అధిక AMH స్థాయిలతో గర్భవతి కావటం సాధ్యమేనా?
Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist
గర్భం కోసం ప్రణాళిక చేస్తున్నప్పుడు, సారవంతమైన కాలము, అండాశయ పరిస్థితులు, అండము మరియు శుక్ర కణాల ఆరోగ్యం మరియు హార్మోన్లు వంటి వివిధ కారకాలు గర్భధారణలో పాత్ర పోషిస్తాయి. అటువంటి ప్రాముఖ్యత కలిగిన హార్మోన్ AMH లేదా యాంటీ-ముల్లెరియన్ హార్మోన్.
మొదటిగా, AMH అంటే ఏమిటి?
MIS అని కూడా పిలుస్తారు- అంటే ముల్లెరియన్ ఇన్‌హిబిటింగ్ సబ్‌స్టాన్స్, ఇది పిండ దశలో మగ మరియు ఆడ జననేంద్రియ అభివృద్ధికి అవసరమైన హార్మోన్.
పురుషులలో వృషణాలలో AMH ఉత్పత్తి అవుతుంది. మగవారికి విషయంలో, దీనికి వైద్యపరంగా ప్రాముఖ్యత లేదు.
మహిళల్లో, AMH అండాశయ ఫోలికల్స్‌లో ఉత్పత్తి అవుతుంది. ఇది అండాశయ ఫోలికల్స్ యొక్క పెరుగుదల మరియు దాని పరిపక్వతలో సహాయపడుతుంది.
పరీక్ష యొక్క ఉపయోగాలు
· AMH స్థాయిలను కొలవడం PCOD వంటి వివిధ స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్య సమస్యలపై స్పష్టతనిస్తుంది, అయితే AMH మరిముఖ్యముగా అండాశయ నిల్వలను కొలవడానికి బయోమానికగా ఉపయోగించబడుతుంది. అండాశయాలలో మిగిలిన అండముల సంఖ్యను అంచనా వేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.
1.AMH పరీక్ష తమ అండములను ఘనీభవన చేయడానికి పరిగణిస్తున్న స్త్రీలు నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది.
2.యుక్తవయసులో ఉన్న బాలికలలో ఋతు చక్రం లేకపోవడాన్ని (అమెనోరియా) AMH స్థాయిలను గమనించడం ద్వారా నిర్ధారించవచ్చు.
3.ఇది IVF మరియు IUI వంటి సంతానోత్పత్తి చికిత్సల ఫలితాలను అంచనా వేయడంలో కూడా సహాయపడుతుంది.
4.రుతువిరతి ప్రారంభాన్ని అంచనా వేస్తుంది.
సాధారణ AMH స్థాయిలు ఏమిటి?
స్త్రీ వయస్సు ఆధారంగా AMH స్థాయిలు అంచనా వేయబడతాయి.
యుక్తవయస్సులో, AMH స్థాయిలు పెరగడం ప్రారంభమై 25 సంవత్సరాల వయస్సులో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పెరుగుతున్న వయస్సుతో ప్రతి మహిళలో AMH స్థాయిలు సహజంగా తగ్గుతాయి. అందువల్ల AMH యొక్క తక్కువ స్థాయిలు తక్కువ అండముల నిల్వను సూచిస్తాయి అదేవిధంగా అండముల నిల్వలు స్థాయిని సుచింస్తుంది.
ప్రామాణిక స్థాయిలు మారుతూ ఉంటాయి. AMH స్థాయిల కోసం సాధారణ పరిధులు క్రింద ఉన్నాయి.
1.సాధారణము : 1.0 ng/mL నుండి 4.0 ng/mL మధ్య (సుమారుగా).
2.తక్కువ: 1.0 ng/mL కంటే తక్కువ
3.అత్యంత తక్కువ: 0.4 ng/mL కంటే తక్కువ
వయసుల వారీగా AMH స్థాయిలు:
ప్రతి సంబంధిత వయస్సు వర్గానికి సంబంధించిన కనిష్ట స్థాయిలు సుమారుగా క్రింద విధంగా ఉన్నాయి.
1.25 సంవత్సరాలు: 3.0 ng/mL.
2.30 సంవత్సరాల వయస్సు: 2.5 ng/mL.
3.35 సంవత్సరాల వయస్సు: 1.5 ng/ mL.
4.40 సంవత్సరాల వయస్సు: 1 ng/mL.
5.45 సంవత్సరాలు: 0.5 ng/mL.
AMH స్థాయిలు మరియు గర్భం:
AMH స్థాయిలు గర్భధారణ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. 25 – 30 సంవత్సరాల ఫలవంతమైన వయస్సు గల ఏ స్త్రీ అయినా మరియు 2.5 ng/mL నుండి 3.5 ng/mL వరకు AMH రీడింగ్‌ని కలిగి ఉంటే,
అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మరియు తక్కువ AMH స్థాయిలు ఉన్న స్త్రీల కంటే గర్భం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అధిక AMH మంచి విషయమా?
అధిక AMH స్థాయిలు మంచి అండాశయ నిల్వ మరియు పెద్ద సంఖ్యలో అందములు ఉండటంతో సంబంధం కలిగి ఉంటాయి అయినప్పటికీ, ఇది అండముల నాణ్యతను సూచించదు, ఇది గర్భం ధరించడంలో మరియు సంతానోత్పత్తి చికిత్స యొక్క ఫలితంలో పాత్ర పోషిస్తున్న ముఖ్యమైన అంశం. అండముల నాణ్యతను అంచనా వేయడానికి AMH స్థాయిలు ఉపయోగించబడవు.
ఎక్కువ AMH స్థాయిలు కచ్చితంగా మంచి గర్భధారణ అవకాశాలకు దారితీయవు.
ఏదైనా AMH రీడింగ్ 4.0 ng/mL కంటే ఎక్కువ ఉంటే అది అసాధారణంగా ఎక్కువగా ఉన్నట్టు అది ఆందోళన కలిగించే విషయం.
అసాధారణంగా అధిక AMH స్థాయిలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) హార్మోన్ల స్థితిని సూచిస్తాయి, ఇది అండాశయాలలో ద్రవంతో నిండిన సంచుల ఉనికిని కలిగి ఉంటుంది, ఇది AMH యొక్క అధిక ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
అండముల ఘనీభవన విషయంలో, అధిక AMH స్థాయిలు అండాశయ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS) అభివృద్ధికి అవకాశాలను పెంచుతుంది.
అధిక AMH స్థాయిలు అండాశయ క్యాన్సర్ మరియు గ్రాన్యులోసా సెల్ ట్యూమర్‌ల వంటి స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ యొక్క కొన్ని క్యాన్సర్‌ల లక్షణం.
గుర్తుంచుకోవలసినవి
AMH స్థాయిలు మాత్రమే మీ సంతానోత్పత్తి స్థితిని నిర్ధారించవు. గర్భాశయ స్థితి, నాళాల ఆరోగ్యం, శుక్రకణ కారకాలు మరియు అంతర్లీన వైద్య పరిస్థితులు వంటి ఇతర అనుబంధ పునరుత్పత్తి కారకాలు గర్భధారణకు దోహదం చేస్తాయి.
ఆశావాహ పక్షంలో, గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ, తక్కువ అండముల గణన లేదా తక్కువ స్థాయి AMHతో గర్భం దాల్చవచ్చని చెప్పవచ్చు.