Adenomyosis

అడెనోమియోసిస్ – మీరు తెలుసుకోవలసిన సమస్తం

అడెనోమియోసిస్ – మీరు తెలుసుకోవలసిన సమస్తం

Author: Dr Jigna Tamagond, Consultant – Fertility Specialist

గర్భాశయ అడెనోమయోసిస్ అనేది ఒక బాధాకరమైన ఋతుకాలం కంటే కాస్త ఎక్కువ. అడెనోమయోసిస్ గురించి తెలుసుకోవడానికి గర్భాశయం యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం.

గర్భాశయం క్రింద పేర్కొన్న పొరలతో కూడి ఉంటుంది.

మైయోమెట్రియం: బయటి మృదు కండరం.

ఎండోమెట్రియం: ఋతు చక్రంలో పెరిగే లోపలి పొర మరియు తనను తాను మందంగా చేసుకోవడం ద్వారా ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాశయం స్వీకరిస్తుంది.

“జంక్షనల్ జోన్” లేదా “ఇన్నర్ మైమెట్రియం” అనేది ఎండోమెట్రియం మరియు కండరాల పొరను వేరు చేసే ఈ రెండు పొరల మధ్య ఉన్న ప్రాంతం. ఆరోగ్యకరమైన గర్భాశయంలో, ఈ ప్రాంతం యొక్క మందం 2-8 మిమీ వరకు ఉంటుంది.

స్త్రీకి అడెనోమయోసిస్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియాల్ కణజాలం గర్భాశయ కండరాల గోడలోకి పెరుగుతుంది, ఇది జంక్షనల్ జోన్ ను గట్టిపరుస్తుంది. అడెనోమయోసిస్ విషయంలో, ఈ జంక్షనల్ జోన్ యొక్క మందం 12 మిమీ లేదా అంతకంటే ఎక్కువ. ఇది ఎన్లార్జెడ్ గర్భాశయం దారి తీసి తద్వారా ఇతర అసౌకర్య మరియు నొప్పి కలగచేసే లక్షణాలకు దారితీస్తుంది. మైయోమెట్రియంలో తిత్తులు ఉండటం కూడా అడెనోమియోసిస్ స్థితిని సూచిస్తుంది.

35 ఏళ్లు పైబడిన మధ్య వయస్కులైన మహిళలు లేదా ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలలో అడెనోమియోసిస్ అభివృద్ధి చెందడానికి అధిక అవకాశాలు ఉన్నాయి.

ఈ సంకేతాల పట్ల జాగ్రత్త వహించండి:

  • నొప్పితో కూడిన కడుపునొప్పి లేదా కటి నొప్పి
  • సుదీర్ఘమైన మరియు భారీ ఋతు రక్తస్రావం
  • బాధాకరమైన లైంగిక సంపర్కం
  • వంధ్యత్వం

ఈ లక్షణాలు ఇతర అంతర్లీన సమస్యలను కూడా సూచిస్తాయి మరియు ఎండోమెట్రియోసిస్ లక్షణాల మాదిరిగానే ఉంటాయి.

సమస్యలు:

అడెనోమియోసిస్ వ్యాధి ప్రభావిత మహిళల దైనందిన జీవితంపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.

అడెనోమయోసిస్ ఉన్న మహిళలలో రక్తహీనత, వంధ్యత్వం మరియు ఇతర గర్భాశయ పరిస్థితులు అభివృద్ధి జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అడెనోమియోసిస్ మరియు సంతానోత్పత్తి:

స్త్రీలలో సంతానోత్పత్తికి సంబంధించిన వివిధ సమస్యలు తలెత్తుతాయి, ఎందుకంటే అడెనోమియోసిస్ కారణంగా గర్భాశయం వాపుతో భారీగా మారుతుంది. ఇది అనుకూలంగా లేని గర్భాశయ వాతావరణానికి దారితీస్తుంది, ఇది బీజము నిలద్రొక్కుకొనే సమస్యలు మరియు గర్భస్రావ ప్రమాదాలకు దారితీస్తుంది.

