పి.సి.ఓ .ఎస్ సంతానలేమికి కారణం అవుతుందా ?
ఇటీవల కాలంలో చాలా మంది యువతులకు ఋతుచక్రం సరైన సమయంలో జరగడం లేదు .అనారోగ్యకరమైన జీవన శైలి అనగా వ్యాయామం లేకపోవడం ,తక్కువ నిద్రపోవడం లేదా వేళాపాళా లేకుండా నిద్రపోయే అలవాటు ఉండటం ,జంక్ ఫుడ్ లేదా అధికం గా ప్రాసెస్ చేయబడిన ఆహారం తినడం వంటివి అస్థిరమైన ఋతుచక్రానికి కొన్ని కారణాలు కావచ్చు .చాలా మంది యువతులు సరైన కాలంలో ఋతు చక్రం జరగకపోవడం ,ఊబకాయం వల్ల కానీ మాములు గా కానీ వచ్చే హార్మోన్ అసమతుల్యత తో చాలా బాధపడుతున్నారు ఇది విష వలయానికి దారితీస్తుంది .మీకు వీటిలో ఏ సమస్య అయినా ఉంటే ,బహుశా అవి పి .సి .ఓ .ఎస్ [పోలి సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ]వలన వచ్చి ఉండచ్చు . పి .సి .ఓ .ఎస్ [పోలి సిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్] అనేది ఈరోజుల్లో చాలా మాములు ఆరోగ్య సమస్య అయిపోయింది ,ఇది సంతానలేమికి కారణం కావచ్చు .భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు .దీనిని జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేయడం ,మందులు వేసుకోవడం మరియు అధునాతనమైన వైద్య చికిత్స తీసుకోవడం తో నిర్మూలించవచ్చు .
పి .సి .ఓ .ఎస్ అంటే ఏంటి ?
మీకు హార్మోన్ అసమతుల్యత వలన సరైన సమయంలో ఋతుచక్రం జరగనప్పుడు ,మీ అండాశయాలు అటువంటి హార్మోన్ లను అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తున్నప్పుడు ,మీ అండాశయంలో ద్రవరూపంతో కూడిన బొడిపెలు ప్రత్యక్షమైతే మీకు పి .సి .ఓ .ఎస్ వచ్చిందని ఖచ్చితంగా చెప్పచ్చు .
లక్షణాలు :
- సరైన కాలంలో ఋతుచక్రం జరగకపోవడం
- ఊబకాయం
- అనవసరమైన ప్రదేశాల్లో జుట్టు పెరగడం
- అండాశయాల్లో బొడిపెలు
- బట్టతల లేదా జుట్టు పూర్తిగా రాలిపోవడం
- సంతానం కలగకపోవడం
పి .సి . ఓ .ఎస్ ని నిర్ధారించే పరీక్షలు :
మీరు తల్లి కావాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు మీకు పి.సి .ఓ .ఎస్ ఉందని తెలిస్తే మీకు చాల బాధాకరంగా ఉంటుంది .కానీ ఈ పి .సి . ఓ .ఎస్ లక్షణాలు తగ్గిపోయి ,మీరు తల్లి కావాలనే మీ ఆశ తీరడానికి కొన్ని దారులు ఉన్నాయి
ఏ)పెల్విక్ పరీక్ష:
వైద్యులు తమ కళ్ళతో యోని మరియు గర్భాశయ ముఖద్వారాన్ని చూసి అక్కడ ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్ ఏమైనా అయిందా అని పరీక్షించి ,వారి రెండు చేతులతో తాకి గర్భాశయ పరిమాణాన్ని అంచనా వేసి గర్భాశయపు ఆవరణలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేస్తారు
బి)పెల్విక్ ఆల్ట్రాసౌండ్ :
ట్రాన్స్ వాజినల్ ఆల్ట్రాసౌండ్ పరీక్ష ని గర్భాశయం లో ఏమైనా బొడిపెలు ఉన్నాయా లేదా అని తెలుసుకోడానికి మరియు గర్భాశయం యొక్క స్థితిని ,పరిమాణాన్ని తెలుసుకోవడానికి మరియు గర్భాశయపు గోడలు యొక్క మందాన్ని తెలుసుకోవడానికి చేస్తారు ఎందుకంటే దీనివలన ఎండోమెట్రియోసిస్ ,గర్భాశయంలో గడ్డలు మొదలైన లోపాలు ఉన్నాయో లేదో చూసి తెలుసుకోవచ్చు
సి)రక్త పరీక్షలు :
