Blog
Enquire Now
Case Study

ఎండోమెట్రియల్ రెసెప్టివ్ ఎరే [ఈ .ఆర్ .ఏ ] గర్భం దాల్చే అవకాశాలు పెంచుతుంది

23 ఏళ్ళ రాఖి అనే మహిళకి 33 ఏళ్ళ తుషార్ అనే పురుషుడితో పెళ్లి అయి 5 ఏళ్ళు అయింది ,వాళ్ళు తమ వైవాహిక జీవితంలో గత మూడేళ్ళుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ అవి ఏమి ఫలించలేదు .ప్రాధమిక సంతానోత్పత్తి పరీక్షల్లో తుషార్ కి వీర్యకణాల శాతం సరిపోయేంత ఉంది అని రుజువైంది కానీ రాఖీకి తన అండాలు బలహీనంగా ఉండడం,అండాలని నిక్షిప్తం చేసే చోటు సన్నగిల్లడం ,ఋతుచక్రం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు ఉన్నట్టు తెలిసింది.

రాఖి కి హిస్టెరోస్కోపిక్ అద్ హేసియోలైసిస్,లాప్రోస్కోపిక్ వైద్యం జరిగింది అందులో తనకి బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నట్టు తెలిసింది అందువలన క్లిప్పింగ్ చేసారు ,ఇన్నేళ్లల్లో దాత నుంచి తీసుకోబడిన స్త్రీ బీజ మాతృ కణాలతో చేసిన సంతానోత్పత్తి చికిత్సలు రెండు సార్లు విఫలమయ్యాయి ఆ దంపతులకి .ఆ వైఫల్యాల్ని కూడా పక్కన పెట్టి ఆ దంపతులు ఏమాత్రం ఆశ కోల్పోకుండా పూణే లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ని సందర్శించారు.

యధావిధి గా చేసే వైద్య పరీక్షలు జరిగిన తర్వాత తుషార్ కి సాధారణ డి ఎఫ్ ఐ [డి ఎన్ ఏ వీర్యం లో సమగ్రత ని నష్టాన్ని చూపించేది ]15 శాతం అని నిర్ధారించబడింది.

ముందు విఫలమైన సంతానోత్పత్తి చికిత్సలని ,తక్కువగా ఉన్న అండాశయపు నిక్షిప్త ప్రదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అండ దత్తత చక్రం అనే ప్రక్రియని రూపొందించారు.

ఆ మరుసటి రోజు 5 అత్యంత తొలిదశలో ఉన్న పిండాలని బదిలీ చేసారు స్నేహ గర్భాశయం లో ,కానీ ఆ ప్రక్రియ కూడా సానుకూలమైన ఫలితాన్ని రాబట్టలేకపోయింది.

మంచి నాణ్యతతో కూడిన పిండాలని ని ఉపయోగించినప్పటికీ ,మూడు సార్లు కన్నా ఎక్కువ గర్భం దాల్చడం విఫలం అయితే దానిని “రీ కర్రెంట్ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ “అంటారు.

ఇలాంటి కేసు ల్లో శరీర నిర్మాణానికి సంబంధించి అంచనా వేసే అనాటమికల్ అసెస్మెంట్ అనే పరీక్ష చేస్తారు.

ఇందులో రక్తం గడ్డకట్టడం మరియు జన్యువు లకి సంబంధించి పరీక్ష చేస్తారు ఎందుకంటే ఇవి ఇంప్లాంటేషన్ విఫలం అవ్వడానికి దోహదపడే కారకాలు ,అలా అని అన్ని కేసు లలో వైఫల్యాలకి ఇవే కారణం కాదు.

