సంతానలేమి :కారణాలు ,రకాలు
స్త్రీలలో సంతానలేమి కి గల కారణాలు :
- అండాశయం నుంచి అండం విడుదల అవ్వడం లో సమస్యలు
- ఫెలోపియన్ నాళాలలో సమస్యలు
- గర్భాశయంలో సమస్యలు
- అంతర్ స్రావక గ్రంధాలలో సమస్యలు ఉదాహరణకి థైరాయిడ్ ,ప్రొలాక్టిన్
- ఎండోమెట్రియోసిస్ మరియు గర్భాశయం గోడల్లో కంతులు పెరగడం
- ఊబకాయం
ఏ. అండం విడుదల అవ్వడం లో సమస్యలు :
స్త్రీలలోని పునరుత్పత్తి హార్మోన్లలో ఏమాత్రం అసమతుల్యత చోటు చేసుకున్నా అది అండం విడుదల అవ్వడం లో సమస్యలకు దారి తీస్తుంది .వాటిలో కొన్ని సమస్యలు గురించి కింద చూద్దాం .
- పి.సి.ఓ.ఎస్ : పి.సి.ఓ.ఎస్ లేదా పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనేది ఆడవారిలో అధికమోతాదులో ఆండ్రోజెన్(మగ హార్మోన్)ఉత్పత్తి అవ్వడం వల్ల ఋతుచక్రం లో ఆటంకాలు కలగడానికి దారి తీస్తుంది .ఇది స్త్రీలలో సంతానలేమి కలగడానికి అత్యంత ప్రధానమైన కారణాలలో ఒకటి .స్త్రీలలో సంతాలేమి ఉందని తెలిపే లక్షణాలు ఏంటంటే ఋతుచక్రం సరైన క్రమం లో జరగకపోవడం ,మొటిమలు ,అధికంగాముఖం మీద శరీరం మీద జుట్టు పెరగడం, బరువు పెరగడం మొదలైనవి.
- ప్రాధమిక అండాశయ లోపం /ముందస్తు అండాశయ వైఫల్యం : కొంతమంది మహిళలో అండాశయాలు 40 ఏళ్లకు ముందుగానే పనిచేయడం మానేస్తాయి కొన్ని కారణాల వలన .
- జన్యుపరమైన కారణాలు : క్రోమోజోమ్ సమస్యలు ఉదాహరణకి టర్నర్ సిండ్రోమ్ ,ఫ్రాజైల్ ఎక్స్ సిండ్రోమ్ మొదలైనవి ముందస్తు అండాశయ వైఫల్యానికి దారితీస్తాయి .
బి. ఫెలోపియన్ నాళాలలో సమస్యలు :
ఫెలోపియన్ నాళం అనేది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఒక భాగం ,ఇక్కడ అండం శుక్రకణాల తో కలిసి ఫలదీకరణం జరుగుతుంది.కానీ ,ఫెలోపియన్ నాళాలలోకొన్ని సమస్యలు సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయి. వాటిలో కొన్ని కారణాలు:
- ఫెలోపియన్ నాళాలు లేకపోవడం (ట్యూబల్ అప్లాసియా )
- క్షయవ్యాధిలాంటి అంటువ్యాదులు
- లైంగిక సంక్రమణ వ్యాధులు, పొత్తికడుపు వాపు వ్యాధికి దారితీస్తాయి
- ఉదరం లేదా పొత్తికడుపు కి ముందుగా శస్త్రచికిత్స జరిగి ఉండడం
- అపెండిసైటిస్
- హైడ్రోసాల్ఫిన్క్స్(ఫెలోపియన్ నాళాలలో ద్రవం పోగవడం)
సి. గర్భాశయంలో సమస్యలు :
- గర్భాశయంలో గడ్డలు
- గర్భాశయం ఆకారం సరిగా లేకపోవడం
- ఎండోమెట్రియాల్ పాథాలజీ ఉదాహరణకి సన్నని ఎండోమెట్రియం ,గర్భాశయంలో మృదువైన కండగలిగిన వాపు
డి .ఎండోమెట్రియోసిస్ మరియు గర్భాశయం గోడల్లో కంతులు పెరగడం :
ఎండోమెట్రియం అంటే గర్భాశయంలో లోపలి పొర,ఈ ఎండోమెట్రియాల్ పొర యొక్క కణజాలం గర్భాశయం లో కాకుండా పొత్తికడుపు /ఉదరంలో పెరిగితే ఆ పరిస్థితినే ఎండోమెట్రియోసిస్ అంటారు .ఇది ఋతుచక్రం సమయంలో తీవ్రమైన నొప్పిని కలిగించడమే కాకుండా అండాలు విడుదల చేసే సామర్ధ్యం తగ్గడం వలన సంతానలేమికి,గర్భాశయ అవయవాలు అతుక్కుపోవడానికి దారితీస్తుంది.
గర్భాశయం గోడల్లో కంతులు పెరగడం వలన అది ఎండోమెట్రియాల్ పనితీరు మీద ,గ్రహణశక్తిమీద ప్రభావం చూపిస్తుంది ,దానిమూలంగా ప్రతిష్టాపన శక్తి తగ్గి ,గర్భధారణ అవకాశాలు తగ్గిపోతాయి .
