Blog
Uncategorized

35 ఏళ్ల తర్వాత గర్భధారణ – తెలుసుకోవలసినవి మరియు ఆశించవలసినవి

35 ఏళ్ల తర్వాత గర్భధారణ – తెలుసుకోవలసినవి మరియు ఆశించవలసినవి

Author: Dr. Meera Jindal, Consultant – Fertility specialist

మాతృత్వం యొక్క ప్రయాణము ఆనందంతో నిండి ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులతో కూడా కూడి వుంటుంది. చాలా మంది జంటలు వివిధ కారణాల వల్ల జీవితంలో ఆలస్యంగా పిల్లలను కనడాన్ని ఎంచుకుంటారు. సహాయక పునరుత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాలకు ధన్యవాదాలు చెప్పాలి, వీటి వల్ల ఈ నిర్ణయం తీసుకోవడం సులభం అయ్యింది ఇంకా వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ లక్ష్యాలు మరియు ప్రాధాన్యతలను కొనసాగించవచ్చు.

అయితే, “ప్రామాణిక గర్భధారణ వయస్సు” దాటిన తర్వాత గర్భధారణ అనేది అనేక సమస్యలను సవాళ్లను కలిగి ఉంటుంది.

వయస్సు సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందనే వాస్తవాన్ని తోసిపుచ్చలేము. మరియు స్త్రీ యొక్క సంతానోత్పత్తి సామర్ధ్యం వయస్సుతో తగ్గుతుంది. 30 దాటిన తర్వాత స్త్రీ గర్భధారణకి కొంచెం సమయం పట్టవచ్చు, కానీ అది అసాధ్యమైతే కాదు.

కాబట్టి అనేక సందేహాలను నివృత్తి చేయాలి, నిజంగానే 35 ఏళ్లు పైబడిన మహిళలకు గర్భధారణకి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ అందుకు అనుబంధంగా ప్రమాదాలు కూడా ఉన్నాయి.

35 తర్వాత గర్భం దాల్చడం కష్టతరం చేసే కారణాలు

– రుతుక్రమం తగ్గుదల

– అండం యొక్క నాణ్యత మరియు పరిమాణంలో తగ్గుదల

– శస్త్రచికిత్స లేదా ఇన్ఫెక్షన్ కారణంగా ఫెలోపియన్ గొట్టాలలో లేదా గర్భాశయంలోని తంతు కణజాలం (స్కార్ టిష్యూ)

– ఫైబ్రాయిడ్ లు లేదా గర్భాశయ రుగ్మతలు

· ఎండోమెట్రియోసిస్ (గర్భాశయం బయట పెరిగే కణజాలం)

– మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి పరిస్థితులు

ఏమి చేయాలి

చాలా సందర్భాల్లో, 35 ఏళ్లు పైబడి అంతర్లీన సంతానోత్పత్తి సమస్యలు ఏవీ లేని ఆరోగ్యవంతమైన మహిళ సహజంగా గర్భం దాల్చి ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించవచ్చు

కానీ ఒక జంట సహజంగా గర్భం దాల్చలేకపోతే, వారు ఎల్లప్పుడూ ఇటువంటి ప్రత్యామ్నాయ సంతానోత్పత్తి చికిత్సలను ఆశ్రయించవచ్చు:

– IUI (కృత్రిమ వీర్యనిక్షేపణా గర్భధారణ): ఫలదీకరణానికి సహాయపడటానికి మంచి నాణ్యమైన వీర్యాన్ని ఎంపిక చేసి గర్భాశయంలో ఇంజెక్ట్ చేస్తారు.

– IVF (కృత్రిమ గర్భధారణ): స్త్రీ గర్భాశయంలో అమర్చబడే పిండాన్ని ఉత్పత్తి చేయడానికి ఒక అండ ప్రయోగశాలలో వీర్యంతో అండాన్ని ఫలదీకరణ చేయుట లేదా దానిని ఫ్రీజ్ చేసి తరువాత ప్రయోజనం కోసం భద్రపరచుట.

– అలాగే, మీ అండాన్ని ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది.

