Blog
Enquire Now
Uncategorized

అండాశయ క్యాన్సర్ చికిత్స – సంతానోత్పత్తి సమస్యలు మరియు సంరక్షణ: భవిష్యత్తు కొరకు

అండాశయ క్యాన్సర్ చికిత్స – సంతానోత్పత్తి సమస్యలు మరియు సంరక్షణ: భవిష్యత్తు కొరకు

Author: Dr. D Maheshwari, Consultant & Fertility Specialist

అండాశయ క్యాన్సర్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్. ఇది అండాశయాలు, ఫెలోపియన్ గొట్టాలు మరియు పెరిటోనియంలో సంభవిస్తుంది. అండాశయ క్యాన్సర్ లను నిరపాయమైన (ప్రాణాంతకం కాని), సరిహద్దు (ప్రాణహానికి తక్కువ సంభావ్యత) లేదా ప్రాణాంతక (క్యాన్సర్) గా వర్గీకరించవచ్చు.

కుటుంబ చరిత్ర ఉన్న మహిళల్లో అండాశయ క్యాన్సర్ నివారణ మినహా మరొక మార్గం లేదు. అదనంగా, జన్యు చరిత్ర లేని వృద్ధ మరియు రుతుక్రమం ఆగిన మహిళలకు కూడా అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారణ భయానకమైనది, మరియు దానికి సంబందించిన చికిత్స మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్న కారణంగా ఇది కష్టతరమైనది. క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళల్లో, క్యాన్సర్ మరియు దాని చికిత్స రెండింటి వలనా సంతానోత్పత్తి సమస్యలు సంభవిస్తాయి. క్యాన్సర్ చికిత్సలు స్త్రీ సంతానోత్పత్తిని శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ప్రభావితం చేస్తాయి.

క్యాన్సర్ చికిత్స వల్ల ఏర్పడే సంతానోత్పత్తి సమస్యలు

అండాశయ క్యాన్సర్ చికిత్స అండాశయాలు మరియు ఇతర పునరుత్పత్తి అవయవాల బలహీనమైన పనితీరుకు దారితీస్తుందని తెలుసుకోవడం అవసరం.

అండాశయ క్యాన్సర్ కు సాధారణ చికిత్సలలో రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ మరియు శస్త్రచికిత్స ద్వారా అండాశయాల తొలగింపు ఉన్నాయి.

కీమోథెరపీ మరియు రేడియేషన్ థెరపీ కోసం ఉపయోగించే బలమైన మెడికల్ ఏజెంట్లు మరియు రేడియేషన్, అండాశయాలను దెబ్బతీస్తాయి. అండాశయాలు అపరిపక్వ అండాలకు నిలయంగా ఉంటాయి మరియు వీర్యం ద్వారా ఫలదీకరణ కోసం ప్రతి నెలా ఋతుచక్ర సమయంలో పరిపక్వత చెందిన అండాన్ని విడుదల చేస్తాయి. అండాశయాలకు ఏదైనా నష్టం జరిగితే, అండాల నాశనం జరిగి వంధ్యత్వం సంభవించవచ్చు మరియు ముందస్తుగానే ఋతువిరతి జరిగే అవకాశం ఉంది.

కొంతమంది మహిళల్లో క్యాన్సర్ చికిత్స ముందస్తు రుతువిరతికి కారణమవుతుంది, అండాశయ పనితీరు లేకపోవడం వల్ల శాశ్వత వంధ్యత్వం ఏర్పడుతుంది. కీమోథెరపీకి గురైన కొంతమంది మహిళల్లో, చికిత్స

తర్వాత కొంతకాలానికి ఋతుస్రావం తిరిగి సంభవించినప్పటికి, వారు ఇప్పటికీ సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుదలతో బాధపడవచ్చు.

యువతుల్లో రేడియేషన్ థెరపీ ముందస్తు రుతువిరతి ప్రారంభానికి కారణమవుతుంది.

Write a Comment