స్త్రీలలో సంతానలేమి సమస్యని కనుక్కునే రోగ నిర్ధారణ పరీక్షలు :
- శరీర పరీక్ష
- అల్ట్రా సౌండ్
- అండం విడుదల గురించి తెలుసుకునే పరీక్షలు అంటే హార్మోన్ పరీక్షలు
- హిస్టిరో సాల్ఫింగో గ్రఫీ పరీక్ష
- హిస్టెరోస్కోపీ
- లాప్రోస్కోపీ
- జన్యు పరీక్షలు
స్త్రీలలో సంతానలేమి సమస్యలకి చికిత్స :
- స్త్రీలలు తమకు తాముగా ఋతుచక్రంలో అండాలు విడుదల చేయలేకపోతే ,మందుల సాయంతో అండాలు అభివృద్ధి చెందేలా చేసి ,విడుదల అయ్యేలా చేయడం
- గర్భాశయం సరైన రీతిలో లేకపోయినా ,ఫెలోపియన్ నాళాలు వాచిపోయి నాళాలు మూసుకుపోయినా,గర్భాశయం లో గడ్డలు ఏర్పడినా ,గర్భాశయంలో మృదువైన కండగలిగిన వాపు ఏర్పడినా లాప్రోస్కోపిక్ లేదా హిస్టిరోస్కోపిక్ శస్త్ర చికిత్స చేసి వాటిని సరిచేయచ్చు
- కృత్రిమ పునరుత్పత్తి పద్ధతులు అంటే ఐ.వి.ఎఫ్ ,ఐ .యూ.ఐ మొదలైనవాటితో స్త్రీలకి గర్భధారణ అయ్యేలా చేయచ్చు
పురుషలలో సంతానలేమికి గల కారణాలు :
పురుషలలో సంతానలేమి వివిధ కారణాలున్నాయి:
- శుక్రకణాల ఉత్పత్తి లో సమస్యలు : పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరైన రీతిలో ఎదగడం మరియు నిర్మాణం జరగడం అనేది శుక్రకణాలు సరిగ్గా ఉత్పత్తి జరగడంలో అత్యంత ముఖ్యమైనది .శుక్రకణాల యొక్క ఉత్పత్తిలో ఏ సమస్య తలెత్తిన అది సంతానలేమికి దారి తీస్తుంది .
- శుక్రకణాల రవాణాలో సమస్యలు : శుక్రకణాలని తీసుకువెళ్ళే నాళాలు శస్త్ర చికిత్స వల్లగాని ,పుట్టుకతో వచ్చిన లోపాలవల్ల గాని ,ఇన్ఫెక్షన్ ల వల్లగాని మూసుకుపోయి ఉండచ్చు .
- శుక్రకణాల యొక్క చలనశీలతలో సమస్యలు : శుక్రకణాల యొక్క చలనశీలత సరిగ్గా లేకపోతే, శుక్రకణాలు అండాన్ని చేరుకోలేవు .
- ఇన్ఫెక్షన్ లు : ఇన్ఫెక్షన్ లు అంటే ఉదాహారణకి లైంగికంగా సంక్రమించే వ్యాధులు శుక్రకణాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ,శుక్రకణాల యొక్క చలనశీలతని దారుణంగా దెబ్బ తీస్తాయి.
- స్ఖలన సమస్యలు : మధుమేహం ,మూత్రాశయం లో శస్త్ర చికిత్స జరగడం ,మాత్రలు వేసుకోవడం మొదలైన చాలా ఆరోగ్యపరిస్థితులు స్ఖలనంలో సమస్యలు రావడానికి కారణం అవుతున్నాయి.
- కేన్సర్: కేన్సర్ మరియు కేన్సర్ చికిత్స లైన కీమోథెరపీ,రేడియేషన్ అనేవి శృంగార వాంఛ మరియు శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసి సంతానలేమికి కారణం అవుతున్నాయి.
- జన్యుపరమైన లోపాలు : సిస్టిక్ ఫైబ్రోసిస్ ,క్లైన్ ఫెల్టర్ సిండ్రోమ్ మరియు ఇతర జన్యుపరమైన లోపాలు శుక్రకణాల యొక్క ఉత్పత్తి ,శుక్రకణాలలో చలనశీలతని దెబ్బతీస్తాయి.
- శుక్రకణాల ని విరోధిగా భావించి నిరోధించే ప్రతిరోధకాలు : కొన్ని వ్యాధినిరోధక కణాలు శుక్రకణాల ని హానిచేసే ఆక్రమణ దారులుగా భావించి శుక్రకణాల ని దాడిచేస్తాయి.
- దిగబడని వృషణాలు : కొంతమంది పురుషులలో వారి పుట్టుక ముందు వృషణాలు కిందకి దిగబడడంలో విఫలం అవుతాయి దానివల్ల అది సంతానలేమికి కారణమవుతుంది .
