Blog
Enquire Now
Uncategorized

ఐ.వి.ఎఫ్ లో చేయవల్సిన మరియు చేయకూడని పనులు

ఐ.వి.ఎఫ్ లో చేయవల్సిన మరియు చేయకూడని పనులు

ఈరోజుల్లో సంతానలేమి అనే సమస్య చాలా సాధారణం అయిపోయింది,దీనికి కారణం జీవనశైలిలో మార్పులు, పర్యావరణంలో మార్పులు ,ఒత్తిడి , పి.సి.ఓ.డి ,ఉద్దేశపూర్వకంగా పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవడం ,పొగ త్రాగడం ,నిద్రలేమి మరియు పలు రకాల ఇతర కారణాలు .దంపతులు యొక్క పూర్వ వైద్య చరిత్ర మరియు అనువంశిక పరిస్థితులు కూడా సంతానలేమికి దారి తీస్తున్నాయి .ఐ .వి.ఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)అనేది కృత్రిమంగా సంతానం కలిగేలా చేసే వైద్య చికిత్సలలో ఒక పద్దతి,,ఇది దంపతులని సంతానలేమి సమస్యని అధిగమించేలా చేసి వాళ్ళు తల్లితండ్రులు అయ్యేలా చేయడంలో సాయపడుతుంది .

ఐ .వి.ఎఫ్ ప్రక్రియ ఏంటి ?

ఐ .వి.ఎఫ్ చికిత్సలో స్త్రీ యొక్క అండాలు సేకరిస్తారు, చికిత్స తర్వాత ఈ అండాలు భాగస్వామి యొక్క వీర్యంతో ఫలదీకరణం జరుగుతాయి దానివలన పిండం రూపు దిద్దుకుంటుంది .తర్వాత దశలో ఆ పిండాలు ప్రతిష్ఠాపన కోసం మరియు మున్ముందు ఎదుగుదల కోసం గర్భాశయంలోకి బదిలీ చేయబడతాయి.

ఐ .వి.ఎఫ్ ఎప్పుడు చేయించుకోవాలి ?

ఐ .వి .ఎఫ్ చికిత్సని మాములుగా ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినపుడు ,తీవ్రమైన పురుష సంతానలేమి సమస్య ఉన్నప్పుడు ,దంపతుల యొక్క సంతానలేమికి కారణం తెలుసుకోలేనప్పుడు లేదా ముందుగా తీసుకున్న వొవ్యులేషన్ ఇండక్షన్ మరియు ఇంట్రా యుటెరిన్ ఇన్సెమినేషన్ చికిత్సలు విఫలమైనప్పుడు సూచిస్తారు .ఐ .వి.ఎఫ్ చికిత్స తీసుకోవాలా లేదా అనే నిర్ణయం ఆ దంపతుల యొక్క పూర్వ వైద్య చరిత్ర ,వారి వయసు ,వారు సంతానలేమితో బాధపడుతున్న సమయం మీద ఆధారపడి ఉంటుంది.

చేయవలిసిన పనులు:

  • సరైన సంతానసాఫల్య కేంద్రాన్ని ఎంచుకోవాలి:

బయట సంతానసాఫల్య కేంద్రాలు చాలా అందుబాటులో ఉన్నాయి ,కానీ అత్యాధునిక అధునాతమైన ల్యాబ్ లు, పరికరాలు మరియు అత్యంత అర్హత ఉన్న మరియు నైపుణ్యం ఉన్న వైద్య నిపుణులు ఉన్న సంతానసాఫల్య కేంద్రాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం . ఐ.వి ఎఫ్ అనేది ఒక దీర్ఘ కాలం పాటు జరిగే ప్రక్రియ కాబట్టి ఈ ప్రక్రియ జరుగుతున్నంత కాలం మీరు మీ వైద్యుడితోనూ అలాగే ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు మిమ్మల్ని ముందుకు నడిపించే సహాయక సిబ్బందితోను, సత్సంబంధాలు కలిగి ఉండడం చాలా అవసరం. ఏ కేంద్రంలో అయితే చికిత్సకి వచ్చే వారికీ మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చి ,విలువైన ,పారదర్శకమైన,మెరుగైన ఫలితం అందించే చికిత్స ఇవ్వడంలో దృష్టి పెడతారో ఆ కేంద్రాన్ని ఎంచుకోవాలి.

  • ఐ .వి.ఎఫ్ యొక్క పూర్తి ప్రక్రియ ని తెలుసుకోండి:

మీరు ఐ.వి.ఎఫ్ చికిత్సని మొదలుపెట్టే ముందు,ఐ .వి .ఎఫ్ ప్రక్రియ లో జరిగే ప్రతి ఒక దశ గురించి స్పష్టంగా అర్ధం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.ఐ .వి .ఎఫ్ అనేది మీకు భావోద్వేగంగాను ,శారీరకంగానూ , మానసికంగానూ కొంచెం కష్టమనిపించే ప్రయాణం కనుక సరైన ప్రణాళిక మరియు జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా ఈ మొత్తం ప్రక్రియ చాలా సులువు అవుతుంది. మీకు చికిత్స చేస్తున్న వైద్యుడితో సరిగ్గా చర్చించి మీ సందేహాల్ని మరియు ఆందోళనలని పూర్తిగా తొలగించుకోండి ,దాని మూలంగా మీరు ఈ ప్రయాణంలో సరైన విశ్వాసంతో మరియు ఆశావాదంతో ముందు అడుగు వేయచ్చు.

