ఎండోమెట్రియోసిస్ గురించి మీరందరు తెలుసుకోవాలి అనుకునేవి
ఎండోమెట్రియోసిస్ గురించి మీరందరు తెలుసుకోవాలి అనుకునేవి :
చాల మంది స్త్రీలు ఋతు స్రావానికి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటారు ,కానీ వాళ్ళకి తెలియని విషయమేంటంటే సకాలం లో జరగని ఋతుస్రావం,అధిక రక్తస్రావం లేదా తీవ్రమైన నొప్పి సంతానలేమి కి దారి తీస్తాయి.ఎండోమెట్రియోసిస్ వల్ల కలిగే నొప్పిని చాల మంది స్త్రీలు ఋతుస్రావంలో కలిగే నొప్పి అని భావించి పొరపడి దానిని కనుగొనలేరు దాని వల్ల ఇది చాలా ఎక్కువ రీతిలో గర్భం దాల్చే అవకాశాలను తగ్గించేస్తుంది .
ఈ ఎండోమెట్రియోసిస్ గురించి వివరంగా తెలుసుకుందాం .
ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి :
మనం ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకోవాలంటే ,ముందుగా,ఋతుచక్రం గురించి తెలుసుకోవాలి.మరియు స్త్రీలకు ఋతుచక్రం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి.గర్భాశయపు లోపలి పొరని ఎండోమెట్రియం అంటారు ,ఈ ఎండోమెట్రియం నే ప్రతినెలా గర్భాశయం తనలోపలకి ఫలదీకరణ అండాలను తీసుకోడానికి సిద్ధం చేస్తుంది ,ఒక వేళ గర్భం అవ్వకపోతే ప్రతి నెలా ఎండోమెట్రియం కణజాలాలు విడిపోయి రుతుస్రావం లో జరిగే రక్తస్రావం రూపంలో బయటకి వెళ్ళిపోతాయి.ఎండోమెట్రియం గర్భాశయం బయట ఎదిగినపుడు ఉదాహరణకి ఫాలోపియన్ నాళాలు ,అండాశయం ,యోని మొదలైన వాటిలో ఎదిగితే దానినే ఎండోమెట్రియోసిస్ అంటారు .ఈ కణజాలాలు కూడా విడిపోతాయి కానీ రక్తం రూపంలో బయటకి రావడానికి దారిలేక వాపుకి కారణం అయ్యి ఫలితంగా మచ్చలు ,పుండులు ఏర్పడతాయి .
ఎండోమెట్రియోసిస్ లక్షణాలు ఏంటి ?
- పొత్తికడుపు దగ్గర నొప్పి లేదా వీపు కిందిభాగంలో నొప్పి
- ఋతుస్రావంలో తీవ్రమైన నొప్పి (డిస్మెనోరియా)
- గర్భం దాల్చడంలో ఇబ్బంది (వంధ్యత్వం )
- సంభోగం జరిగే సమయంలో నొప్పి (డిస్పెరూనియా)
- రుతుస్రావం సమయంలో అధిక రక్తస్రావం
- బాధాకరమైన మల విసర్జన లేదా మూత్ర విసర్జన (డిస్చెజియా)
ఎండోమెట్రియోసిస్ ని నిర్ధారించడం ఎలా ?
1.ఆల్ట్రాసౌండ్
2 .లోతుగా పాతుకుపోయిన ఎండోమెట్రియోసిస్ ని గుర్తించడానికి అరుదుగా ఎం .ఆర్ .ఐ స్కాన్ ని ఉపయోగిస్తారు
3 .లాప్రోస్కోపీ మరియు బయాప్సీ -ఎండోమెట్రియాటిక్ పుండుని లాప్రోస్కోపీ మరియు బయాప్సీ చేయడం అనేది ఎండోమెట్రియోసిస్ ని కనుగొనడం లో బంగారుప్రమాణం .ఒక నమూనా ఎండోమెట్రిక్ కణజాలాన్ని మైక్రోస్కోప్ లో చూడడం వల్ల(లాప్రోస్కోపీ జరుగుతున్నపుడు )నిపుణులకు రోగి లో ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనే విషయం తెలుసుకోడం సులభం అవుతుంది
ఎండోమెట్రియోసిస్ కి చికిత్స :
- వంధ్యత్వానికి చికిత్స అవసరంగా భావిస్తే రోగి అండాశయ నిక్షిప్త ప్రదేశాన్ని ఆధారం చేసుకుని ఐ వి ఎఫ్ లేదా ఐ యూ ఐ చికిత్స ని తీసుకోవాలి
- పిల్లలు పుట్టేసిన తర్వాత నొప్పి లేదా ఇతర లక్షణాల నుంచి విముక్తి పొందడానికి గర్భం రాకుండా వాడే టాబ్లెట్ లు ,హార్మోన్ చికిత్స లేదా శస్త్ర చికిత్స వంటి మార్గాలు ఉన్నాయి
హార్మోన్ చికిత్స :
హార్మోన్ చికిత్స ద్వారా ,అండోత్సర్గం నివారించబడి దాని వల్ల ఎండోమెట్రియం ఎదుగుదల నెమ్మదిస్తుంది
- శస్త్రచికిత్స :
ప్రభావితమైన కణజాలాలని లాప్రోస్కోపీ శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు ,కొన్ని కేసు లలో గర్భసంచి తీసేస్తారు
జీవనశైలి పద్దతుల ద్వారా ఎండోమెట్రియోసిస్ ని తగ్గించడం :
ఆరోగ్యకరమైన ఆహారాలు భుజించడం :
పండ్లు ,కూరగాయలు ఒమేగా -3 సమృద్ధిగా ఉన్న కొవ్వు ఆమ్లాలను తీసుకోడం ద్వారా ఎండోమెట్రియోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదాన్ని నివారించవచ్చు .ఆల్కహాల్ ,కెఫిన్ మరియు చెడు కొవ్వు ఉండే పదార్ధాలను అస్సలు తీసుకోకూడదు
వ్యాయాయం :
విధిగా వ్యాయాయం చేయడం అనేది ఎండోమెట్రియోసిస్ ని నియంత్రించడంలో సాయపడుతుంది, అంతే కాక యోగ, ధ్యానం చేయడం వల్ల మీ ఒత్తిడి తగ్గి దాని ద్వారా మీరు ఎండోమెట్రియోసిస్ ని సులభంగా నియంత్రించు కోగలుగుతారు మీకు మీ ఋతుచక్రం లో ఏమైనా సమస్యలుంటే ,సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడానికి ఏమాత్రం సంకోచించకండి ,ముందుగానే సమస్యను కనిపెట్టి ,చికిత్స తీసుకుంటే మీరు సంతానలేమి ని అధిగమించిన వారు అవుతారు మరియు తల్లితండ్రులు అవ్వాలనే మీ కలను సాధించిన వారవుతా