- వేరికోసిల్: వృషణతిత్తి(శరీరంలో వృషణములుండే సంచి )లో సిరలు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ పెద్దగా ఉంటే దానిని వేరికోసిల్ అంటారు. ఇది తక్కువ శుక్రకణాల ఉత్పత్తికి మరియు శుక్రకణాల యొక్క చలనశీలత తగ్గిపోవడానికి దారితీస్తుంది .
- రసాయనాలు / ఎక్స్-రే లు: క్రిమిసంహారక మందులకు ,విషపదార్ధాలకు,వేడికి దగ్గరగా ఉండడం వల్ల శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది .
- ధూమపానం: ధూమపానం చేసే పురుషలకు శుక్రకణాల ఉత్పత్తి మరియు శుక్రకణాల లోని చలనశీలత తగ్గి ,శుక్రకణాల లోని నాణ్యత క్షీణిస్తుంది .
- ఊబకాయం: అధిక బరువు ఉండడం వలన హార్మోన్ లలో సమతుల్యత తగ్గి ,సంతానలేమి సమస్య కలుగుతుంది .
పురుషులలోని సంతానలేమి లక్షణాలు :
- చాలా వరకు ఏ లక్షణాలు కనిపించవు
- కామవాంఛలో మార్పులు
- చిన్న వృషణాలు
- వృషణాలలో నొప్పి లేదా వాపు
పురుషలలోని సంతానలేమి సమస్యని తెలుసుకునే రోగ నిర్ధారణ పరీక్షలు :
పురుషలలో సంతానలేమి సమస్యని తెలుసుకునేందుకు ఈ కింద పేర్కొన్న పరీక్షలు చేస్తారు .
- శరీర పరీక్ష
- వీర్యం మరియు శుక్రకణాలలో నాణ్యత మరియు పరిమాణం తెలుసుకునే పరీక్ష
- ఆల్ట్రాసౌండ్ -వృషణతిత్తులకి సంబంధించినది ,పురీష నాళానికి సంబంధించినది
- హార్మోన్ పరీక్షలు
- జన్యు పరీక్షలు
పురుషలలో సంతానలేమి సమస్యకి చికిత్స :
- హైపోగోనడో ట్రోపిక్ హైపోగోనడిజమ్ లాంటి పరిస్థితులలో ,తక్కువ శుక్రకణాల పరిమాణం ఉన్నప్పుడు,శుక్రకణాల చలనశీలత తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ లని ,యాంటీ యాక్సిడెంట్ లను మందుల ద్వారా పెరిగేలా చేస్తారు.
- అధునాతన కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటే ఐ .వి .ఎఫ్ ,ఐ .యూ .ఐ లేదా ఐ .సి .ఎస్ .ఐ లాంటివి మీరు సంతానలేమిని అధిగమించేలా చేసి మీరు తండ్రి అయ్యేలా చేస్తుంది.
- శుక్రకణాలని పునరుద్దరించే పద్ధతులు అంటే టీ.ఈ .ఎస్ .ఏ ,మైక్రో టీ.ఈ .ఎస్ .ఈ మరియు శుక్ర కణాలని వేరుచేసే విధానాలైన ఎం.ఏ.సి.ఎస్ ,మైక్రో ఫ్లూడిక్స్ మొదలైనవి సంతానోత్పత్తి మెరుగుపరుచుకోవడానికి అందుబాటులో ఉన్నాయి .
సంతానలేమి లో రకాలు :
- ప్రాథమిక సంతానలేమి – దంపతులు సంతానం కోసం ఒక సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నా , వాళ్ళకి గర్భధారణ కలగకపోతే ,దానిని ప్రాథమిక సంతానలేమి అంటారు .
- ద్వితీయ సంతానలేమి – దంపతులు రెండొవ సారి సంతానం కనలేకపోతే (విజయవంతంగా గర్భధారణ జరిగిన తరువాత )దానిని ద్వితీయ సంతానలేమి అంటారు .
సంతానోత్పత్తి దంపతుల వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తుంది ,అందుకే ముందు గానే జీవిత భాగస్వాములైన ఆడ మరియు మగ ఇద్దరు కూడా సంతానోత్పత్తి ఆలస్యం జరగడానికి కల కారణాన్ని తెలుసుకునేందుకు పూర్తిగా వైద్య పరీక్షలు చేయించుకుంటే ,వైద్యుల జోక్యం వల్ల దంపతులు సంతానలేమి సమస్యని అధిగమించి తల్లితండ్రులు అవ్వాలన్న వల్ల కలను సాధించుకున్నవాళ్ళు అవుతారు .దంపుతులు ఎవరైనా సంతానం పొందాలనే ఆలోచనలో ఉంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ,తరచూ వ్యాయాయం చేస్తూ, ధూమపానం మరియు మద్యపానం మానేసి విధిగా సరైన సమయాల్లో నిదురిస్తే వారి గర్భధారణ అవకాశాలు పుష్కలంగా పెరుగుతాయి .
fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit
How we reviewed this article:
- Current Version
- May 19, 2023 by Oasis Fertility
- October 31, 2022 by Oasis Fertility
- October 28, 2022 by Oasis Fertility
- October 21, 2022 by Oasis Fertility
- October 19, 2022 by Oasis Fertility
- October 18, 2022 by Oasis Fertility