ప్రమాదాలు

ప్రతి గర్భధారణ అపూర్వమైనది. 30వ దశకం చివర్లో ఉన్న మహిళలతో 20వ దశకంలో మరియు 30వ దశకం ప్రారంభంలో ఉన్న మహిళలను పోలిస్తే వారికి గర్భధారణలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రమాదాలలో ఇవి ఉంటాయి:

– గర్భస్రావం

– పుట్టుకతో వచ్చే లోపాలు

– గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు మరియు మధుమేహాన్ని పొందే అవకాశం ఎక్కువ

– అకాల జననం లేదా తక్కువ బరువుతో బిడ్డ కలగడం

– ప్లాసెంటా సమస్యలు

ఈ ప్రమాదాలను చక్కని పూర్వ జనన (ప్రీ నేటల్) సంరక్షణతో అధిగమించవచ్చు మరియు నివారించవచ్చు. ఒకరు పూర్వ ప్రసవ స్క్రీనింగ్ పరీక్షలను ఎంచుకోవచ్చు మరియు ఎలాంటి ప్రమాదాల గురించైనా (ఏదైనా ఉంటే) తెలియజేయవచ్చు.

సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మార్గాలు:

మీ జీవనశైలికి కొన్ని సర్దుబాట్లు మరియు గర్భధారణ కోసం మీ శరీరాన్ని సిద్ధం చేయడమనేది ఈ ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు గర్భధారణ అవకాశాలను పెంచడంలో సహాయపడుతుంది.

గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

– ఋతు చక్ర కాలాన్ని అర్థం చేసుకుని, సారవంతమైన కాలం మరియు అండోత్సర్గమును గమనించడం ద్వారా మరియు క్రమం తప్పకుండా గర్భనిరోధకం లేని సంభోగం చేయడం ద్వారా, గర్భధారణకు మంచి అవకాశం ఉంటుంది.

– ఎప్పటికప్పుడు మీ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోండి.

– ధూమపానం మరియు మద్యపానం మానేయడం, కెఫిన్ ను పరిమితం చేయడం, తగినంత నిద్ర పొందడం మరియు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను ఎంచుకోండి.

– మితమైన వ్యాయామం చేయండి మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.

– ఒత్తిడిని తగ్గించడానికి సమయం కేటాయించండి. గర్భధారణను ప్లాన్ చేసేటప్పుడు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.

– మీకు ప్రసవానికి ముందు ఏదైనా విటమిన్లు అవసరమైతే మీ వైద్యుడిని సంప్రదించండి.

– సంతానోత్పత్తి సమస్యల విషయంలో మీ సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి మరియు సంతానోత్పత్తి సవాలు చేసిన జంటలకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్న వివిధ సంతానోత్పత్తి చికిత్సల గురించి తెలుసుకోండి.

 విషయం ఏమిటంటే:

గర్భధారణ ఒక ఉత్తేజకరమైన ప్రయాణం మరియు 35 సంవత్సరాల వయస్సులో గర్భధారణ ప్రణాళిక చేయడం కష్టంగా మరియు కఠినతరంగా అనిపించవచ్చు. సామాజిక దుర్భలత్వం మరియు వయస్సు-సంబంధిత ఆరోగ్య సమస్యలు ఒత్తిడిని ఇంకా పెంచుతాయి. ప్రమాదాలను అర్థం చేసుకోవడం మరియు మొత్తం ప్రయాణం గురించి ఎలా వెళ్లాలి అనే దాని గురించి తెలియజేయడం విషయాలను దృక్పథంలో ఉంచడానికి సహాయపడుతుంది.

సంతానోత్పత్తి సమస్య ఉన్న జంటలకు కూడా ఆశ ఉంది, ఎందుకంటేమీ సంతానోత్పత్తి కలను సాధించడంలో మీకు సహాయపడటానికి మీరు తల్లితండ్రులయ్యే స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి సహాయపడే పరిశోధన ఆధారిత పునరుత్పత్తి సాంకేతికతలు అందుబాటులో ఉన్నాయి

Write a Comment

BOOK A FREE CONSULTATION