HSG పరీక్ష గురించి మీరు తెలుసుకోవలసిన సమస్తం
Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist
HSG పరీక్ష అంటే ఏమిటి?
HSG పరీక్ష అనేది స్త్రీ పునరుత్పత్తి మార్గాన్ని అంచనా వేయడానికి ఒక రోగ నిర్ధారణ సాధనం. దీనినే హిస్టెరోసాల్పింగోగ్రామ్ అని కూడా పిలుస్తారు, గర్భాశయం లోపల మరియు ఫెలోపియన్ గొట్టాల లోపల ఏవైనా అసాధారణతలను అంచనా వేయడానికి ఇది ఒక సమర్థవంతమైన పద్ధతి. ఇందులో గర్భాశయంలోకి కాంట్రాస్ట్ డైని ఇంజెక్ట్ చేయడం ద్వారా, తక్కువ మోతాదు X- కిరణాలకు లోబడి, గర్భాశయ కుహరం మరియు ఫెలోపియన్ గొట్టాల ఆకారం మరియు నిర్మాణం గురించి అవగాహన కల్పిస్తుంది.
HSG పరీక్ష ఎందుకు చేయబడుతుంది?
గర్భాశయ పరిస్థితులను నిర్ధారించడానికి:
పుట్టుకతో వచ్చే గర్భాశయ క్రమరాహిత్యాలు, ఫైబ్రాయిడ్ లు, కణితులు, పాలిప్స్, పొత్తికడుపు సంశ్లేషణల కోసం గర్భాశయాన్ని పరిశీలించడానికి వంధ్యత్వ నిర్ధారణలో భాగంగా HSG పరీక్ష నిర్వహిస్తారు, ఎందుకంటే ఈ పరిస్థితులు బీజ ప్రవేశమును మరియు పిండం పెరుగుదలను ప్రభావితం చేయవచ్చు.
ట్యూబల్ లిగేషన్ (ఫాలోపియన్ గొట్టాలను మూసివేసే శస్త్రచికిత్స) యొక్క విజయాన్ని తనిఖీ చేయడానికి:
ట్యూబల్ లిగేషన్ ప్రక్రియ తర్వాత గొట్టాలు పూర్తిగా మూసుకున్నాయో లేదో నిర్ధారించడానికి కూడా ఇది చేస్తారు (గర్భధారణను నిరోధించడానికి ఫెలోపియన్ గొట్టాలను మూసివేసే విధానం).
ఫాలోపియన్ ట్యూబ్ లలో అడ్డంకులను తనిఖీ చేయడానికి:
మహిళల్లో నిరోధించబడిన ఫాలోపియన్ గొట్టాలు వంధ్యత్వానికి గల ప్రధాన కారణాలలో ఒకటి. శ్లేష్మం, కణ శిధిలాలు, పాలిప్స్ మరియు ఫైబ్రాయిడ్లు ఉండటం వల్ల ఫెలోపియన్ ట్యూబ్‌లలో అడ్డంకులు ఏర్పడతాయి ఈ అడ్డంకులు వీర్యాన్ని ఫలదీకరణం కోసం అండాన్ని చేరుకోవడానికి అనుమతించవు లేదా ఫలదీకరణం చేసిన అండాన్ని బీజప్రవేశము కోసం గర్భాశయాన్ని చేరనీయవు అంతేకాక ఎక్టోపిక్ గర్భధారణకు కూడా దారితీయవచ్చు. ఫాలోపియన్ గొట్టాలలోని ఈ అడ్డంకులను HSG పరీక్ష సహాయంతో నిర్ధారించవచ్చు.
HSG పరీక్షకు ఎలా సిద్ధం చేయాలి?
- ఋతు చక్రం యొక్క చివరి రోజు మరియు అండోత్సర్గం ప్రారంభానికి ముందు, అంటే ఋతు చక్రం యొక్క 5-10 రోజులు (ఋతు చక్రం యొక్క పొడవును బట్టి ఈ కాలం మారవచ్చు) మధ్య HSG పరీక్ష షెడ్యూల్ చేయబడిందని తెలుసుకోవడం ముఖ్యం.
- పరీక్షకు ముందు, పరీక్ష రోజున, మరియు పరీక్ష తర్వాత పొత్తికడుపు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తొలగించడానికి యాంటీబయాటిక్స్ సూచించబడతాయి..
- పరీక్షా మయంలో అసౌకర్యం కలగకుండా సహాయపడటానికి, ప్రక్రియకు ఒక గంట ముందు ఓవర్-ది-కౌంటర్ నొప్పి ఉపశమన మాత్రలు తీసుకోవాలని సిఫార్సు చేయబడింది.
- మీకు అయోడిన్ మరియు బెటాడిన్ లకు అలెర్జీ ఉంటే మీ వైద్యుడికి తెలియజేయండి. ఈ ప్రక్రియలో అయోడిన్ లేని కాంట్రాస్ట్ రంగులను ఉపయోగిస్తారు. అలాగే, మీకు ఎక్స్-రేలు పడకపోతే ముందుగా మీ వైద్యుడికి తెలియజేయండి.
- మీరు గర్భవతి కాదని నిర్ధారించడానికి ఈ పరీక్షకు ముందు మూత్ర పరీక్ష జరుగుతుంది.
- HSG పరీక్ష అనేది ఒక రోజువారీ ప్రక్రియ మరియు దీన్ని పూర్తి చేయడానికి ఒక గంట కంటే తక్కువ సమయం పడుతుంది.
