5 సంవత్సరాలనుండి వివాహితులైన శివ (35), శైలజ (33) లు, ప్రాథమిక వంధ్యత్వానికి గురయ్యారని తేలింది. వారు OI TI ప్రక్రియల్లో అనేక సార్లు విఫలమైన తరువాత తీవ్రమైన PCOD తో ఒయాసిస్ ఫెర్టిలిటీకి పంపబడ్డారు. వరంగల్లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ యొక్క క్లినికల్ హెడ్ మరియు సంతానోత్పత్తి నైపుణ్యులైన Dr Jalagam Kavya Rao భార్యాభర్తలిద్దరికీ సంతానోత్పత్తి మూల్యాంకనాన్ని నిర్వహించారు. పరిశోధనల తర్వాత, శైలజకు 11.7 AMH మరియు క్రమములేని ఋతు చక్రం ఉన్నట్లు కనుగొనబడింది. శుక్రకానాల చలనం కొద్దిగా మందగించినా భర్త యొక్క శుక్రకణాల గణాంకం సాధారణంగానే ఉంది.
Dr Kavya దంపతులను క్షుణ్ణంగా పరిశోధించి, మొదట్లో IUI ప్రక్రియకు ప్రణాళిక వేశారు. చికిత్స సమయంలో విరివిగా ఫోలికల్స్ కనిపించనందున, Dr Kavya రోగికి IVF తీసుకోవాలని సలహా ఇచ్చారు. కానీ పేసేంట్ IVF తో ముడిపడి యున్న ఇంజెక్షన్లు, మందులు, శారీరక, భావోద్వేగాలు మరియు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందుతున్నందున, డాక్టర్ కావ్య రోగికి సాంప్రదాయ IVF కు ప్రత్యామ్నాయంగా ఔషధ రహిత IVF విధానమైన CAPA IVM ను సూచించారు, ఇది చవక మరియు సులువుగా ఉండటం వల్ల జంటకు ఆశ మరియు విశ్వాసాన్ని కలిగిస్తుంది.
*గోప్యతను కాపాడేందుకు దంపతుల పేర్లు మార్చబడ్డాయి
CAPA IVM అంటే ఏమిటి?
కొంత మంది గర్భం దాల్చడంలో మంచి ఫలితాలను ఇచ్చిందని చూపబడుతుంది. IVM చాలా సంవత్సరాలుగా అందుబాటులో ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో జోడించబడిన ప్రీ-మెచ్యూరేషన్ స్టెప్ గతంలో చూసిన దానికంటే మెరుగైన ఫలితాలను చూపించింది.
CAPA IVM అనేది ఔషధ రహిత IVF చికిత్స మరియు సాంప్రదాయ IVF తో పోల్చదగిన ఫలితాలను కూడా అందిస్తుంది. బైఫాసిక్ ఇన్ విట్రో మెచ్యూరేషన్ అని కూడా పిలుస్తారు, ఇది IVM ప్రోటోకాల్ యొక్క అధునాతన వెర్షన్ మరియు భారతదేశంలో ఈ చికిత్సలో నైపుణ్యం మరియు అనుభవం ఉన్న ఏకైక కేంద్రం ఒయాసిస్ ఫెర్టిలిటీ.
CAPA IVM చికిత్స మందులు, మరియు హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకోవడం గురించి ఆందోళన చెందుతున్న మహిళలకు మరియు తక్కువ ఖర్చుతో సులువైన చికిత్సకోసం ఎదురుచూస్తున్న వారికీ వరంలా వచ్చింది.
CAPA IVM ఎవరికి సిఫార్సు చేయబడవచ్చు?
