Site icon Oasis Fertility

మహిళల్లో సహజంగా సంతానోత్పత్తిని పెంచడానికి శీఘ్ర చిట్కాలు

Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist

ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థ మీ గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది. మీరు మరియు మీ శరీరం ‘బేబీ రెడీ’ గా ఉండటానికి మీరు ప్రయత్నించగల కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

మీ శరీర బరువును గమనించండి

బరువులో మార్పులు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అధిక బరువుతో లేదా తక్కువ బరువుతో ఉండటం సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది మరియు మీ గర్భధారణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఊబకాయం PCOS వంటి పరిస్థితులకు దారితీస్తుంది, ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది, ఫలితంగా క్రమరహిత ఋతు చక్రంఏర్పడుతుంది. తక్కువ బరువు, తక్కువ ఈస్ట్రోజెన్ ఉత్పత్తి వంటి హార్మోన్ల అసమతుల్యతకు కూడా దారితీస్తుంది. తక్కువ ఈస్ట్రోజెన్ స్థాయిలు అండము విడుదలయ్యే ప్రక్రియను ప్రభావితం చేస్తాయి. ఇది గర్భధారణ సమయంలో కూడా సమస్యలకు దారితీస్తుంది.

ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం ద్వారా ఆరోగ్యకరమైన గర్భధారణ సంభావ్యత పెరుగుతుంది.

అధిక శారీరక శ్రమ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందని తెలిసినందున దానిని అతిగా చేయవద్దు.

ఆరోగ్యకరమైన ఆహారానికి కట్టుబడి ఉండండి

మనం తినే ఆహారం మన సాధారణ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని మనకు ఎన్నో తరాల తరబడి చెప్పబడింది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం అన్ని శరీర వ్యవస్థల సరైన పనితీరుకు దోహదపడుతుంది. కొన్ని ఆహారాలను తినడం వలన సంతానోత్పత్తిని పెరుగుతుందనే దానిని నిరూపించడానికితగిన ఆధారాలు లేవు. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పాటించడం ద్వారా సమర్థవంతంగా పనిచేసే ఆరోగ్యకరమైన పునరుత్పత్తి వ్యవస్థను సాధించవచ్చు:

 

ఆల్కహాల్ మరియు పొగాకును విడిచిపెట్టండి

మద్యం మరియు పొగాకు ఒక వ్యక్తి యొక్క పూర్తి ఆరోగ్యంపై కొన్ని తీవ్రమైన ప్రభావాలను చూపిస్తాయి. ఆల్కహాల్ వినియోగం అండం విడుదల ప్రక్రియను ప్రభావితం చేసే ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది గర్భం దాల్చే అవకాశాలను దెబ్బతీస్తుంది. సిగరెట్లలో ఉండే పొగాకు మరియు ఇతర రసాయన పదార్థాలు, మహిళల్లో అండముల నాణ్యత మరియు సంఖ్యను తగ్గించడం ద్వారా గర్భధారణ అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇది అస్థిర ఋతు చక్రాలకు కూడా కారణమవుతుంది.

మల్టీవిటమిన్లు లేదా ప్రసవానికి ముందు విటమిన్లు తీసుకోవడం పరిగణించండి

మీరు గర్భం దాల్చాలని యోచిస్తున్నట్లయితే సమతుల ఆహారంతో పాటు, మల్టీవిటమిన్లు లేదా ప్రసవానికి ముందు విటమిన్ లను తీసుకోవడం గురించి ఆలోచించండి. ఏదైనా విటమిన్ లోపం ఉన్నట్లయితే, మీ దినచర్యలో విటమిన్ బి, నియాసిన్ మరియు ఫోలిక్ ఆమ్లం వంటి మల్టీవిటమిన్ లను జోడించడం, పునరుత్పత్తి వ్యవస్థకు అదనపు పోషణను అందిస్తుంది, గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది.

ప్రసవానికి ముందు విటమిన్లు తీసుకోవడం, పిండం యొక్క ఆరోగ్యకరమైన అభివృద్ధికి మరియు పుట్టబోయే బిడ్డలో పుట్టుక లోపాలను నివారించడానికి సహాయపడతాయి.

ఒత్తిడిని తగ్గించడానికి సమయం కేటాయించండి

మానసిక మరియు మనస్తత్వ శ్రేయస్సు పురుషుల మరియు మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళన మరియు ఏదైనా ఇతర మానసిక పరిస్థితులు అండం విడుదలయ్యే ప్రక్రియ మరియు ఋతు చక్రంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.

ధ్యానం, యోగా మరియు అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స మొదలైనవి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడతాయి.

తగినంత విశ్రాంతి మరియు మంచి నిద్ర కూడా ఒత్తిడిని ఎదుర్కోవడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.

రాత్రి షిఫ్టుల్లో పనిచేయడం మానుకోండి, ఎందుకంటే ఇది ఆడవారిలో హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, గర్భధారణ అవకాశాలను ప్రభావితం చేస్తుంది.

మీరు కెఫిన్ తీసుకోవడం పరిమితం చేయండి

FDA ప్రకారం, రోజుకు 400 మిల్లీగ్రాముల కన్నా తక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఎటువంటి ప్రతికూల దుష్ప్రభావాలు ఉండవు. అయితే, కెఫిన్ తీసుకోవడం వలన దాని ప్రభావం మరియు స్త్రీ సంతానోత్పత్తి మధ్య సంబంధం అసంపూర్తిగా ఉంటుంది.

సురక్షితంగా ఉండటానికి కెఫిన్ రోజువారీ వాడకం 1-2 కప్పుల కాఫీకి పరిమితం చేయడాన్ని పరిగణలో తీసుకోండి.

పర్యావరణ విషపూరిత పదార్థాలకు గురికాకుండా ఉండండి

నీరు, గాలి మరియు ఆహారం వంటి ప్రాథమిక మానవ అవసరాలలో పర్యావరణ కాలుష్యాలు మరియు రసాయనాలు ఉండటమనేది అనేక విధాలుగా సంతానోత్పత్తికి నష్టం కలిగిస్తుంది. ఈ విషపూరిత పదార్థాలకు గురైన మహిళలు అండం విడుదల కావడంలో రుగ్మతలు, బలహీనమైన ఎండోక్రైన్ పనితీరు మొదలైన వాటితో బాధపడుతున్నారు.

గృహన్ని శుభ్రపరిచే ఉత్పత్తులు, అందానికి వాడే ఉత్పత్తులు మొదలైన రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులలో ఈ విషాలలో కొన్ని కనిపిస్తాయి. సేంద్రీయ లేదా సాపేక్షంగా తక్కువ హానికరమైన ప్రత్యామ్నాయాలను కనుగొనడానికి ప్రయత్నించండి. సంతానోత్పత్తిని ప్రభావితం చేసే హానికరమైన రసాయనాలకుదూరంగా ఉండండి లేదా గురి కాకుండా ఉండటానికి ప్రయత్నించండి.

పైన పేర్కొన్న చిట్కాలు సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. కానీ మీరు గర్భం ధరించలేకపోతే, అది కొన్ని అంతర్లీన సంతానోత్పత్తి సమస్యల వల్ల కావచ్చు. గర్భం దాల్చే అవకాశాలను పెంచడానికి సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి.

Was this article helpful?
YesNo
Exit mobile version