Author: Dr. D Maheshwari, Consultant & Fertility Specialist
అండాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. ఇది అండాశయాలు, ఫెలోపియన్ గొట్టాలు మరియు పెరిటోనియంలో సంభవిస్తుంది. అండాశయ క్యాన్సర్ లను నిరపాయమైన (ప్రాణాంతకం కాని), సరిహద్దు (ప్రాణహానికి తక్కువ సంభావ్యత) లేదా ప్రాణాంతక (క్యాన్సర్) గా వర్గీకరించవచ్చు.
కుటుంబ చరిత్ర ఉన్న మహిళల్లో అండాశయ క్యాన్సర్ నివారణ మినహా మరొక మార్గం లేదు. అదనంగా, జన్యు చరిత్ర లేని వృద్ధ మరియు రుతుక్రమం ఆగిన మహిళలకు కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ భయానకమైనది, మరియు దానికి సంబందించిన చికిత్స మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న కారణంగా ఇది కష్టతరమైనది. క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళల్లో, క్యాన్సర్ మరియు దాని చికిత్స రెండింటి వలనా సంతానోత్పత్తి సమస్యలు సంభవిస్తాయి. క్యాన్సర్ చికిత్సలు స్త్రీ సంతానోత్పత్తిని శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి.
క్యాన్సర్ చికిత్స వల్ల ఏర్పడే సంతానోత్పత్తి సమస్యలు
అండాశయ క్యాన్సర్ చికిత్స అండాశయాలు మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల బలహీనమైన పనితీరుకు దారితీస్తుందని తెలుసుకోవడం అవసరం.
అండాశయ క్యాన్సర్ కు సాధారణ చికిత్సలలో రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ మరియు శస్త్రచికిత్స ద్వారా అండాశయాల తొలగింపు ఉన్నాయి.
కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ కోసం ఉపయోగించే బలమైన మెడికల్ ఏజెంట్లు మరియు రేడియేషన్, అండాశయాలను దెబ్బతీస్తాయి. అండాశయాలు అపరిపక్వ అండాలకు నిలయంగా ఉంటాయి మరియు వీర్యం ద్వారా ఫలదీకరణ కోసం ప్రతి నెలా ఋతుచక్ర సమయంలో పరిపక్వత చెందిన అండాన్ని విడుదల చేస్తాయి. అండాశయాలకు ఏదైనా నష్టం జరిగితే, అండాల నాశనం జరిగి వంధ్యత్వం సంభవించవచ్చు మరియు ముందస్తుగానే ఋతువిరతి జరిగే అవకాశం ఉంది.
కొంతమంది మహిళల్లో క్యాన్సర్ చికిత్స ముందస్తు రుతువిరతికి కారణమవుతుంది, అండాశయ పనితీరు లేకపోవడం వల్ల శాశ్వత వంధ్యత్వం ఏర్పడుతుంది. కీమోథెరపీకి గురైన కొంతమంది మహిళల్లో, చికిత్స
తర్వాత కొంతకాలానికి ఋతుస్రావం తిరిగి సంభవించినప్పటికి, వారు ఇప్పటికీ సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుదలతో బాధపడవచ్చు.
యువతుల్లో రేడియేషన్ థెరపీ ముందస్తు రుతువిరతి ప్రారంభానికి కారణమవుతుంది.
సంతానోత్పత్తి రక్షణ
కాన్సర్ చికిత్స ప్రారంభించడానికి ముందు మీ సంతానోత్పత్తి సామర్ధ్యం పై చికిత్స వలన ఏర్పడే నష్టాలు మరియు దాని ప్రభావం గురించి మీ ఆంకాలజిస్ట్ తో మాట్లాడండి. మీ సంతానోత్పత్తి సంరక్షణ ఎంపికల గురించి తెలుసుకోవడానికి సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి.
సంతానోత్పత్తి సంరక్షణ అనేది ఐచ్చికాలను అంచనా వేయడం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది:
వయస్సు
- క్యాన్సర్ రకం మరియు దశ
- అండాశయ రిజర్వ్
- మొత్తం ప్రక్రియ ఖర్చు
అండం మరియు పిండం ఫ్రీజింగ్ : ఇది సంతానోత్పత్తిని కాపాడే ఒక ప్రామాణిక విధానం. మహిళల్లో అండం ఉత్పత్తి హార్మోన్ల ఇంజెక్షన్లతో ప్రేరేపించబడుతుంది మరియు పరిపక్వం చెందిన అండాలను సేకరించి భవిష్యత్ ప్రయోజనాల కోసం భద్రపరుస్తారు. వివాహిత మహిళల్లో, ఈ సేకరించిన అండాలు పిండంగా ఏర్పడటానికి శీతల ప్రయోగశాల పరిస్థితులలో వీర్యంతో ఫలదీకరణం చేయబడతాయి. ఈ పిండం భవిష్యత్తులో పిండ బదిలీ (EMBRYO TRANSFER) కోసం ఉపయోగించబడుతుంది.
శస్త్రచికిత్స ద్వారా తొలగింపు: కొన్ని సందర్భాల్లో, క్యాన్సర్ దాని ప్రారంభ దశలో నిర్ధారణ చేయబడుతుంది మరియు ఒక అండాశయాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది, అప్పుడు ప్రభావితమైన అండాశయాన్ని మాత్రమే శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశం ఉంది. రెండవ ఆరోగ్యకరమైన అండాశయాన్ని సంరక్షించడం ద్వారా శాశ్వత వంధ్యత్వాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది.
అండాశయ కణజాల సంరక్షణ: ఒక భాగం లేదా మొత్తం అండాశయం శస్త్రచికిత్స ద్వారా తొలగించబడుతుంది మరియు క్యాన్సర్ చికిత్స తర్వాత మాత్రమే తిరిగి మార్పిడి చేయడం కొరకు స్తంభింపజేయబడుతుంది.
ఈ విధానం యుక్తవయస్సుకు రాని బాలికలకు మరియు అండాశయ ఉద్దీపన వంటి గర్భధారణ చికిత్సలు చేయించుకోలేని మహిళలకు కూడా చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.
ముగింపు
అండాశయ క్యాన్సర్ లేదా సంబందిత ఏదైనా క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ కావడం ఒత్తిడితో కూడిన మరియు భయానక అనుభవం కావచ్చు. మరియు మీరు సంతానోత్పత్తి గురించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యంగా పిల్లలను కనడం గురించి మీకు స్పష్టత లేకపోతే, అది ఆందోళన కలిగించే పరిస్థితి. మీ మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోండి, క్యాన్సర్ బారిన పడిన వారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే, తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలంగా ఉండే మీ ఐచ్చికాలను మరియు ఎంపికలను అంచనా వేయడంలో సంతానోత్పత్తి నిపుణుడు మీకు సహాయం చేయవచ్చు.