Blog
Enquire Now
Uncategorized

ఉత్తమమైన IVF క్లినిక్ ను కనుగొనడం: పరిగణలోకి తీసుకోవలసిన 8 ముఖ్యమైన అంశాలు

ఉత్తమమైన IVF క్లినిక్ ను కనుగొనడం: పరిగణలోకి తీసుకోవలసిన 8 ముఖ్యమైన అంశాలు

Author: Dr. V Ramya, Consultant & Fertility Specialist

వేగంగా మారుతున్న మరియు పట్టణీకరణ చెందుతున్న ప్రపంచం అంతులేని అవకాశాలను తెచ్చిపెడుతున్నప్పటికీ, ఇది జీవనశైలిలో, జీవన నాణ్యతలో మరియు ప్రజల ఆహారపు అలవాట్లలో కూడా భారీ మార్పులకు దారితీస్తుంది. వీటి ఫలితంగా ప్రజల ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. జీవన శైలిలో మార్పుల కారణంగా సంతానోత్పత్తి వయసున్న పురుషులు, మహిళలను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య సమస్యలలో ఒకటి వంధ్యత్వం. WHO నుండి ప్రస్తుత గణాంకాల ప్రకారం, ప్రతీ ఏడుగురు జంటలలో ఒకరు వంధ్యత్వంతో బాధపడుతున్నారు. సంతానోత్పత్తి చికిత్సల రంగంలో వైద్య పురోగతితో, వంధ్యత్వానికి పరిష్కారం అందుబాటులో ఉంది.

విట్రో ఫెర్టిలైజేషన్, దీనినే సాధారణంగా ఐవిఎఫ్ అని పిలుస్తారు, ఇది ప్రయోగశాలలో వీర్యంతో అండాన్ని ఫలదీకరణ చేసే అధునాతన సంతానోత్పత్తి చికిత్స. ఐవిఎఫ్ టెక్నాలజీ పునరుత్పత్తి ఔషధం రంగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఐవిఎఫ్ టెక్నాలజీ అనేక సంతానోత్పత్తి-సవాళ్లతో కూడిన జంటల యొక్క సంతానం కలగాలనే కలను సాధించడానికి సహాయపడింది.

.గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు సరైన ఐవిఎఫ్ క్లినిక్ ను కనుగొనడం ఒక పీడకలగా ఉండవచ్చు.

సరైన ఐవిఎఫ్ క్లినిక్ ను కనుగొనడం ఎందుకు ముఖ్యం?

ఆరోగ్య సంరక్షణా రంగంలో, నాణ్యమైన సేవను అందించడం చాలా ముఖ్యం మరియు కీలక పాత్ర పోషించే చాలా అంశాలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఇది సవాలుతో కూడిన పని. పరీక్షలు, ప్రయోగశాల పరికరాలు, రోగ నిర్ధారణ, వైద్యుని నైపుణ్యం మరియు అనుభవం, రోగి సేవ మొదలైనవి వినియోగదారులకు సంతృప్తికరమైన సేవను అందించడంలో పాత్ర పోషిస్తాయి మరియు ఈ కారకాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు స్వల్పంగానైనా ప్రతికూలతలు ఉంటే ఇబ్బందికర అనుభవానికి దారితీస్తాయి.

సంతానోత్పత్తి చికిత్స జంట నుండి జంటకు మారుతుంది. సంతానోత్పత్తి చికిత్సలను ఎంచుకోవడానికి మరియు ఐవిఎఫ్ క్లినిక్ కోసం వెతకడానికి ముందు, మీరు గర్భం ధరించలేకపోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి, తొలుత సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మీకు బాగా సరిపోయే ఐవిఎఫ్ క్లినిక్ ను కనుగొనడానికి మీరు పరిగణించవలసిన 8 ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి.

1. సంతానోత్పత్తి నిపుణుడు : వైద్య అనుభవం మరియు నైపుణ్యం

మీ అవసరాలకు సరిపోయే సంతానోత్పత్తి నిపుణుడిని కనుగొనడం చాలా కష్టమైన పని. డాక్టర్-రోగి మధ్య సంబంధాలు మరియు నమ్మకం ఏ చికిత్సకైనా ముఖ్యమైనవి. . మీరు అత్యంత అర్హత కలిగిన, అనుభవజ్ఞుడైన మరియు మీకు సౌకర్యంగా ఉండే సంతానోత్పత్తి నిపుణుడిని ఎంచుకున్నారని నిర్ధారించుకోండి. అలాగే, గర్భధారణలో మీకు ఎలాంటి చికిత్స సహాయపడుతుందో వివరించగల మరియు తెలుసుకోగల సంతానోత్పత్తి నిపుణుడిని చూడండి.

