శ్వేత, ఒక 34 ఏళ్ల మహిళ మరియు ఆమె 35 ఏళ్ళ భర్త వెంకట్, పెళ్ళై ఐదు సంవత్సరాలైన పిల్లలు లేకపోవడం వలన నిరాశ చెందారు, సంతానం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు, అప్పుడు వారు వరంగల్లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్కు వెళ్లారు. శ్వేతకు, పాలీసిస్టిక్ ఓవరీస్ మరియు ఎడమ ఫాలోపియన్ నాళంలో ఒక అడ్డంకిని కలిగి ఉన్నారు. మరొకవైపు వెంకట్ క్రిప్టోజూస్పెర్మిక్ (తాజాగా తీసుకున్న నమూనాలో స్వల్ప వీర్య గాఢత కలిగి ఉండుట).
ఈ జంట గతంలో బహుళ సంతానోత్పత్తి వైఫల్యాలను ఎదుర్కొన్నారు మరియు గర్భధారణ పొందలేకపోయారు. వీరి యొక్క పూర్తి వైద్య పరమైన చరిత్ర తీసుకోబడింది మరియు వారి కోసం ఒక చికిత్సా ప్రణాళిక రూపొందించబడడానికి ముందుగా క్రమవారీ పరీక్షలు సూచించబడ్డాయి. భర్తకు ఒక టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్ (టిఇఎస్‌ఎ) సూచించబడింది. టిఇఎస్‌ఎలో, వృషణాలలో సూదిని ఉంచడం ద్వారా వీర్యాన్ని వృషణాల నుండి పొంది, ప్రతికూల ఒత్తిడి ద్వారా ద్రావణాన్ని మరియు కణజాలాన్ని పొందాలి. ఈ ప్రక్రియ సాధారణంగా స్థానిక లేదా సాధారణ అనస్తీషియా క్రింద చేయబడుతుంది.
చూడడానికి, ఈ కేసు సూటిగా సులభంగా కనిపించినా, ఐవిఎఫ్ చికిత్స సమయంలో, శ్వేతకు అనేక చిన్నచిన్న ఫోలికల్స్ తో చాలా నెమ్మదైన ఫోలిక్యులర్ వృద్ధి ఉందని గమనించబడింది, కాబట్టి, వారికి శోధననాళికలో పరిపక్వత (ఐవిఎం) విధానం సూచించబడింది.
శోధననాళికలో పరిపక్వత అంటే మహిళలో అండాలు పరిపక్వం కాకముందే వాటిని సేకరించే ఒక సహాయక పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానం. ఐవిఎంలో, అండాలు, శరీరం వెలుపల ఒక పెట్రి-డిష్ లో పరిపక్వత ప్రక్రియ జరపబడతాయి. అయితే, ఐవిఎఫ్ లో, మహిళ శరీరంలో హార్మోనులు ఇంజెక్ట్ చేయడం ద్వారా పరిపక్వత ప్రేరేపించబడుతుంది. ప్రయోగశాలలో అండాలు పరిపక్వత ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, వాటిని ఫలదీకరణం చెందించి, అభివృద్ధి చెందుతున్న పిండం ఇంప్లాంటేషన్(స్థాపన) కోసం మహిళ యొక్క గర్భాశయానికి బదిలీ చేయబడతాయి.
ఐవిఎంలో పాలీసిస్టిక్ ఓవరీస్ (పిసిఓ) ఉన్న మహిళలకు మరియు ఆన్కోఫెర్టిలిటీ రోగులకు రోగి-అనుకూల ప్రేరేపణ ప్రోటోకాల్ ఉంటుంది. మహిళలకు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనేది త్వరగా కలుగుతుంది కాబట్టి, పిసిఓఎస్ ఉన్న మహిళలకు ఐవిఎం తగిన విధానం, మరియు ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణహానిని కూడా కలిగించవచ్చు.
క్యాన్సర్ నుండి కోలుకుంటున్న మహిళలకు కూడా ఐవిఎం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే క్యాన్సర్ కణాలు కూడా అండోత్సర్గమును ప్రేరేపించే హార్మోన్ల ద్వారా ప్రేరేపించబడతాయి. తక్కువ స్థాయి హార్మోన్ల ఉపయోగం తిరగబెట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శ్వేత యొక్క పరిస్థితి దృష్ట్యా, ఐవిఎం సూచించబడింది మరియు ప్రయోగశాలలో స్త్రీ బీజ మాతృకణాలు పునరుద్ధరించబడి, పరిపక్వం చేయబడిన తరువాత, వారు ఒక ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసిఎస్‌ఐ) ద్వారా భర్త యొక్క టిఇఎస్‌ఎ వీర్య కణాలతో ఫలదీకరణ చేశారు. తరువాత ఆమెకు బహుళ పాలిప్స్ ఉందని వెల్లడించడానికే ఒక నిర్ధారణ హిస్టరోస్కోపీ విశ్లేషణ చేయబడింది, కాబట్టి ఒక పాలీపెక్టమీ నిర్వహించబడింది, ఇందులో పాలిప్స్ అన్నీ కూడా తొలగించబడ్డాయి.
తరువాత ఘనీభవించిన పిండాన్ని బదిలీ చేయడం జరిగింది మరియు శ్వేత కవలలతో గర్భం దాల్చింది. చికిత్స విజయవంతమైంది, మరియు ఆ జంట, 2.5 మరియు 2.8 కిలోల బరువున్న ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చారు. అలా, వ్యక్తిగతీకరించిన చికిత్స, నిపుణుల మార్గనిర్దేశనము, మరియు ఆ జంట సడలని నిబద్ధత, వారు తల్లిదండ్రులు కావాలనే కలను ఒయాసిస్ ఫెర్టిలిటీలో సాకారం చేసుకోగలిగారు.