• PCOS ఉన్న మహిళలకు
• (IVF అనేది రెండు వారాల ప్రక్రియ) కాబట్టి ప్రాణాంతక సమస్యలున్న లేదా తక్షణ చికిత్స అవసరమయ్యే రోగులకు తగినది కాదు
• రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న వారికి
• థ్రోంబోఫిలియా రోగులకు మరియు
• ఓసైట్ పరిపక్వత సమస్యలు ఉన్నవారికి
Dr Kavya ఒక జంట కోసం మొదట IUI ప్రోటోకాల్‌ను ప్లాన్ చేసారు, అందులో భాగంగా 2 రోజులు (3వ రోజు & రోజు 5) లెట్రోజోల్ + HMG 75 IU తరువాత 2 మోతాదుల గోనాడోట్రోపిన్‌లు ఇవ్వబడ్డాయి మరియు గోనాడోట్రోపిన్‌తో పాటు లెట్రోజోల్ 3 వ రోజు నుండి 7 వ రోజు వరకు వారికి ఇవ్వబడింది. 9,11,13,16 రోజులలో ఫోలిక్యులర్ స్కాన్ జరిగింది. 18వ రోజున 4 HMG 150 ఇంజెక్షన్ ఇవ్వబడింది, కానీ ఎటువంటి అధికమైన ఫోలికల్ కనబడలేదు. ఆ ప్రక్రియ కాలమంతటా శైలజకు డెక్సామెథాసోన్ (1 మి.గ్రా) ఇవ్వబడింది. 21వ రోజు, శైలజకు పిసిఒడి నిరోధక శక్తి ఉన్నట్లు గుర్తించడంతో ప్రక్రియ రద్దు చేయబడింది.
శైలజకు అతి తక్కువ ఇంజెక్షన్లతో మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గర్భం దాల్చేలా చేసే అధునాతన ఔషధ-రహిత ప్రోటోకాల్ అయిన CAPA IVM ని అందించాలని Dr Kavya నిర్ణయించుకున్నారు. ఆమె పీరియడ్స్‌లో 1, 2 మరియు 3వ రోజున, మెనోపూర్ 150 ఇవ్వబడింది మరియు 3వ డోస్ తర్వాత, శైలజ నుండి అపరిపక్వ అండాశయాలు తిరిగి పొందబడ్డాయి మరియు పరిపక్వత యొక్క 2 దశలు నిర్వహించబడ్డాయి.
ఎ. 24-గంటల ప్రీమెచ్యూరేషన్ స్టెప్‌లో (సి-టైప్ నేట్రియురేటిక్ పెప్టైడ్ కలిగి ఉన్న మాధ్యమం)లో ఓసైట్లు పెంచబడ్డాయి.
బి. ఈ ఓసైట్‌లు (ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ & యాంఫిరెగులిన్‌ని కలిగి ఉన్న మాధ్యమం)లో మళ్లీ 30 గంటల పరిపక్వ దశలో పొడగబడ్డాయి.
ప్రీమెచ్యూరేషన్ దశ ఓసైట్‌ల పరిపక్వత సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, దీని తర్వాత ICSI చేయవచ్చు. 20 ఓసైట్లు తిరిగి పొందబడ్డాయి మరియు ఫలదీకరణం జరిగింది, ఆ తర్వాత 3వ రోజు 8 గ్రేడ్ 1 పిండాలను పొందారు. 3వ రోజు 4 గ్రేడ్ 1 పిండాలు స్తంభింపజేయబడ్డాయి మరియు మిగిలినవి 5వ రోజు వరకు కల్చర్ చేయబడ్డాయి. 2 రోజులు 3 మరియు 1 రోజు 5 బ్లాస్టోసిస్ట్తో సీక్వెన్షియల్ పిండ బదిలీ జరిగటంతో భారతదేశంలో మొదటి CAPA IVM బేబీ పుట్టుకకు దారితీసింది. Dr Kavya మరియు ఆమె పిండ శాస్త్రవేత్తల బృందం యొక్క పరిశోధనా యజ్ఞం, నిబద్ధత మరియు పట్టుదల చరిత్ర సృష్టించాయి. ఎన్నో సంవత్సరాలుగా శారీరక, మానసిక, ఆర్ధిక ఒత్తిళ్లుకు గురి అవుతు కూడా విలమైన చికిత్స పొందుతూవచ్చిన తరువాత చివరకు ఇంజెక్షన్లు గాని, బాధలు గాని అధిక ఖర్చులు గాని లేకుండా సానుకూల ఫలితాన్ని పొందడంతో ఈ జంట సంతోషంగా ఉన్నారు.