మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచే సంతానోత్పత్తిని పెంచే ఆహారం
Author: S. Flora Amritha, Dietician
మహిళల్లో వంధ్యత్వం అనేది ఒక కష్టతరమైన అనుభవం. సంతానోత్పత్తి చికిత్సలలో చాలా అభివృద్ది సాధించినప్పటికీ, సంపూర్ణ పద్ధతుల నుండి లభించే కొద్దిపాటి తోడ్పాటు సహాయక పునరుత్పత్తి సాంకేతికత చికిత్స యొక్క తీవ్రమైన ప్రక్రియను సులభతరం చేయడంలో సహాయపడుతుంది. అలాంటిదే ఒక విధానం ఆహారం ద్వారా మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ప్రయత్నించడం. ఇటీవలి కాలంలో మొదలైన ఒక కొత్త ధోరణి “సంతానోత్పత్తి పెంచే ఆహారం”అనే భావన. దాని గురించి తెలుసుకునే ముందు, ఆహారం మరియు సంతానోత్పత్తి మధ్య సంబంధాన్ని మరియు సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో ఆహారం ఎటువంటి పాత్ర పోషిస్తుందనేది పరిశీలిద్దాం .
ఆహారం మరియు సంతానోత్పత్తిమధ్య సంబంధం:
అనేక అధ్యయనాలు ఆహారం మరియు సంతానోత్పత్తి మధ్య అనుబంధ సంబంధాలను అంచనా వేశాయి.
గత కొన్ని సంవత్సరాలుగా మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఆహారంలో మార్పులను చేర్చడం జరిగింది. ఆహారం మరియు సంతానోత్పత్తి మధ్య సంబంధం ఉన్నప్పటికీ, దాని సానుకూల ప్రభావాలు వంధ్యత్వాన్ని అప్పటికప్పుడే “చికిత్స చేయవు” మరియు రాత్రికి రాత్రే ఫలితాలను ఇవ్వవు.
కింది విటమిన్లు ఇంకా పోషకాలతో నిండిన సమతుల్య భోజన ప్రణాళిక, గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళల్లో సంతానోత్పత్తిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
– ఫోలిక్ ఆమ్లం
– విటమిన్ B12
– ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు
ఉత్తమ ఫలితాల కోసం, మీ భాగస్వామిని కూడా ఈ ప్రణాళికలో చేర్చండి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని మీరే ప్రత్యక్షంగా చూస్తారు.
సంతానోత్పత్తి పెంచే ఆహారంఅంటే ఏమిటి? సంతానోత్పత్తి ఆహారం అనేది అధునాతన భోజన ప్రణాళిక కాదు. మహిళల్లో సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పిండి పదార్థాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన సమతుల్యమైన ఆహారం . ఇది గర్భధారణ అవకాశాలను మెరుగుపరచడానికి మరియు ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదపడుతుంది.
మీ సంతానోత్పత్తి ఆహార ప్రణాళికను మీరు ఎలా మెరుగుపరచవచ్చో ఇక్కడ చూడండి.
– మరింత ఆరోగ్యకరమైన కొవ్వులను (నెయ్యి, అవోకాడో మొదలైనవి) చేర్చండి, సంతృప్త కొవ్వులను నివారించండి (ఉదా. ఛీజ్).
– మీ కంచంలో ఎక్కువ భాగాన్ని కూరగాయలు, పండ్లు మరియు వేర్ల నుండి లభించే ప్రోటీన్ (శనగలు, వేరుశెనగలు మొదలైనవి) తో నింపండి. ఎర్ర మాంసం వినియోగాన్ని పరిమితం చేయండి.
– పిండి పదార్థములు మరీ అంత చెడ్డవి కావు. అధిక ఫైబర్ మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక (తృణధాన్యాలు) అధికంగా ఉండే ఆహారాలను తినండి. సంతృప్త లేదా సాధారణ పిండి పదార్థములకు మీరు దూరంగా ఉండాలి.
– బీన్స్, కాయధాన్యాలు, టోఫు, ఆకుపచ్చని ఆకుకూరలు, తృణధాన్యాలు, విత్తనాలు, కాయలు మరియు తక్కువ కొవ్వు గల పాల పదార్ధాలు (స్కిమ్ లేదా వెన్నతీసిన పాలు మరియు పెరుగు) వంటి ఇనుము యొక్క శాఖాహార వనరులను చేర్చండి.