హార్మోన్ లు ఏ దశ లో ఉన్నాయో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తారు. అవి ఏమనగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పరీక్ష ,ల్యూటనైజింగ్ హార్మోన్ పరీక్ష ,యాంటీ ముల్లేరియన్ హార్మోన్ పరీక్ష మరియు టెస్టోస్టెరోన్ పరీక్ష వీటితో పాటు ఇన్సులిన్ ,కొలెస్ట్రాల్ ,థైరాయిడ్ మరియు ప్రో లాక్టిన్ పరీక్షలు కూడా చేస్తారు
పి .సి . ఓ .ఎస్ కి చికిత్స విధానాలు :
-
జీవనశైలిలో మార్పులు చేయడం :
పి .సి .ఓ .ఎస్ కి సంబంధించి ఊబకాయంతో ఉండడం అనేది అధికమైన సమస్య .సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ,బయట జంక్ ఫుడ్ మానేయడం ,తరచూ వ్యాయామం చేయడం వలన శరీర బరువు తగ్గి ,పి .సి .ఓ .ఎస్ నుంచి బయటపడచ్చు . శరీర బరువులో 5 నుంచి 10 శాతం తగ్గుదల సరైన కాలంలో ఋతు చక్రం జరగడానికి ,సంతానోత్పత్తి అవకాశాలు మెరుగుపడడానికి అంతేకాకుండా హృద్రోగ ప్రమాదం మరియు మధుమేహం వచ్చే పరిస్థితిని నిర్మూలించడానికి సాయపడుతుంది -
వైద్య చికిత్స :
గర్భాశయం నుండి అండాశయాలు విడుదల అవడానికి మందులు వేసుకోవడం మరియు అధునాతమైన వైద్య విధానాలు అనగా ఐ .యూ .ఐ మరియు ఐ .వి .ఎఫ్ లాంటివి తీసుకోవడం మీ సంతానలేమిని అధిగమించేలా చేసి మీరు సంతానం పొందడానికి సాయపడతాయి
పి .సి .ఓ .ఎస్ తో పాటు వచ్చే చిక్కులు :
-
i.మధుమేహం :
పి .సి . ఓ .ఎస్ ఉన్న యువతులకు వారి గర్భధారణ తర్వాత మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .రక్తంలో చక్కెర స్థాయిని తరచూ చూసుకుంటూ ఉండాలి ,చికిత్స తీసుకోకుండా వదిలేస్తే ,దాని ఫలితంగా సాధారణంగా ఉండే దానికన్నా పెద్దగా బిడ్డ పుట్టడం ,నెలలు నిండక ముందే కాన్పు రావడం, సిజేరియన్ ఆపరేషన్ జరిగే ప్రమాదం ఎక్కువగా ఉండడం లాంటివి జరుగుతాయి -
ii.గర్భస్రావం :
పి .సి .ఓ .ఎస్ వలన గర్భ స్రావం జరిగే అవకాశాలు పెరుగుతాయి .బహుశా ,గర్భస్రావం జరగడానికి సరైన కారణం తెలియకపోయిన ,దానికి కారణం హార్మోన్ అసమతుల్యత లేదా ఊబకాయం అవ్వచ్చు - ప్రీ ఎక్ లాంప్సియా :
ప్రీ ఎక్ లాంప్సియా అనేది అధిక రక్తపోటు వలన కలిగే ఒక స్వభావం ,ఇది గర్భంలో ఉన్న పిండం పోషణ ని అడ్డుకుని జన్మించే బిడ్డ తక్కువ బరువుతో పుట్టేలా చేస్తుంది
పి .సి .ఓ .ఎస్ ఉన్న యువతులు గర్భం పొందడానికి ఆహారపు అలవాట్లలోనూ,మందులు వేసుకోవడంలోనూ,జీవనశైలిలో మార్పులు చేయడంలోనూ సరైన పద్ధతులు పాటించాలి .
పి .సి . ఓ .ఎస్ ఉన్న మహిళలు అందరు ఐ.వి.ఎఫ్ లేదా అధునాతనమైన చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు.తల్లి కావాలనుకునే మహిళలు అందరూ వారి ఋతుచక్రానికి సంబంధించి సరైన అవగాహన తో ఉంటే చాలు.
fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit
How we reviewed this article:
- Current Version
- September 7, 2022 by Oasis Fertility
- August 30, 2022 by Oasis Fertility
- August 23, 2022 by Oasis Fertility
- February 9, 2022 by Oasis Fertility