ఫెలోపియన్ ట్యూబ్ అవరోధం మరియు వంధ్యత్వం గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు
Author: Dr. Jigna Tamagond ,Consultant – Fertility Specialist
వంధ్యత్వం చాలా మంది వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. తెలిసిన మరియు తెలియని కారణాల వల్ల లింగ వ్యత్యాసం లేకుండా వంధ్యత్వాన్ని అనుభవిస్తారు. ఫెలోపియన్ నాళాలలో అవరోధం అనేది స్త్రీ వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30% మంది మహిళల్లో ఫెలోపియన్ ట్యూబ్‌లలో అవరోధం వంధ్యత్వానికి కారణం.
ఫెలోపియన్ నాళాలు అండాశయాలను మరియు గర్భాశయాన్ని కలిపే వంతెనలు.
గర్భధారణ ప్రక్రియలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది.
ఇది అండములు అండాశయాల నుండి గర్భాశయం వరకు ప్రయాణించడానికి సహకరిస్తుంది. శుక్రకణాలు గర్భాశయం నుండి ఫెలోపియన్ నాళం ద్వారా అండముతో కలవడానికి పైకి ప్రయాణిస్తుంది, ఇది అండము యొక్క ఫలదీకరణకు దారితీయవచ్చు.
ఫలదీకరణం చేయబడిన అండము ఈ వంతెన గుండా ప్రయాణించి గర్భాశయంలో అమర్చబడి గర్భం దాల్చుతుంది.
సంతానోత్పత్తిపై నాళములో అవరోధం యొక్క ప్రభావం:
నాళంలో అవరోధం కారణంగా, అండము యొక్క ఫలదీకరణం జరగదు. ఒకవేళ ఫలదీకరణం జరిగినా (నాళాలలో పాక్షిక అవరోధం కారణంగా), ఫెలోపియన్ నాళంలో అవరోధం వలన ఫలదీకరణం చెందిన అండము గర్భాశయానికి వెళ్లడాన్ని అడ్డుపడుతుంది, ఇది ఎక్టోపిక్ గర్భధారణకు దారితీస్తుంది.
అయినప్పటికీ, ఫెలోపియన్ నాళంలో ఒకదానిలో మాత్రమే అవరోధం ఏర్పడితే అండము ఫలదీకరణం చెందడం మరియు గర్భం దాల్చడం సాధ్యమే.
నాళాల అవరోధంకి దారితీసే అన్ని కారణాల శ్రేణిలో, కొన్ని కారకాలు క్రింద ఇవ్వబడ్డాయి:
- ఇన్ఫెక్షన్ల కారణంగా మచ్చ కణజాలం ఉండటం (పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ మరియు STIలు వంటివి)
- క్రితంలో ఉదర శస్త్రచికిత్స జరిగిఉంటే – అపెండిక్స్ తొలగింపు శస్త్రచికిత్స, ఎక్టోపిక్ గర్భం
- ఎండోమెట్రియోసిస్
- గర్భాశయం మరియు ఫెలోపియన్ నాళాలలో వాపు
- గర్భాశయం మరియు ఫెలోపియన్ నాళాల పుట్టుక లోపాలు మరియు అసాధారణతలు
- గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్
అవరోధం గల నాళాలు కలిగి ఉండవచ్చనడానికి సంకేతాలు:
ఫెలోపియన్ నాళంలో అవరోధం యొక్క లక్షణాలు అడ్డంకి యొక్క మూల కారణంపై ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు, ఎండోమెట్రియోసిస్ విషయంలో, ఆ వ్యక్తి భారీ మరియు బాధాకరమైన ఋతుచక్రం అనుభవించవచ్చు.
హైడ్రోసల్పిన్స్ విషయంలో ఉదరం యొక్క ఒక వైపున తేలికపాటి నుండి సాధారణ నొప్పి ఉంటుంది.
కొంతమంది మహిళలు కటి ప్రాంతంలో అప్పుడప్పుడు లేదా ఋతుచక్రం సమయంలో నొప్పిని అనుభవించవచ్చు.
అయినప్పటికీ, రోగనిర్ధారణ తర్వాత, ఈ పరిస్థితిని అదుపుచేసి దానికి చికిత్స చేయవచ్చు.
రోగనిర్ధారణ
అవరోధం గల ఫెలోపియన్ నాళాల యొక్క మూల కారణం-నిర్దిష్ట లక్షణాల కారణంగా గుర్తించడం కష్టం. సాధారణంగా, ఒక వ్యక్తి గర్భవతిని పొందడంలో ఇబ్బందిని ఎదుర్కొనే వరకు పరిస్థితి నిర్ధారణ చేయబడదు.
