Blog
Enquire Now
Uncategorized

ఎయిడ్స్ అనేది మీరు తల్లితండ్రులయ్యే అవకాశాన్ని పూర్తిగా దూరం చేయలేదు !సంతానోత్పత్తి వైద్య చికిత్సలు హెచ్.ఐ.వి ఉన్న దంపతులు తల్లి తండ్రులు అయ్యే మార్గాన్ని సుగమం చేస్తాయి .

ఎయిడ్స్ అనేది మీరు తల్లితండ్రులయ్యే అవకాశాన్ని పూర్తిగా దూరం చేయలేదు !సంతానోత్పత్తి వైద్య చికిత్సలు హెచ్.ఐ.వి ఉన్న దంపతులు తల్లి తండ్రులు అయ్యే మార్గాన్ని సుగమం చేస్తాయి .

శ్రీ సునీల్ గారు మరియు శ్రీమతి దివ్య గారి జీవితాలు, వారు చేయించుకున్న మాములు వైద్య పరీక్షల్లో వాళ్ళకి రిట్రో వైరల్ పాజిటివ్ అని నిర్ధారించబడడంతో పూర్తిగా గాడి తప్పాయి. ఎప్పుడైతే వాళ్ళకి వైద్యులు పిల్లల్ని కనడానికి అయితే వీర్యదానం లేదా దత్తత తీసుకోండి అని సూచించారో పిల్లలని కనాలని అనుకున్న వాళ్ళ కల ముక్కలైపోయింది .ఆ దంపతులు ఒయాసిస్ సంతానసాఫల్య కేంద్రాన్ని సందర్శించిన తరువాత వాళ్ళకి ఒక కొత్త ఆశ ,ఆకాంక్ష లభించింది.కృత్రిమ సంతానోత్పత్తి చికిత్స ల ద్వారా తల్లితండ్రులు అవ్వడం సాధ్యపడుతుంది అనే విషయాన్నితెలుసుకున్నారు,అంతిమంగా వాళ్ళు సంతానాన్ని పొందారు . ఈ ఉదంతం హెచ్.ఐ.వి సోకిన రోగులు అధునాతన సంతానోత్పత్తి చికిత్స లు మరియు యాంటీ రిట్రో వైరల్ డ్రగ్ లు తీసుకోవడం ద్వారా వాళ్ళ భాగస్వామికి కానీ ,వాళ్ళకి పుట్టే సంతానానికి కానీ హెచ్ .ఐ .వి సోకే ప్రమాదాన్ని నివారించడంలో సాయపడతాయనే విషయాన్ని నొక్కి వక్కాణించి చెప్పేలా చేసింది . ఎయిడ్స్ అనేది దంపతుల్ని తల్లితండ్రులు అవ్వకుండా ఆపలేదు .అవగాహన ని వ్యాప్తి చేయడం ప్రధానం ఒయాసిస్ సంతానసాఫల్య కేంద్రంలో వైద్యుల నైపుణ్యం మరియు అనుభవం హెచ్ .ఐ .వి తో బాధపడుతున్న దంపతులు సంతానలేమి సమస్యని అధిగమించేలా సాయపడుతుంది అంతేకాకుండా చాలామంది దంపతుల సంతానం పొందాలనుకునే కలని నిజం చేస్తోంది .గోప్యత కోసం దంపతుల పేర్లు మార్చడం జరిగింది .

హెచ్.ఐ.వి అనేది స్త్రీ సంతానోత్పత్తిని ఎలా దెబ్బతీస్తుంది ?

హెచ్.ఐ.వి సోకిన మహిళలు శారీరకంగానూ,జీవపరంగానూ,మానసికంగానూ దెబ్బతింటారు.అంతేకాకుండా దీని ఫలితంగా బరువు తగ్గడం ,ఎంత కాలం ఎదురుచూసినా స్త్రీలలో అండం విడుదల అవ్వకపోవడం, ఋతుచక్రం సక్రమం గా అవ్వకుండా సమస్యలు లాంటివి జరుగుతాయి.మరియు ,హెచ్.ఐ.వి సోకిన మహిళలకి పొత్తికడుపు వాచిపోవడం ,ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి శుక్రకణాలు అండంతో కలవకుండా నిరోధం ఏర్పడడం మొదలైన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ స్థాయిలో ఉంటుంది .

