Blog
Enquire Now
Uncategorized

ఐ వి ఎఫ్ చికిత్స గురించి అపోహలు

ఐ వి ఎఫ్ చికిత్స గురించి అపోహలు

దంపతులందరికీ అమ్మానాన్నలుగా మారే ప్రయాణం చాలా భావోద్వేగమైనది ,సంతానం పొందే మార్గం ఒక్కొక్క జంటకి ఒక్కోలా ఉంటుంది .దంపతులు సహజంగా గర్భం దాల్చలేనపుడు ,వారికి సంతానోత్పత్తి చికిత్స సహాయం చేస్తుంది. ఐ వి ఎఫ్ [ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్]అనేది ఒక అధునాతనమైన సంతానోత్పత్తి చికిత్స ,ఇది దంపతులు  తల్లి తండ్రులు అవ్వడానికి సహాయపడగలదు.కానీ చాలామంది ఐ వి ఎఫ్ చికిత్సా విధానాన్ని అర్ధం చేసుకుకోకుండా దాని మీద భయాలని,దురభిప్రాయాలని కలిగి ఉన్నారు .ఐ వి ఎఫ్ చికిత్సా విధానానికి సంబంధించి ఎక్కువగా జనాలలో ఉండే  అపోహల్ని ఒకసారి చూద్దాం.

1 .అపోహ :

ఐ వి ఎఫ్ చికిత్స సత్ఫలితాల్ని అందించడానికి ఆడవారి వయసుతో సంబంధం లేదు

వాస్తవం :

అన్ని వయసుల ఆడవారికి ఐ వి ఎఫ్ చికిత్సలో లభించే ఫలితాలు ఒకేలా ఉండవు ,ఆడవారి వయసు పెరిగే కొద్దీ వారిలో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి కనుక ఐ వి ఎఫ్ చికిత్స సత్ఫలితాన్ని ఇచ్చే శాతం  కూడా తగ్గుతుంది

2 :అపోహ :

ఐ వి ఎఫ్ వల్ల ప్రతిసారీ ముగ్గురు లేదా నలుగురు పిల్లలు పుడతారు

వాస్తవం :

ఇంతకు మునుపు రెండు లేదా మూడు పిండాలను కృత్రిమ పద్దతిలో గర్భంలో ప్రవేశపెట్టడం వలన ఇద్దరు,ముగ్గురు లేదా నలుగురు పిల్లలు పుట్టేవారు ,కానీ ఈరోజుల్లో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉదాహరణకి పి.జి.టి ,ఈ .ఆర్ .ఏ మొదలగు పద్ధతులు అవలంభించడం వల్ల కేవలం ఒక ఆరోగ్యకరమైన పిండాన్ని మాత్రమే కృత్రిమ పద్దతిలో గర్భంలో ప్రవేశపెట్టి ఎక్కువ మంది పిల్లలు కలగకుండా నివారించవచ్చు

3 .అపోహ :

సంతానోత్పత్తి సమస్యలు ఉన్నఅన్ని జంటలకి ఐ వి ఎఫ్ చికిత్స అవసరం

వాస్తవం :

పరిస్థితిని ,తీవ్రతని బట్టి సంతానోత్పత్తి కలుగజేసే చికిత్సలు చాలా రకాలు ఉన్నాయి ఉదాహరణకి అండోత్సర్గ ప్రేరణ సమయంలో సమయానికి సంభోగం చేయడం ,ఐ యూ ఐ మొదలగు పద్ధతులు దంపతులు గర్భం దాల్చడానికి ఉపయోగపడతాయి ,కనుక అన్ని జంటలు ఐ వి ఎఫ్ చికిత్సకి వెళ్లాల్సిన అవసరం లేదు

4 .అపోహ :

 మగవారు ధూమపానం చేయడం అనేది ఐ వి ఎఫ్ సరైన ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణం కాదు

వాస్తవం :

మగవారు ధూమపానం చేయడం వలన ఐ వి ఎఫ్ చికిత్సలో సరైన ఫలితం పొందే అవకాశం తగ్గుముఖం పడుతుంది ,గర్భస్రావానికి కూడా దారి తీస్తుంది

5 .అపోహ :

 ఐ వి ఎఫ్ నూరుశాతం సత్ఫలితాలు ఇస్తుంది

వాస్తవం :

ఐ వి ఎఫ్ చికిత్స సత్ఫలితాన్ని ఇవ్వడం లో చాలా విషయాలు కారణం అవుతాయి,ఐ వి ఎఫ్ మెరుగైన ఫలితాలని  అందించే శాతం 50 నుంచి 70 శాతం గా ఉంది

6 .అపోహ :

ఐ వి ఎఫ్ వల్ల పుట్టే పిల్లలు లోపాలతో పుడతారు

వాస్తవం :

ఈ దురభిప్రాయం వలెనే చాలా మంది ఐ వి ఎఫ్ చికిత్స తీసుకోడానికి భయపడుతున్నారు.ఐ వి ఎఫ్ ద్వారా పుట్టే పిల్లలు సహజంగా గర్భం ధరించడం వల్ల పుట్టే పిల్లల్లాగే ఏ లోపాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు

7 .అపోహ :

ఐ వి ఎఫ్ చికిత్స మొత్తం జరిగే వరకు ఆసుపత్రిలోనే ఉండాలి

వాస్తవం :

ఐ వి ఎఫ్ చికిత్స మొత్తం  పగటిపూట జరుగుతుంది ,ఒకసారి చికిత్స జరిగాక ,వాళ్ళు ఇంటికి వెళ్లిపోవచ్చు ,ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు

ఆలుమగలు మాతృత్వాన్ని పితృత్వాన్ని నిర్దిష్టమైన సమయం దాటిపోయాక ఎక్కువ కాలం ఆలస్యం చేయకూడదు ఒకవేళ వృత్తిపరమైన లక్ష్యాలు మరియు ఇతరత్రా గమ్యాలు మిమ్మల్ని గర్భం దాల్చడానికి కొంతకాలం నిలిపేలా చేస్తే ,అప్పుడు మీరు మీ అండాలను,వీర్యకణాలను,పిండాలను గర్భాశయంలో నిల్వచేసే కృత్రిమ పద్దతిని అవలంభించడం మంచిది దీని వలన మీరు భవిష్యత్తులో కావాలనుకున్నప్పుడు పిల్లల్ని కనగలిగే సామర్ధ్యం ఉంటుంది .

మారుతున్న జీవనశైలి ,స్త్రీలలో సంతానోత్పత్తికి కావలసిన హార్మోన్ ల తగ్గుదల శాతం ,వీర్యకణాలలో నాణ్యత

 లోపించడం మొదలగు సమస్యలు దృష్టిలో  ఉంచుకుని  సరైన సమయానికి ఏ వాయిదా వేయకుండా సంతానోత్పత్తి చికిత్స  తీసుకోవడం   ఉత్తమం.

Write a Comment