అవరోధం గల ఫెలోపియన్ నాళాలను నిర్ధారించడానికి అత్యంత సాధారణంగా ఉపయోగించే పరీక్షలు:
1.హిస్టెరోసల్పింగోగ్రామ్ లేదా HSG అనేది ఒక ఎక్స్-రే పరీక్ష, దీనిలో ఫెలోపియన్ నాళాలలోని అవరోధంను గుర్తించేందుకు సురక్షితమైన విషపూరితంకాని రంగును గర్భాశయంలోకి చొప్పిస్తారు.
2.సోనోహిస్టెరోగ్రామ్, సాధారణంగా సోనోగ్రామ్ అని పిలుస్తారు, ఇది గర్భాశయం లోపలి భాగాన్ని వీక్షించడానికి ఉపయోగించే అల్ట్రాసౌండ్ పరీక్ష. ఇది ధ్వని తరంగాలను ఉపయోగించి కంప్యూటర్ చిత్రాన్ని సృష్టిస్తుంది.
3.లాప్రోస్కోపీని కీహోల్ సర్జరీ అని పిలుస్తారు, దీనిలో పొత్తికడుపు లోపలి భాగాన్ని వీక్షించడానికి సహాయపడే చిన్న కెమెరాను చొప్పించడానికి శరీరంలో ఒక చిన్న గాటు చేయబడుతుంది.
అవరోధం ఉన్న ఫెలోపియన్ నాళాల కోసం చికిత్స అవకాశాలు:
చెప్పినట్లుగా, ఫెలోపియన్ నాళాలు పాక్షికంగా నిరోధించబడినా లేదా ఒక నాళము తెరిచిఉన్నా గర్భం దాల్చవచ్చు. అయినప్పటికీ, పాక్షికంగా నిరోధించబడిన నాళాల విషయంలో ఎక్టోపిక్ గర్భం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫెలోపియన్ నాళాలు రెండూ పూర్తిగా మూసుకుపోయినట్లయితే, చికిత్స లేకుండా గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
అవరోధం ఉన్న ఫెలోపియన్ నాళాల చికిత్స అవకాశాలు ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటాయి
- వ్యక్తి వయస్సు
- వైకల్యం యొక్క రకం/కారణం
- అవరోధం ఉన్న స్థానం
పెల్విక్ ఇన్ఫెక్షన్ నిర్ధారణ విషయంలో, యాంటీబయాటిక్స్ సూచించబడతాయి.
శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితులలో, లాపరోస్కోపీ ఉపయోగించబడుతుంది. ఈ పద్ధతి అవరోధం తొలగించి, ఫెలోపియన్ నాళాలను తెరవడం ద్వారా స్త్రీ గర్భం దాల్చే అవకాశాలను మెరుగుపరుస్తుంది.
శస్త్రచికిత్స తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఈ క్రింది వాటిపై ఆధారపడి ఉంటాయి:
- వయస్సు
- భాగస్వామి యొక్క శుక్రకణాల ఆరోగ్య పరిస్థితి
- ఫెలోపియన్ నాళాల యొక్క నష్టం స్థాయి
శస్త్రచికిత్స సిఫార్సు చేయని సందర్భాలలో లేదా శస్త్రచికిత్స ఫలితం విఫలమైన సందర్భంలో, ఆ వ్యక్తికి ఇన్ – విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) సూచించబడుతుంది.
IVF నియంత్రిత ప్రయోగశాల పరిస్థితులలో శుక్రకణాలతో అండము ఫలదీకరణం చెందే ప్రక్రియ ఉంటుంది. ఫలదీకరణం చేయబడిన అండము గర్భాశయంలోకి బదిలీ చేయబడుతుంది, ఇది గర్భాశయంలో అమర్చిన తర్వాత, విజయవంతమైన గర్భధారణకు దారితీస్తుంది.
సరైన సమయంలో సరైన జోక్యంతో ఫెలోపియన్ నాళాలలో అవరోధం ఉన్నప్పుడు కూడా బిడ్డ పుట్టాలనే మీ కల సాధ్యమే.
ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన గర్భం పొందే అవకాశాలను అర్థం చేసుకోవడానికి, అందుబాటులో ఉన్న మరియు మీకు తగిన చికిత్స అవకాశాల గురించి ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.
fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit
How we reviewed this article:
- Current Version
- January 4, 2024 by Oasis Fertility
- August 28, 2023 by Oasis Fertility