సిగ్గువల్ల ,గర్భధారణ విషయంలో భయం వల్ల మరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే బెంగ వల్ల ఏర్పడే ఒత్తిడితో కూడా ఇటువంటి మహిళలకు సంతాన సమర్ధత దెబ్బ తింటుంది . వాళ్ళకి గర్భ స్రావం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి .కానీ ఇవేమి పిల్లలని పొందాలనే కలని తుడిచిపెట్టలేవు .

హెచ్.ఐ .వి అనేది పురుషులలో సంతానోత్పత్తి ని ఎలా దెబ్బతీస్తుంది ?

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ,హెచ్ .ఐ .వి సోకిన పురుషులలో వృషణములు ,బీజకోసం మొదలైన ప్రత్యుత్పత్తి అవయవాలు పని చేయడం మందగిస్తాయి ,శుక్రకణాలు తక్కువ విడుదల అవ్వడం ,శుక్రకణాల సంఖ్య పడిపోవడం ,శుక్రకణాల చలనశీలత తగ్గడం జరుగుతుంది ,అంతేకాకుండా ,వాళ్ళు అంగస్తంభన సమస్యలు ,సంభోగించాలనే వాంఛలు నశించిపోవడం ,శుక్రకణాలు దిగజారిపోవడం మరియు వంధ్యత్వం మొదలైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది .

నమ్మతగిన సంతానోత్పత్తి చికిత్సలు :

సెరోడిస్కార్డెంట్ దంపతులు :

దంపతులలో ,కేవలం పురుష భాగస్వామికే హెచ్.ఐ.వి ఉన్నట్టయితే ,అతనికి యాంటీ రిట్రో వైరల్ డ్రగ్ లు చికిత్సగా ఇస్తారు దానిమూలంగా అతనియొక్క సీరం మరియు శుక్ర కణాలలో వైరస్ యొక్క మోతాదు తగ్గిపోతుంది.వైరస్ యొక్క మోతాదు పురుష భాగస్వామి లో కనబడని స్థాయికి తగ్గిపోయినపుడే ,దంపతులకి కృత్రిమ గర్భ ధారణ చికిత్సను మొదలుపెడతారు .ప్రీ-ఎక్స్పోజర్ ప్రోఫిలాక్సిస్ [పి.ఆర్.ఈ.పి]స్త్రీ భాగస్వామికి ఇవ్వడం వల్ల ఆమెకి ఎయిడ్స్ సంక్రమించే ప్రమాదం తగ్గిపోతుంది .ప్రత్యేకమైన చికిత్స విధానాలు అనగా సెమినల్ ప్లాస్మా ని రెండు సార్లు శుభ్రం చేయడం ,ఐ.వి.ఎఫ్,ఐ.యూ.ఐ మరియు ఐ.సి.ఎస్ .ఐ వంటివి హెచ్.ఐ.వి సోకిన పురుషుడు ద్వారా అతని భార్యకి మరియు అతని బిడ్డకి ఎయిడ్స్ సంక్రమించే ప్రమాదాన్నీ తగ్గిస్తాయి .

చాలా రకాలైన కృత్రిమ గర్భధారణ వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ,హెచ్.ఐ .వి సోకిన దంపతులుయొక్క సంతానం పొందాలనే కలని నిజం చేసి వాళ్ళకి ఆ సంతోషాన్ని కానుకివ్వడానికి ,కానీ ఎవరికీ అవగాహన లేకపోవడం వలన చాలా మంది నిరాశతో ,బాధతో జీవించాల్సి వస్తోంది .

గర్భధారణ కు ముందే సంతానం విషయంలో హెచ్.ఐ.వి ఉన్న దంపతులు, వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం . ఎందుకంటే దీనివలన వాళ్ళకి పిల్లలు పొందాలనే విషయంలో ముందుగానే రాబోయే ప్రమాదాలు ,పాటించాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు ,ఏ చికిత్స ను ఎంచుకోవాలి అనే విషయాలు అర్ధం అవుతాయి .

ఆశ ఇంకా మిగిలే ఉంది ,తల్లి తండ్రులు అవ్వాలనుకునే మీ కలని వదులుకోవద్దు ,ఎయిడ్స్ తో పోరాడండి, తల్లి తండ్రులు కూడా అవ్వండి .

Write a Comment