి ప్రవేశపెట్టడం

ఈ మొత్తం ప్రక్రియ వైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది. 

 ICSI  ఎంత శాతం విజయవంతం అవుతుంది? 

అది వయస్సుఅండాల నాణ్యతవీర్యకణాల ఆరోగ్యం ఆధారంగా మారుతుంది. సాధారణంగా IVF విజయశాతానికి సమానంగా ఉంటుంది. 

డాక్టర్ మీ వ్యక్తిగత పరిస్థితి ఆధారంగా మీకు సరైన అంచనాను చెబుతారు. 

Was this article helpful?
YesNo
Exit mobile version