2.ఐ వి ఎఫ్ కేంద్రం యొక్క ప్రమాణాలు మరియు నాణ్యత

వైద్య రంగం విషయానికి వస్తే నాణ్యత తప్పనిసరి. నాణ్యతకు ఖచ్చితంగా కట్టుబడి ఉండే ఐవిఎఫ్ క్లినిక్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ప్రాథమిక ప్రమాణాలు, ధృవపత్రాలు మరియు నాణ్యమైన సమ్మతులు:

– ఐ సి ఎం ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) ద్వారా ధృవీకరించబడాలి.

– సంతానోత్పత్తి కేంద్రం ART చట్టం యొక్క ప్రమాణాలు, నియమాలు మరియు నిబంధనలను పాటించాలి.

– 10,000 శ్రేణి ఐవిఎఫ్ ల్యాబ్ ఉండాలి.

3. వ్యక్తిగతీకరించిన చికిత్స మరియు సంరక్షణ

సంతానోత్పత్తి చికిత్స చేయించుకోవడం ఎంతో భావోద్వేగంతో కూడిన ప్రయాణం కావచ్చు.. ఐవిఎఫ్ ప్రయాణంలో మానసిక ఆరోగ్య మద్దతు, వ్యక్తిగతీకరించిన మరియు వాత్సల్యపూరితమైన శ్రద్ధను అందించే ఐవిఎఫ్ కేంద్రాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. మీ అవసరాలు మరియు ఆందోళనలను తీర్చగల సిబ్బందితో కూడిన కేంద్రం కోసం చూడండి.

4. సౌకర్యాలు కలిగిన మరియు సాంకేతికతను ఉపయోగించే

సరికొత్త మరియు అత్యాధునిక సాంకేతికత, అధునాతన పరికరాలతో కూడిన క్లినిక్‌ని ఎంచుకోండి. అంతర్గత – గర్భాశయ గర్భధారణ (ఐయుఐ), అసిస్టెడ్ హాచింగ్, ఇన్విట్రో మెచ్యూరేషన్ (ఐవిఎం) మొదలైనటువంటి ఐవిఎఫ్

సెంటర్లలో వివిధ ఇతర సంతానోత్పత్తి చికిత్సలను నిర్వహించడానికి ప్రమాణాలు మరియు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడే ప్రత్యేక సౌకర్యాలు ఉండాలి.

 

5. పిండం ఫ్రీజింగ్ లేదా పిండం సంరక్షణ

పిండం గడ్డకట్టడం అనేది ఆవశ్యకమైన సౌకర్యం మరియు అధునాతన సాంకేతికత, ఇది గర్భధారణను వెంటనే ప్లాన్ చేయలేని జంటలకు వరం. ఐవిఎఫ్ చికిత్స సమయంలో ఏర్పడే అన్ని పిండాలు ఇంప్లాంటేషన్ కోసం ఉపయోగించబడవు. భవిష్యత్ ప్రయోజనాల కోసం ఉపయోగించడానికి ద్రవ నత్రజనిలో అదనపు పిండాలు స్తంభింపజేయబడతాయి. అందువల్ల ఐవిఎఫ్ సెంటర్ పిండం ఫ్రీజింగ్ సేవను అందిస్తుందో లేదో తెలుసుకోవడం ముఖ్యం.

ఒక్కొక్కసారి పిండం ఫ్రీజింగ్ ఈ క్రింది సందర్భాలలో చేయవచ్చు

– అండాశయాలు లేదా వృషణాల శస్త్రచికిత్స తొలగింపు కారణంగా ఏర్పడిన సంతానోత్పత్తిలో లోపం ఉన్నప్పుడు.

– తీవ్రమైన ఎండోమెట్రియోసిస్

– కాన్సర్

– ఒక వ్యక్తి వివిధ వ్యక్తిగత కారణాల వల్ల గర్భధారణ ప్రణాళికలను వాయిదా వేయాలనుకుంటే

6. ఐ వి ఎఫ్ విజయవంతమైన సంఖ్య

సక్సెస్ రేట్లను పెంచడానికి పునరుత్పత్తి ఔషధం నిరంతరం పురోగతి సాధిస్తోంది. అప్పటి నుండి, ఐవిఎఫ్ సాంకేతికత సహాయంతో మిలియన్ల మంది తల్లిదండ్రులు తమ స్వంత శిశువులను స్వాగతించారు.