సంతానోత్పత్తి సమస్యలకు కారణమయ్యే ఎండోమెట్రియోసిస్ మరియు పాలిప్స్ వంటి ఇతర పరిస్థితులతో అడెనోమయోసిస్ కలిసి ఉందని అధ్యయనాల ఆధారంగా సూచించబడింది. అడెనోమయోసిస్ సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ క్రింద ఇవ్వబడినవి.

  1. గర్భధారణలో సమస్యలు: జంక్షనల్ జోన్ మందగించడం వల్ల గర్భాశయం యొక్క నిర్మాణ వైకల్యం, వీర్యం యొక్క కదలికను నిరోధించవచ్చు మరియు అపరిపక్వ అండములు గర్భధారణను నిరోధిస్తాయి.
  2. ఎండోమెట్రియాల్ ఫంక్షన్ లో సమస్యలు: వాపు మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి పెరగడం వల్ల ఎండోమెట్రియం యొక్క పనితీరు మరియు గ్రహణశక్తి బలహీనపడుతుంది.
  3. బలహీనమైన ఇంప్లాంటేషన్: మయోమెట్రియంలోకి చొరబడిన ఎండోమెట్రియల్ కణజాలం పని చేయడానికి రూపొందించబడినందున రక్తస్రావం కొనసాగుతుంది కాబట్టి విఫల బీజ ప్రవేశ సమస్యలకు అధిక అవకాశాలు ఉన్నాయి.

 

అడెనోమియోసిస్ మరియు గర్భం:

అడెనోమియోసిస్ స్త్రీ యొక్క గర్భధారణ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక మహిళ గర్భం దాల్చినప్పటికీ, ఆ గర్భధారణ అనేది గర్భస్రావం, తక్కువ బరువు గల బిడ్డ, ముందస్తు

ప్రసవం,ఉమ్మనీటి పొరల అకాల చీలిక, గర్భాశయ అంటువ్యాధులు మొదలైన ప్రమాదాలతో ముడిపడి ఉంటుంది.

వంధ్యత్వంలో అడెనోమియోసిస్ కోసం చికిత్స ఎంపికలు:

మీరు భవిష్యత్తులో బిడ్డను కనాలని భావిస్తే సరైన మరియు తగిన సంతానోత్పత్తి చికిత్సను పొందడం చాలా అవసరం.

అడెనోమియోసిస్ చికిత్సకు మరియు సానుకూల గర్భ ఫలితాలను మెరుగుపరచడానికి వైద్య లేదా శస్త్రచికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

హార్మోన్ల ప్రభావం మరియు వాపును నియంత్రించడానికి మరియు తగ్గించడానికి గోనాడోట్రోఫిన్-విడుదల చేసే హార్మోన్ అగోనిస్ట్ (GnRH-a) వంటి హార్మోన్ల చికిత్స సిఫార్సు చేయబడింది, ఇది సహజ గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుంది.

ఇవన్నీ ఈ విధంగా ముగుస్తాయి:

40 ఏళ్లు పైబడిన ప్రతీ 10 మంది మహిళల్లో 6 మంది అడెనోమియోసిస్ తో బాధపడుతున్నారు. తీవ్రమైన ఋతు సమయ నొప్పి మరియు పొత్తి కడుపు నొప్పి వంటివి అడెనోమైయోసిస్ కి సంబంధించినవి. ఇది సంతానోత్పత్తిపై మాత్రమే కాకుండా, మహిళ యొక్క మొత్తం ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.

గర్భధారణకు ముందు రోగ నిర్ధారణ, కౌన్సెలింగ్ మరియు అవగాహన, ప్రారంభ రోగ నిర్ధారణ చికిత్సకు అవసరమవుతాయి.

పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా స్త్రీ జననేంద్రియ పరీక్షలను చేయించుకోండి.

Was this article helpful?
YesNo

fill up the form to get a

Free Consultation

Your data is 100% safe with us.

Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit

How we reviewed this article:

HISTORY
  • Current Version
  • October 16, 2023 by Oasis Fertility
  • October 11, 2023 by Oasis Fertility

LatestTrending

Ad

BOOK A FREE CONSULTATION

Book

Appointment

Call Us

1800-3001-1000