
క్రమరహిత పీరియడ్స్ మరియు గర్భం గురించి మీరు తెలుసుకోవలసినవి

Author: Dr. Sai Manasa Darla, Consultant, Fertility Specialist & Laparoscopic Surgeon
గర్భధారణ ఒక రోలర్ కోస్టర్ ప్రయాణం వంటిది మరియు మీరు గర్భం దాల్చడంలో ఇబ్బందిని ఎదుర్కొన్నప్పుడు అది భరించలేనిదిగా ఉంటుంది.
స్త్రీ యొక్క నెలసరి ఋతుచక్రం కనిపెట్టుకోడం ఈ ప్రయాణంలో మొదటి అడుగు. గర్భధారణను ప్రణాళిక చేయడానికి ఒకరి ఋతు చక్రం యొక్క కాలమును, సారవంతమైన సమయమును మరియు అండోత్సర్గము గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఋతు చక్రంలో అసమానతలు గర్భం సాధించడంలో అడ్డంకులను కలిగిస్తాయి.
క్రమరహిత పీరియడ్స్ అంటే ఏమిటి?
స్త్రీ యొక్క ఋతు చక్రం సాధారణంగా మారుతూ ఉంటుంది. స్త్రీ యొక్క ‘సాధారణ’ ఋతు చక్రం 21 నుండి 35 రోజుల మధ్య ఉంటుంది, చక్రం నుండి చక్రానికి 2-3 రోజుల వ్యత్యాసం ఉంటుంది.
పీరియడ్స్ సక్రమంగా లేవని ఈ క్రింది పరిస్థితులలో పరిగణించబడతాయి:
- ఏదైనా ఋతుచక్రం ‘సాధారణ’ పరిధికి మించి లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు
- 8 రోజుల కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకపోతే (కొన్ని సందర్భాల్లో గర్భధారణ కావచ్చు)
- పాలీమెనోరియా: తరచు నెలసరి లేదా త్వరగా వచ్చే నెలసరిగా కూడా సూచిస్తారు. ఇది రుతుక్రమ రుగ్మత, దీనిలో ఋతు చక్రం యొక్క తరచుగా 21 రోజుల కంటే తక్కువగా ఉంటుంది.
- ఒలిగోమెనోరియా: రుతుక్రమం లేని పరిస్థితి. అటువంటి సందర్భాలలో ఋతు చక్రకాలం 35 రోజుల కంటే ఎక్కువ ఉంటుంది.
క్రమరహిత పీరియడ్స్ కారణాలు
అనేక కారణాలు క్రమరహిత పీరియడ్స్కు దారితీస్తాయి:
- అండోత్సర్గము సమస్యలు: గర్భం దాల్చే అవకాశం ఋతు చక్రంలో పరిపక్వ అండములు లేదా అండోత్సర్గము విడుదలపై ఆధారపడి ఉంటుంది. క్రమరహిత అండోత్సర్గము లేదా అనోయులేషన్ (అండోత్సర్గము లేకపోవడం) పీరియడ్స్‌లో క్రమరహిత్యానికి కారణమవుతుంది.
- పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS): ఇది హార్మోన్ల రుగ్మత, దీనిలో శరీరం పెద్ద మొత్తంలో పుంలింగ హార్మోన్లను (ఆండ్రోజెన్‌లు) ఉత్పత్తి చేస్తుంది, ఇది క్రమరహిత అండోత్సర్గము, అండాశయాలలో తిత్తులు మరియు వంధ్యత్వానికి దారితీస్తుంది.