  • ఆర్థికపరమైన అంశాల గురించి అర్ధం చేసుకోండి:

మీరు ఐ .వి .ఎఫ్ చికిత్స తీసుకునే ముందు వైద్యుడితో లేదా సలహాదారు తో డబ్బు ల గురించి మాట్లాడండి , వివిధ రకాలైన చెల్లింపు విధానాల గురించి తెలుసుకోండి ,ఈ .ఎం .ఐ లేదా ఇన్సూరెన్సు లాంటి వివరాల గురించి తెలుసుకోవడం ద్వారా మీరు ముందుగానే ఒక ప్రణాళికని రూపొందించుకుని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

  • మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి:

ఐ .వి .ఎఫ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు,స్త్రీలకు హార్మోనల్ ఇంజక్షన్ లు ఇస్తారు, అండోత్పత్తి అభివృద్ధి జరిగేలా ప్రేరేపించడానికి .హార్మోన్ లు మీలో భావోద్వేగ పరంగా చాలా మార్పులు తీసుకు వస్తాయి అవేంటంటే ఆందోళన, విచారం ,చిరాకు మరియు నిరుత్సాహం మొదలైనవి .ధ్యానం చేయడం మరియు ఐ.వి.ఎఫ్ విధానం గురించి పూర్తిగా అవగానే కలిగి ఉండడం అనేది మీరు ప్రశాంతంగా ఉండడానికి మీకు సాయపడుతుంది.

  • మీ వైద్యులు చెప్పిన దానికి కట్టుబడి ఉండండి:

ఐ .వి.ఎఫ్ చికిత్స జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలైన ,జీవనశైలి లో పాటించాల్సిన మార్పులు అయినా ,బరువు పెరగడం లేదా తగ్గడం అయినా ,ఏ ఏ మందులు వేసుకోవాలనే విషయం అయినా ఖచ్చితంగా మీ సంతానోత్పత్తి వైద్య నిపుణుల సలహా మాత్రమే పాటించండి .ఒకవేళ ఏమైనా సందేహాలు ఉంటే.ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే ఎల్లప్పుడూ ముందుగా మీ వైద్యుడ్ని సంప్రదించండి.

  • సహాయం అడగడానికి సిగ్గు పడకండి:

ఐ .వి .ఎఫ్ అనేది ఒక రోలరు కోస్టర్ లో చేసే ప్రయాణం లాంటిది .కుటుంబం నుంచి గాని,స్నేహితుల నుంచి గాని లేదా మానసిక వైద్య నిపుణుల నుంచి గాని సహాయం అడగడానికి చింతించకండి . నిర్దిష్టమైన ఐ.వి.ఎఫ్ సహాయక సమూహాలు మీ ప్రయాణం సజావుగా సాగేలా మీకు సహాయం చేస్తాయి.

  • ఒత్తిడిని తగ్గించేవాటి గురించి ఆలోచించండి:

మీకు ఒక వేళ ఆందోళన ,విచారం ,అతి ఉత్సాహం మరియు నిరుత్సాహం మొదలైనవి కలగచ్చు.మీరు నిత్యం స్పూర్తితో ఉండడానికి మరియు ఆశావాదంతో ఉండడానికి సహాయపడే అలవాటుని ఎంచుకొని దానిని కొనసాగించండి ,వాస్తవానికి దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే పెట్టుకోవడం చాలా ముఖ్యం .ఓర్పు అనేది విజయానికి తొలి మెట్టు .ఎప్పుడు వెనకడుగు వేయని వైఖరి తో ఉండాలని మాత్రం గుర్తుంచుకోండి.

చేయకూడని పనులు:

  • పొగ త్రాగడం:

ధూమపానం అనేది గర్భధారణ అవకాశాలని చాలా వరకు తగ్గించేస్తుంది .ఇది వీర్యం యొక్క నాణ్యత, పరిమాణం మరియు చలనశీలతని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. స్త్రీల విషయానికి వస్తే ధూమపానం అనేది స్త్రీలయొక్క అండాల నాణ్యతని క్షీణించేలా చేసి వారికీ గర్భస్రావం జరిగే అవకాశాలని పెంచుతుంది.

  • మద్యపానం:

మద్యపానం చేయడం వల్ల గర్భధారణ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి.

  • తీవ్రంగా వ్యాయామం చేయడం:

తీవ్రంగా వ్యాయామం చేయడం అనేది ఐ .వి .ఎఫ్ చికిత్సని దెబ్బతీయవచ్చు .బరువు తగ్గడం అనేది ముఖ్యమే ఎందుకంటే దాని వలన గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి ,కానీ మీ మీద మీరు ఎక్కువ ఒత్తిడి వేసుకోకండి ఐ వి ఎఫ్ చికిత్స లో ఒక మోస్తరు వ్యాయామం మాత్రమే సిఫారసు చేయబడుతుంది.

కొంత మంది దంపతులకి తల్లి తండ్రులు కావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ,ఇంకొంచెం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది .కానీ ,తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండడం మరియు విశ్వాసం తో ఉండడం చాలా ముఖ్యం.

గుర్తుంచుకోండి  మంచి విషయాలన్నిటికి సమయం పడుతుంది.

మీరు తల్లి తండ్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

మేము అందించిన ఐ వి ఎఫ్ చికిత్స లో మేము పొందిన సత్ఫలితాలు గురించి తెలుసుకోవాలనుకుంట మమ్మల్ని సందర్శించండి .

Write a Comment