గర్భం దాల్చడానికి ఒక ప్రత్యేకమైన గర్భాశయ వాతావరం ఉండాలి ,ఇంప్లాంటేషన్ ఎందుకు విఫలమవుతుందో తెలుసుకోవడానికి వాటికీ సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవాలి ,ఇది ఎండోమెట్రియల్ రెసెప్టివ్ ఎరే [ఈ .ఆర్.ఏ ] పరీక్ష ద్వారా సాధ్యబడుతుంది,ఈ పరీక్ష 200 జన్యువులని అంచనా వేసి ఎండోమెట్రియం [గర్భాశయపు పొర] రెసెప్టివ్ అవునా కాదా అని తెలుసుకుంటుంది, ఈ పరీక్షలో ఎండోమెట్రియం రెసెప్టివ్ అవునా కాదా అని తెలుసుకుని స్త్రీ యొక్క ఇంప్లాంటేషన్ విండో అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది.

ఈ .ఆర్ .ఏ లక్ష్యం పిండాన్ని బదిలీ చేయడానికి అనుకూలమైన రోజుని తెలుసుకోడం దీని ద్వారా ఇంప్లాంటేషన్ విఫలమయ్యే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

ఈ .ఆర్ .ఏ అని ఎలా చేస్తారు ?

ఈ .ఆర్ .ఏ అంటే గర్భాశయపు పొరకి జీవధాతు పరీక్ష చేయడం ,ప్రొజెస్టెరోన్ అనే హార్మోన్ కృత్రిమ గర్భధారణ విధానం లో ఎండోమెట్రియం రెసెప్టివ్ అవ్వడానికి సాయపడుతుంది ,ప్రొజెస్టెరోన్ ప్రక్రియ అయిన 5 రోజుల తర్వాత పిండం బదిలీ చేయడానికి అనుకూలమైన సమయం.

ఈ .ఆర్ .ఏ ని ఒక కృత్రిమ చక్రంలో చేస్తాం ,ఒకసారి జీవధాతు పరీక్ష జరిగితే ,రెసెపీటివిటీ లో పాల్గొన్న జన్యులువులుని విశ్లేషిస్తాం ,దానిని బట్టి ఈ ఆర్ ఏ అంచనా వేస్తుంది ఎండోమెట్రియం రెసెప్టివ్ అవునా కాదా అని ..

రెసెప్టివ్ :పిండం బదిలీ భవిష్యత్తు లో చేసే కృత్రిమ చక్రాలలో కూడా అదే సమయం లో జరగడాన్ని రెసెప్టివ్ అంటారు.

నాన్ రెసెప్టివ్ :ఇది స్త్రీ యొక్క ఎండోమెట్రియం స్థానభ్రంశం అయిందని సంకేతం చూపిస్తుంది ,కనుక దీనివలన పిండం బదిలీ ప్రొజెస్టెరోన్ ప్రక్రియ జరిగిన రోజు కాకుండా మార్చి చేయాలి.

ఒక్కసారి సరైన ఇంప్లాంటేషన్ విండో గుర్తిస్తే ,ఆ తర్వాత పిండం బదిలీ చేసే సమయాన్ని మరుసటి నెలలో ఆలోచించచ్చు ..

పరిశోధనలు చూపుతున్న ఫలితాల ప్రకారం ఈ .ఆర్ .ఏ పరీక్షని అవలంభించడం వల్ల విజయవంతంగా గర్భందాల్చిన వాళ్ళ సంఖ్య 70 శాతానికి చేరింది.

రాఖి విషయం లో తన ఎండోమెట్రియం స్థానభ్రంశం చెందింది ,కనుక ఈ ఆర్ ఏ పరీక్ష ఫలితాల ప్రకారం తనకి ప్రొజెస్టెరోన్ ప్రక్రియ ముగిసిన సమయం కాకుండా వేరే సమయంలో తన గర్భం లో నాణ్యమైన తొలిదశ పిండాలు బదిలీ చేసారు ,బదిలీ విజయవంతం అయింది ,ఆమె గర్భం దాల్చింది ,తన మాతృత్వపు స్వప్నాలని నిజం చేసుకుంది.

Write a Comment