- పరీక్ష పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఒకరిని వెంట తెచ్చుకోండి .
HSG పరీక్ష తర్వాత ఏమి ఆశించవచ్చు?
దీని తాలూకా దుష్ప్రభావాలు సాధారణంగా పరీక్ష తర్వాత కొన్ని రోజుల్లోనే తొలగిపోతాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.
- కటి ప్రాంతంలో స్వల్ప అసౌకర్యం ఉండవచ్చు(నొప్పి కొనసాగితే మీ సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి)
- కడుపు నొప్పి లేదా తిమ్మిరి
- జిగట యోని ఉత్సర్గం (రంగు కారణంగా)
- తేలికపాటి రక్తస్రావం లేదా కొన్ని రక్తపు చుక్కలు
- కళ్ళు తిరగడం
- వికారం
HSG పరీక్ష వలన ప్రమాదాలు ఏమిటి?
HSG పరీక్ష సాపేక్షంగా సురక్షితమైనది, కానీ అప్పుడప్పుడూ క్రింద పేర్కొన్న అరుదైన సమస్యలు తలెత్తవచ్చు:
- కాంట్రాస్ట్ రంగుకు అలెర్జీ ప్రతిచర్య
- గర్భాశయం మరియు ఫెలోపియన్ గొట్టాల సంక్రమణ
- గర్భాశయానికి రంధ్రం పడడం
- చిన్న మొత్తంలో అసాధారణ రక్తస్రావం (ఇది కొన్ని గంటల కంటే ఎక్కువసేపు కొనసాగితే మరియు ఋతుస్రావం కంటే బరువుగా ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించండి)
- జ్వరం లేదా చలి
HSG పరీక్ష బాధాకరమైన ప్రక్రియా?
HSG పరీక్ష అనేది సాధారణంగా నొప్పిలేకుండా చేసే ప్రక్రియ మరియు వారి నొప్పి తట్టుకునే సామర్ధ్యం కారణంగా మహిళ నుండి మహిళకు ఈ అనుభవం మారవచ్చు. కొంతమంది మహిళల్లో ఈ ప్రక్రియ తేలికపాటి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఈ రంగు యోని ద్వారా గర్భాశయం మరియు ఫెలోపియన్ గొట్టాలలోకి నొప్పి లేకుండా ప్రవేశపెట్టబడుతుంది. కొంతమంది మహిళలు రంగును ఇంజెక్ట్ చేసేటప్పుడు కొంచెం తిమ్మిరిని అనుభవించవచ్చు.
ఓవర్-ది-కౌంటర్ నొప్పి ఉపశమన మందులు అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
HSG పరీక్షను ఎవరికి చెయ్యరాదు?
ఒకవేళ మహిళలు క్రింద పేర్కొనబడిన అంశాలను కలిగి ఉంటే HSG పరీక్ష చేయించుకోకుండా ఉండాలి
- గర్భం ధరించినవారు
- పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID)
- వివరించలేని యోని రక్తస్రావం
HSG పరీక్ష ఫలితాల వివరణ
మీ సంతానోత్పత్తి నిపుణుడు స్కాన్ చిత్రాలను అంచనా వేస్తారు మరియు చికిత్స యొక్క తదుపరి దశలు ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఇచ్చిన రిపోర్ట్, ఫాలోపియన్ గొట్టాలలో అడ్డంకిని చూపిస్తే, సమస్యను మరింత నిర్ధారించడానికి లాపరోస్కోపీ చేయబడుతుంది లేదా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) చికిత్సను సిఫారసు చేయవచ్చు.
HSG పరీక్ష గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తుందా?
కొన్ని సందర్భాల్లో, HSG పరీక్ష పరోక్షంగా జంటల్లో గర్భం దాల్చే అవకాశాలను పెంచుతుంది. ఈ పరీక్ష తర్వాత దాదాపు 3 నెలల వరకూ ప్రయత్నించడం సురక్షితం. ఇటువంటి సందర్భాల్లో, పరీక్ష సమయంలో ఉపయోగించిన కాంట్రాస్ట్ డై (అయోడిన్) ఫాలోపియన్ ట్యూబ్ ను నిరోధక రహితంగా మరియు గర్భధారణను నిరోధించే శ్లేష్మం లేదా ఇతర సెల్ శిధిలాలను తొలగించడంలో సహాయపడుతుందని భావించబడుతుంది. ఇది చక్కని దుష్ప్రభావం అయినప్పటికీ, ఇదే అవసరమైన ఫలితం కాకపోవచ్చునని గుర్తుంచుకోవడం ముఖ్యం.
HSG పరీక్ష మాత్రమే ఏకైక ఎంపికా?
లాపరోస్కోపీ మరియు హిస్టెరోస్కోపీ వంటి ఇతర విధానాలు ఉన్నాయి. గర్భాశయ కుహరంలోని సమస్యల కారణంగా తలెత్తే సమస్యలను నిర్ధారించడానికి వీటిని ఉపయోగిస్తారు, అయితే అవి ఫాలోపియన్ గొట్టాలలోని అడ్డంకుల గురించి ఎటువంటి సమాచారాన్ని ఇవ్వవు.
పునరావృత గర్భస్రావాలు మరియు అసాధారణ రక్తస్రావం సందర్భాలలో కూడా HSG పరీక్ష పరిగణించబడుతుంది.
fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit