Blog
BOOK A FREE CONSULTATION
Case Study

అమ్మ నాన్న అవ్వాలన్న ఎన్నో ఏళ్ళ కల పి.జి .టి -ఏ [PGT -A ]తో సాకారం

స్నేహ అనే 34 ఏళ్ళ మహిళకి ,36 ఏళ్ళ తన భర్త సంజయ్ తో పెళ్లి అయ్యి 9 ఏళ్ళు అయింది ,వాళ్ళు చాలా ఆశతో సంతానం పొందడానికి గత 6 సంవత్సరాలుగా కొన్ని సంతానోత్పత్తి చికిత్సలు తీసుకున్నారు కానీ అవి ఏమి ఫలించలేదు వాళ్ళు పూణే లో ని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ని సందర్శించనంత వరకు .ఈ దంపతలుకు గతంలో చాలాసార్లు వాళ్ళు తీసుకున్న సంతానోత్పత్తి చికిత్సలు విఫలమైన చరిత్ర ఉంది ,అంతే కాకుండా 4 సార్లు జరిగిన కృత్రిమ గర్భధారణ విధానం లో రెండు సార్లు గర్భస్రావం కూడా జరిగింది .వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకున్న తర్వాత తేలింది ఏంటంటే స్నేహ కి బై లేటరల్ ట్యూబల్ బ్లాక్ మరియు క్రోమోజోమ్ లు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయి .అయితే సంజయ్ కి సాధారణ డి .ఎఫ్. ఐ[డి ఎన్ ఏ వీర్యం లోని సమగ్రతని ,నష్టాన్ని తెలియజేస్తుంది]విలువ 24 శాతం ఉంది.

ఆ దంపతుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం వాళ్ళ పైబడుతున్న వయసు ,మునుపు గర్భ స్రావం జరగడం వంటివి పరిగణన లోకి తీస్కుని వైద్యులు ఒక చికిత్స విధానం రూపొందించారు ,అదేంటంటే గర్భధారణ అవకాశాలు పెరగడానికి, పిండాలని బదిలీ చేసే ముందే పిండంలో ఏదైనా సమస్య ఉందో లేదో తెలుసుకోడానికి పి.జి.టి. ఏ [P.G.T-A]పరీక్ష చేయించుకోవడం.

ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్టింగ్ ( పి.జి.టి) [p .g .t ] అనేది జననపూర్వ డయాగ్నోసిస్ లో ఆరంభ దశ ,కృతిమ గర్భధారణ విధానం లో ఒక స్త్రీ గర్భాశయం లో పిండాలని బదిలీ చేయడానికి ముందు ,ఆ పిండం లో అన్నీ సరిగానే ఉన్నాయా లేదో గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు.

జన్యుపరమైన లోపాలు అంటే క్రోమోసోమ్ లేదా క్రోమోసోమ్ భాగాలు అధికంగా ఉండడం లేదా కనిపించకపోవడం ,అవి మాములుగా మానవ పిండం లో ఉండడం వల్ల గర్భస్రావం మరియు పుట్టిన బిడ్డ జన్యుపరమైన లోపాలతో పుట్టడం వంటి వాటికీ దారి తీస్తాయి.

పిండంలో జన్యుపరమైన లోపాలు ఉన్నాయా లేవా అని ఎలా పరీక్షిస్తారు ?

పిండం లోని జన్యుపరమైన మిశ్రమాన్ని విశ్లేషించే పరీక్షని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్టింగ్ అంటారు.

కృత్రిమ గర్భధారణ చికిత్సా చక్రంలో మూడు రకాలైన పి .జి .టి [p . g .t ]పరీక్షలు ఉంటాయి.

P.G.T -A [పి.జి.టి -ఏ]:ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్ట్ ఫర్ అన్యూప్లాయిడీ[క్రోమోజోమ్ సంఖ్య సరిగా లేకపోవడం గురించి నిర్ధారించుకునే పరీక్ష]

P.G.T-M [పి .జి .టి -ఎం]:ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్ట్ ఫర్ మోనోజెనిక్ డిసీజ్.

P.G.T-[S.R] [పి .జి .టి -ఎస్ .ఆర్ ]-ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటికల్ టెస్ట్ ఫర్ స్ట్రక్చరల్ రీ అరెంజ్మెంట్స్.

వీటిలో ఎక్కువగా వైద్యులు ఉపయోగించే రకం P.G.T -A [పి.జి.టి -ఏ] పరీక్ష ,ఇది పిండం గర్భాశయం లోకి బదిలీ చేయడానికి ముందు పిండం సరిగానే ఉందా లేదా అనేది కనిపెడుతుంది ,P.G.T-A [పి .జి .టి. ఏ] పిండానికి జీవధాతు పరీక్ష చేయడంలో దృష్టి పెడుతుంది ,ఎందుకంటే తర్వాత ఆ పిండం గర్భస్థ మావి లో అభివృద్ధి చేయబడుతుంది కనుక .

సంతానోత్పత్తి వైద్య నిపుణులు- గర్భదారణలో సమస్యలు ,మాతృత్వానికి పైబడిన వయసు,మళ్ళీ మళ్ళీ సంతానోత్పత్తి చికిత్సా వైఫల్యం ,మళ్ళీ మళ్ళీ గర్భస్రావం మరియు అధికమైన పురుష వంధ్యత్వం తో బాధపడుతున్న దంపతులకి P.G.T.-A [పి .జి .టి -ఏ]ని సిఫారసు చేసారు.

స్నేహ యొక్క జన్యుపరమైన స్థితిని గమనించిన వైద్యులు,తనకి ఎంబ్రియో పూలింగ్ చేయాలనీ చెప్పారు,అది P.G.T -A [పి.జి.టి -ఏ]లోనే తర్వాత లోబడి ఉంటుంది ,తర్వాత స్నేహకి బ్లాక్ అయిన ఫెలోపియన్ నాళాలకి లాప్రోస్కోపిక్ ఎవాల్యూయేషన్ చేసారు తర్వాత ఏ లోపంలేని పిండాన్ని తన గర్భాశయంలోకి బదిలీ చేసారు.

పిండం బదిలీ విజయవంతమైంది ,స్నేహ గర్భం దాల్చింది.

అలా వ్యక్తిగత శ్రద్ధ తో కూడిన చికిత్సతో ,నిపుణల పర్యవేక్షణలో ,చెక్కుచెదరని దంపతుల దృఢ సంకల్పం తో స్నేహ సంజయ్ ల అమ్మ నాన్న అవ్వాలి అనే కల ఒయాసిస్ ఫెర్టిలిటీ వారి ద్వారా సాకారమైనది.

Write a Comment

BOOK A FREE CONSULTATION