ఐవిఎఫ్ కేంద్రం లో ప్రవేశించే ముందు, జంటలు విజయాల రేటు గురించి తెలుసుకోవాలి, తద్వారా హేతుబద్ధమైన అంచనాలను కలిగి ఉండాలి మరియు నిర్ణయాత్మక ఎంపిక చేసుకోవచ్చు.

అనేక అంశాలు ఐవిఎఫ్ సక్సెస్ రేట్లను ప్రభావితం చేస్తాయి.

– వయస్సు

– ఆరోగ్య పరిస్థితులు

– అండం మరియు వీర్యం నాణ్యత

– వంధ్యత్వానికి కారణం

కనిపించేదాన్ని నమ్మి నిజమో కాదో తెలుసుకోకుండా సక్సెస్ రేట్లను అంచనా వేయకండి. విజయ రేటు జంట నుండి జంటకు మరియు వ్యక్తి వయస్సును బట్టి భిన్నంగా ఉంటుంది కాబట్టి సక్సెస్ రేటును వివరంగా మరియు మీ సంతానోత్పత్తి నిపుణుడితో వ్యక్తిగతంగా చర్చించండి.

– వయస్సు మరియు ఐవిఎఫ్ విజయాల రేట్లు:

అన్ని ఇతర కారకాలలోపాటు, ఐవిఎఫ్ చికిత్స విజయవంతం కావడంలో వయస్సు ముఖ్య పాత్ర పోషిస్తుంది. వయస్సు మరియు ఐవిఎఫ్ విజయాల రేట్లు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. వృద్ధాప్యం పురుషులు మరియు స్త్రీలలో అండాలు మరియు వీర్యం యొక్క ఆరోగ్యం మరియు నాణ్యతను ప్రభావితం చేస్తుంది.

7. ఐవిఎఫ్ ప్యాకేజీ ఖర్చు

సంతానోత్పత్తి చికిత్సలు ఖరీదైనవి. ఏదైనా సంతానోత్పత్తి చికిత్స చేయించుకునే ముందు, ఐవిఎఫ్ ప్యాకేజీ ఖర్చుపై స్పష్టత పొందడం చాలా అవసరం. IVF ప్యాకేజీ ఖర్చు గురించిన అవగాహన, ఆర్థిక ప్రణాళికకు సహాయపడుతుంది.

పారదర్శక ధరల వ్యవస్థను పాటించేవి మరియు చెప్పకుండా దాచిన రుసుములు లేనటువంటి ఐవిఎఫ్ కేంద్రాన్ని ఎంచుకోండి.

8. ప్రదేశం యొక్క సౌకర్యం

అప్రధానంగా అనిపించవచ్చు, కానీ ఐవిఎఫ్ కేంద్రం యొక్క స్థానం పరిగణించవలసిన ముఖ్యమైన అంశం. సౌకర్యవంతంగా ఉన్న కేంద్రాన్ని ఎంచుకోవడం వల్ల తరచూ సందర్శించవలసిన కారణంగా ప్రయాణ ఒత్తిడి తగ్గుతుంది మరియు సమయం కూడా ఆదా అవుతుంది.

మీరు ఒయాసిస్ ఫెర్టిలిటీ సహాయంతో మీ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు! ఒయాసిస్ ఫెర్టిలిటీ, భారతదేశం అంతటా 31 కేంద్రాలతో ఒక ప్రముఖ మరియు అభివృద్ది చెందుతున్న సంతానోత్పత్తి కేంద్రాల వ్యవస్థ. ఇది ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుంది మరియు అనుభవజ్ఞులైన వైద్యుల బృందం మరియు శ్రద్ధగల నిర్వహణ సిబ్బందిని కలిగి ఉంది. ల్యాబ్ లు సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి మరియు ప్రమాణాలు ఇంకా నాణ్యతకు కఠినంగా కట్టుబడి ఉంటాయి. ఒయాసిస్ అనేది ISO 2001-సర్టిఫికేట్

పొందిన సంస్థ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాలను శ్రద్ధగా అనుసరిస్తుంది. ఒయాసిస్ ఫెర్టిలిటీ పరీక్ష, ప్రయోగశాల ప్రక్రియ, చికిత్స మరియు సంప్రదింపులను ఒకేచోట కలిగి ఉంటుంది.

ఒయాసిస్ ఫెర్టిలిటీలోని విశ్వసనీయ సంతానోత్పత్తి నిపుణులతో మీకు సంతానం కలగాలనే కలను సాధించుకోండి, వారు మీ సంతానోత్పత్తి ప్రయాణంలో ప్రతి దశలో మీతో ఉంటారు.

Write a Comment