- థైరాయిడ్ వ్యాధి: అతి క్రియాశీల లేదా అతి నిష్క్రియ థైరాయిడ్, ఋతు చక్రాల పునః ఘటనను మరియు క్రమబద్ధతను ప్రభావితం చేస్తుంది
- బరువు పెరగడం లేదా తగ్గడం
- ఒత్తిడి మరియు ఆందోళన
- హార్మోన్ల అసమతుల్యత
- క్రమ రహిత గర్భనిరోధక మాత్రల వినియోగం
- ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ మరియు డయాబెటిస్ వంటి పరిస్థితులు
- లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు
క్రమరహిత పీరియడ్స్ ఉన్నప్పుడు గర్భధారణను ఎలా ప్రణాళిక చేసుకోవాలి?
క్రమరహిత పీరియడ్స్‌తో స్త్రీ గర్భవతి కాలేదని అనిపించవచ్చు. కానీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, క్రమరహిత పీరియడ్స్ సమస్యను పరిష్కరించి, చికిత్స చేస్తే క్రమరహిత పీరియడ్స్ ఉన్న స్త్రీ గర్భం దాల్చే అవకాశం ఉంది.
అండోత్సర్గము సమయంను ట్రాక్ చేసి ఆ సమయంలో సంభోగం చేసినప్పుడు గర్భం యొక్క అవకాశాలను విపరీతంగా పెంచుతుంది. అండోత్సర్గాన్ని గుర్తించడానికి అండోత్సర్గము సంకేతాల కోసం చూడవచ్చు.
అండోత్సర్గము యొక్క చిహ్నాలు
- గర్భాశయ శ్లేష్మం పెరుగుదల – సాగుతూ, తేటగా ఉండే గుడ్డు-తెలుపు లాంటి డిశ్చార్జ్
- మీ బేసల్ శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల
అండోత్సర్గాన్ని అంచనా వేయడానికి అండోత్సర్గము ప్రిడిక్టర్ కిట్లు, అల్ట్రాసౌండ్ మరియు రక్త పరీక్షలను ఉపయోగించవచ్చు.
క్రమరహిత అండోత్సర్గము లేదా అండోత్సర్గము సంభవించకపోయినట్లయితే, వైద్యుడు మూలకారణాన్ని బట్టి చికిత్స ఎంపికలను సూచించవచ్చు. అంతర్లీన పరిస్థితికి చికిత్స చేయడం వల్ల మీ గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి.
కొన్ని జీవనశైలి మార్పులు పీరియడ్స్ మరియు అండోత్సర్గాన్ని నియంత్రించడంలో చాలా వరకు సహాయపడతాయి.
ఈ క్రింది సందర్భాలలో వైద్యుడిని సంప్రదించింది:
- మూడు నెలల కంటే ఎక్కువ కాలం పీరియడ్స్ రాకపోతే
- ఒక వారం కంటే ఎక్కువ కాలం పాటు రక్తస్రావం ఉంటే
- భారీ రక్తస్రావం ఉంటే
- నొప్పితో కూడుకున్న పీరియడ్స్ ఉన్నప్పుడు
- మీ వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండి మరియు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం గర్భం దాల్చడంలో విఫలమైతే
చివరి మాట:
గర్భధారణ ప్రయాణంలో క్రమరహిత పీరియడ్స్ ఉన్ననప్పటికీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. సకాలంలో చర్య తీసుకోవడం మరియు అంతర్లీన కారణాన్ని పరిష్కరించడం ద్వారా ఆరోగ్యకరమైన గర్భధారణకు అవకాశం ఉంటుంది.
అస్థిరమైన పీరియడ్స్, అండోత్సర్గ సమస్యలు మరియు ఋతు చక్రంలో క్రమరాహిత్యానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యత గర్భం పొందడం కష్టతరం చేస్తాయి.
సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించి అసాధారణ ఋతు చక్రం మరియు అండోత్సర్గాన్ని నియంత్రించడం మరియు నిర్ధారించడం ద్వారా మీ సంతానోత్పత్తి మెరుగుపడడంలో సహాయపడుతుంది.


fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit
How we reviewed this article:
- Current Version
- September 12, 2023 by Oasis Fertility
- September 8, 2023 by Oasis Fertility