అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు దంపతులు తల్లిదండ్రులు కావడంలో సహాయపడతాయి
వంధ్యత్వ సమస్యలను ఎదుర్కొనే దంపతులకు వంధ్యత్వాన్ని అధిగమించడంలో సహాయపడే విస్తృతమైన సంతానోత్పత్తి చికిత్సల గురించి తెలియదు. మీ స్నేహితుడు లేదా పొరుగువారు లేదా బంధువుకు పనిచేసిన చికిత్స మీకు పని చేయకపోవచ్చని కూడా మీరు తెలుసుకోవాలి. దుస్తులు S, M, L, XL, XXL, XXXL, మొదలైన వివిధ పరిమాణాల కలిగి ఉన్నట్లే, సంతానోత్పత్తి చికిత్సలు ప్రతి డాఫ్పతులకు వారి వయస్సు, వైద్య పరిస్థితి, జీవనశైలి, ఆరోగ్యం మరియు అనేక ఇతర కారకాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారికొరకు ప్రత్యేకించి రూపొందించాలి. ఒక సైజు అన్నింటికీ సరిపోనట్టే ప్రతి దంపతులకు మందుల రకం, మోతాదు మరియు సమయ వ్యవధిని వారికి అనుకూలంగా రూపొందించాలి..
మీకు సంతానోత్పత్తి చికిత్స ఎలా సిఫార్సు చేయబడింది?
దంపతులు తమకు ఎలాంటి సంతానోత్పత్తి చికిత్స అవసరమో తామే నిర్ణయించుకోలేరు. సంతానోత్పత్తి నిపుణులు మాత్రమే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన చికిత్సను ఎంచుకోగలరు. అందువల్ల, దంపతులు ఒక సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే, నిపుణులతో సంప్రదింపులను ఆలస్యం చేయకూడదు. ముందుగా, మీరు అందుబాటులో ఉన్న వివిధ సంతానోత్పత్తి చికిత్సలను తెలుసుకోవడం ముఖ్యం. OITI, IUI, IVF, ఔషధ-రహిత IVF, సంతానోత్పత్తి సంరక్షణ, దాత చికిత్స, పురుషుల సంతానోత్పత్తి చికిత్స మొదలైనవి.
OITI: (ఓ ఐ టి ఐ)
ఓ ఐ టి ఐ అంటే ఏంటి?
· బేస్‌లైన్ సంతానోత్పత్తి చికిత్స
· స్త్రీ యొక్క ఫోలికల్స్ అభివృద్ధికి మరియు అండోత్సర్గము (అండము యొక్క విడుదల) కొరకు మందులు ఇవ్వబడతాయి. అండములు విడుదలయ్యే రోజు కనిపెట్టి ఆ సమయంలో సంభోగంలో పాల్గొనాలని దంపతులకు సలహా ఇస్తారు తద్వారా దంపతులు సహజంగా గర్భం దాల్చడానికి సహాయపడుతుంది.
ఓ ఐ టి ఐ ఎవరికి అవసరం?
· అరుదుగా అండోత్సర్గము ఉన్న స్త్రీలకు
· పి సి ఓ ఎస్ ఉన్న మహిళలకు
IUI: ( ఐ యూ ఐ)
· ఐ యూ ఐ అనేది సంతానోత్పత్తి చికిత్స యొక్క తదుపరి స్థాయి.
· స్త్రీ యొక్క ఫోలికల్స్ అభివృద్ధి కోసం మందులు ఇవ్వబడుతుంది, ఆ తర్వాత అండోత్సర్గము ప్రేరేపించబడుతుంది, దీని ఫలితంగా అండములు విడుదల అవుతాయి. పురుష భాగస్వామి నుండి వీర్యం నమూనా సేకరించబడుతుంది మరియు ఆరోగ్యకరమైన శుక్ర కణాలను ఎంపిక చేస్తారు. ఈ శుక్రకణాల ఫలదీకరణం కోసం కాథెటర్ ద్వారా స్త్రీ గర్భాశయంలోకి చొప్పించబడతాయి. ఫలదీకరణం తరువాత ఏర్పడిన జైగోట్, పిండంగా అభివృద్ధి చెందుతుంది, అది తరువాత పెరుగుతుంది మరియు శిశువుగా మారుతుంది.
ఐ యు ఐ ఎవరికి అవసరం?