– మీరు ప్రతీరోజు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ లను తీసుకోవాలని నిర్ధారించుకోండి.
నిజంగా “సంతానోత్పత్తి ఆహారం” పనిచేస్తుందా?
సంతానోత్పత్తి పెంచే ఆహారాలు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క ఆరోగ్యకరమైన పనితీరుకు, బరువు సమస్యలను మరియు సంతానోత్పత్తిని మరియు గర్భధారణను ప్రతికూలంగా ప్రభావితం చేసే ఏ పోషక లోపాలనైనా నిర్వహించడానికి చాలా ముఖ్యం.
సంతానోత్పత్తికి ముందు పోషణకు అవసరమైన సరైన పోషక స్థాయిలను నిర్వహించడానికి కూడా సంతానోత్పత్తి పెంచే ఆహారం సహాయపడుతుంది.
స్త్రీ సంతానోత్పత్తిని పెంచే ఆహారాలు ఏవి?
వివిధ రకాల పండ్లు మరియు కూరగాయల నుండి తృణధాన్యాల వరకు సంతానోత్పత్తిపెంచే ఆహారాలు క్రింద ఇవ్వబడ్డాయి.
గుడ్లు
గుడ్లు సంతానోత్పత్తి పెంచే మంచి ఆహారం. అవి ప్రోటీన్, విటమిన్లు B12 (ఫోలిక్ యాసిడ్), విటమిన్ E, జింక్ మరియు కోలిన్ తో నిండి ఉంటాయి. కోలిన్ జనన లోపాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది మరియు సరైన పిండం అభివృద్ధిని నిర్ధారిస్తుంది.
వాల్ నట్స్ వాల్ నట్స్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి అండోత్సర్గమునుమెరుగుపరచడంలో సహాయపడతాయి.
బెర్రీలు
బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి, ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఫోలేట్ మరియు విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటాయి.
అవకాడో
అవోకాడోలలో విటమిన్ కె, పీచు పదార్ధం, ఫోలిక్ ఆమ్లం మరియు మోనోఅన్ సాచురేటెడ్ కొవ్వులు అని పిలువబడే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా కలిగి ఉంటాయి, ఇవి గర్భధారణ యొక్క ప్రారంభ దశలలో అవసరం. వీటిలో పొటాషియం కూడా సమృద్ధిగా ఉంటుంది, ఇది విటమిన్ లను బాగా గ్రహించడానికి మరియు రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులు ప్రోటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు A, E మరియు D లను సమృద్ధిగా ఉంటాయి మరియు వీటి వలన అండోత్సర్గపు వంధ్యత్వానికి ప్రమాదం తక్కువ.
బీన్స్ మరియు కాయధాన్యాలు:
బీన్స్ మరియు కాయధాన్యాలలో ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది మరియు స్పెర్మిడిన్ అని పిలువబడే పోషకం ఉంటుంది. స్పెర్మిడిన్ అండముల అభివృద్దికి మరియు అండముల యొక్క పరిపక్వతను మెరుగుపరచడంలో దోహదపడుతుంది . ఫోలేట్ సహాయక పునరుత్పత్తితో ప్రతిస్థాపన మరియు సానుకూల గర్భధారణ అవకాశాలను పెంచుతుంది.
కీలక అంశాలు:
సంతానోత్పత్తి పెంచే ఆహారం” అనే భావన మొదట సమకుల ఆహార విధానంగా అనిపించవచ్చు, కానీ పోషకాహార నిపుణుడితో పాటు ప్రణాళిక వేసినప్పుడు ఇది చాలా కీలకమైన ప్రాథమిక భోజన ప్రణాళిక. సంతానోత్పత్తి పెంచే ఆహారం అనేది ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలు మరియు మీ సంతానోత్పత్తి ప్రయాణంలో మార్పులు చేయడానికి ఒక మార్గదర్శి. సంతానోత్పత్తిని పెంచే ఆహారాలతో పాటు మీరు స్పష్టంగా తెలుసుకోవలసిన ఆహారాలు కూడా ఉన్నాయి. మీ సంతానోత్పత్తి ప్రయాణానికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఈ రోజు మా నిపుణులైన ఫెర్టిలిటీ స్పెషలిస్ట్/డైటీషియన్ ను సంప్రదించండి.