హై-రిస్క్ ప్రెగ్నన్సీ
Author : Dr Jigna Tamagond, Consultant-Fertility Specialist, Oasis Fertility, Karimnagar
(హై-రిస్క్ ప్రెగ్నన్సీ) అధిక- ప్రమాద అవకాశమున్న గర్భం – చేయవలసినవి మరియు చేయకూడనివి
ప్రెగ్నెన్సీ అనేదే మహిళలకు ఒకరకమైన భయాన్ని మరియు ఆందోళనను తెస్తుంది. కొన్ని వైద్య పరిస్థితులు మరియు జీవనశైలి అలవాట్లు హై-రిస్క్ ప్రెగ్నెన్సీకి దారి తీయవచ్చు మరియు తల్లి, బిడ్డ ఇద్దరికీ సమస్యలకు దారి తీయవచ్చు. సంక్లిష్టతలకు దారితీసే పరిస్థితులను తెలుసుకోవడం మరియు సురక్షితమైన గర్భం మరియు ఆరోగ్యకరమైన బిడ్డను కనడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రాముఖ్యం.
హై- రిస్క్ ప్రెగ్నెన్సీకి కారణాలు :
1. ఆరోగ్య పరిస్థితులు
a. మధుమేహం
మీరు గర్భం ధరించిక మునుపే మధుమేహం కలిగి ఉంటే లేదా మీ గర్భధారణ సమయంలో మధుమేహం వచ్చిఉంటే (గర్భధారణ మధుమేహం), అలాంటప్పుడు షుగర్ స్థాయిలు అనియంత్రితంగా ఉంటే అది తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ సమస్యలకు దారితీయవచ్చు. మీరు గర్భధారణ మధుమేహం తో పాటు అధిక బరువు కలిగి ఉంటే ప్రమాదం అవకాశాలు పెరుగుతుంది.
b. PCOS (పి సి ఓ ఎస్)
PCOS ఉన్న స్త్రీలు ఇన్సులిన్ నిరోధకత, గుండె జబ్బులు, స్ట్రోక్ మొదలైన అనేక సమస్యలను ఎదుర్కునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
c. థైరాయిడ్ సమస్య
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న స్త్రీలు ప్రీఎక్లాంప్సియా (అధిక BP), ప్లాసెంటల్ అబ్రప్సిన్ (ప్రారంభ దశలో గర్భాశయం నుండి మావిని వేరుచేయడం), పల్మనరీ హైపర్‌టెన్షన్ మొదలైన సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇది గర్భస్రావం, బరువు తగ్గటం మరియు ప్రసవానికి కూడా దారితీయవచ్చు.
d. ఆటో ఇమ్యూన్ వ్యాధులు
సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. స్త్రీలు సురక్షితమైన గర్భం మరియు ప్రసవానికి సహాయపడే మల్టీ డిస్సిప్లినరీ విధానం అవసరం.
e. అధిక రక్త పోటు
అదుపులేని రక్తపోటు స్ట్రోక్, ప్లాసెంటల్ అబ్రషన్ మొదలైన వాటికి దారితీస్తుంది.
f. ఊబకాయం
ఊబకాయం ఉన్న మహిళల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, నెలలు నిండకుండా పుట్టుట, నవజాత శిశువుల మరణం మొదలైన వాటికి దారి తీస్తుంది.
2. జీవనశైలి ఎంపికలు
a. ధూమపానం
ధూమపానం చేసే మహిళలకు పుట్టుకతో వచ్చే లోపాలతో పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
b. మద్యం సేవించడం
మహిళలు అధికంగా మద్యం సేవించడం వల్ల శిశువులో ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) ఏర్పడుతుంది, ఇది శారీరక వైకల్యాలు, నాడీ వ్యవస్థ దెబ్బతినడం మొదలైన వాటిని కనబరుస్తుంది.
c. ఔషధ వినియోగం
ఔషధ వినియోగం సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ (SIDS), మరియు పుట్టుకతో వచ్చే లోపలకు దారి తీయవచ్చు.
3. వయస్సు – 35 ఏళ్ల తర్వాత మొదటిసారి గర్భం దాల్చడం
వయసు పైబడిన తరువాత ప్రసూతి సిజేరియన్, ఫీటల్ డెత్గ ఇన్ యూటిరో (FDIU) మరియు ఇతర సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
4. బహుళ గర్భాలు
మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న స్త్రీలకు గర్భధారణ సమయంలో హై బీపీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భస్రావం, ముందస్తు ప్రసవం, పుట్టుకతో వచ్చే లోపాలు మొదలైన వాటికి కూడా దారితీస్తుంది.
ప్రికాషన్స్ ఫర్ ప్రెగ్నెన్సీ
1. ధూమపానంకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇది పిండం యొక్క అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది.
2. పచ్చి మాంసాన్ని తినడం మానేయాలి ఎందుకంటే ఇది ఇన్ఫెక్షన్కు కారణమవుతుంది మరియు మృత శిశువు లేదా పిండానికి ఇతర సమస్యలకు దారితీయవచ్చు.
3. కాఫీని నివారించండి, ఎందుకంటే అధిక మొత్తంలో కాఫీ సేవించడం వల్ల గర్భస్రావం జరుగుతుంది.
4. ఒత్తిడిని నివారించండి మరియు యోగా సాధన మరియు సంగీతం వినడం ప్రారంభించండి.
5. మద్యం సేవించడం మానుకోండి ఎందుకంటే ఇది శిశువులో సమస్యలకు దారితీస్తుంది.
గర్భధారణ సమయంలో మీరు ఏమి చేయవచ్చు?
1. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు కావలిసినంత నిద్రపోండి, ఇది మీ రోగనిరోధక వ్యవస్థకు మరియు మెదడుకు ప్రయోజనకరంగా ఉంటుంది మరియు హార్మోన్ల నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
2. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి మరియు మీ ఆహారంలో ఎక్కువా కూరగాయలు, పండ్లు చేర్చడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.
3. ప్రెగ్నెన్సీ సమయంలో అధిక బరువు పెరగడం వల్ల సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండండి.
4. శిశువులో పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధించే ఫోలిక్ యాసిడ్ వంటి ప్రినేటల్ విటమిన్లను చేర్చండి.
5. మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్‌లను మానకూడదు
6. తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ఉపయోగపడే యోగా లేదా వ్యాయామం సాధన చేయండి.
హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ ను డాక్టర్ సహాయం తో మేనేజ్ చేయవచ్చు. గర్భం దాల్చిన 24 నుండి 28 వారాల మధ్య మధుమేహం కోసం స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది, అయితే మీకు మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లయితే, మీరు దానిని ముందుగానే తనిఖీ చేసుకోవాలి. గైనకోలజిస్ట్ ని సందర్శించిన ప్రతిసారి రక్తపోటును తనిఖీ చేయడం అవసరం.
సూచనలు అన్నింటిని మరియు మందులను తప్పకుండా పాటించడం చాలా అవసరం. గర్భిణీ స్త్రీకి సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన గర్భం మరియు ప్రసవానికి సానుకూల మరియు సంతోషకరమైన మనస్తత్వం ముఖ్యమైనది.