· వివివరణలేని వంధ్యత్వం
· శుక్ర కణాల సంఖ్యా తక్కువుగా ఉన్న పురుషులు
· మోస్తరు ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలు
· గర్భాశయ సమస్యలు ఉన్న మహిళలు
IVF: (ఐ వి ఎఫ్)
· ఐ వి ఎఫ్ అనేది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స
· అండముల ఉత్పత్తి కోసం అండాశయాలను ఉత్తేజపరిచేందుకు స్త్రీకి మందులు ఇవ్వబడుతుంది. అండములు తిరిగి పొందబడతాయి మరియు పురుష భాగస్వామి నుండి సేకరించిన శుక్రకణాలతో కలపబడతాయి. ఫలదీకరణం చెందిన అండములు పిండాలుగా మారతాయి, తరువాత మరింత అభివృద్ధి కోసం స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు.
ఐ వి ఎఫ్ ఎవరికి అవసరం?
· ఎండోమెట్రియోసిస్ ఉన్న మహిళలకు
· వివివరణలేని వంధ్యత్వం
· క్రమము లేని ఋతు చక్రం
· క్షీణించిన అండాశయ నిల్వ
· పురుష వంధత్వము
· ఎండోమెట్రియోసిస్
ఔషధ రహిత ఐ వి ఎఫ్
· ఇది ఇటీవలే అభివృద్ధి చెందిన, ఐ వి ఎఫ్ యొక్క అధునాతన శ్రేణి
· ఎటువంటి దుష్ప్రభావాలు లేవు
· సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఎంపిక
ఔషధ రహిత ఐ వి ఎఫ్ ఎవరికి అవసరం?
· పి సి ఓ ఎస్ ఉన్న మహిళలకు
· రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్
· థ్రోంబోఫిలియా ఉన్న రోగులు
· ప్రాణాపాయం ఉన్న రోగులు
· ఓసైట్ పరిపక్వత సమస్యలు
సంతానోత్పత్తి సంరక్షణ
• క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తులకు, సంతానోత్పత్తి సంరక్షణ సాంకేతికత ఒక వరం. క్యాన్సర్ మరియు దాని చికిత్స పురుషులు మరియు స్త్రీల యొక్క సంతానోత్పత్తిని ప్రభావితం చేయవచ్చు. చికిత్సకు ముందు, అతను లేదా ఆమె సంతానోత్పత్తి నిపుణుడిని సందర్శించి, వారి శుక్రకణాలను లేదా అండములను స్తంభింపజేయాలి. ఈ పద్ధతి ద్వారా, ఒకరు వారి పునరుత్పత్తి సామర్థ్యాన్ని కాపాడుకోవచ్చు మరియు వారి సౌలభ్యం మేరకు తరువాత గర్భం దాల్చవచ్చు.
దాత చికిత్స
సుర్కకణాలు లేదా అండములు నాణ్యత లేనివి అయితే, గర్భం దాల్చడానికి వేరే ఆడవారి అండములు లేదా వేరే మగవారి శుక్రకణాలను ఉపయోగించవచ్చు.
అద్దె గర్భం
ఇక్కడ, దంపతులు వారి కొరకు గర్భం ధరించడానికి సర్రోగేట్ (మహిళ) యొక్క సహాయం తీసుకోవచ్చు. సరోగసీకి వెళ్లే అనేక వైద్య పరిస్థితులు ఉన్నాయి వాటి ఆధారంగా సరోగసీ ని ఎంచుకోవచ్చు
పురుష సంతానోత్పత్తి చికిత్సలు
పరిస్థితి ఆధారంగా, పురుషులు పితృత్వాన్ని సాధించడంలో సహాయపడటానికి మైక్రోఫ్లూయిడిక్స్, MACS (మాగ్నెటిక్ అస్సార్టెడ్ సెల్ సార్టింగ్), TESA (టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్), MicroTESE (మైక్రోస్కోపిక్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్‌ట్రాక్షన్) వంటి అనేక అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
మీరు గర్భం దాల్చలేకపోతే మీలో లేదా మీ జీవిత భాగస్వామిలో సమస్య ఉండవచ్చు. ఇది సంతానోత్పత్తి నిపుణుడిచే మాత్రమే నిర్ధారణ చేయబడుతుంది. వయస్సు పెరిగే కొద్దీ స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి, సంతానోత్పత్తి చికిత్సను ఎప్పుడూ వాయిదా వేయకండి. మీకు మాతృ మరియు పితృత్వపు శుభాకాంక్షలు!