IVF విఫలమైతే తర్వాత రెండవ అభిప్రాయం – మళ్ళీ ఆశను కొనసాగించడానికి ఒక కారణం
Author: Dr Jigna Tamagond, Consultant – Fertility Specialist
ఐవిఎఫ్ అనేది విజయవంతమైన సంతానోత్పత్తి చికిత్స, ఇది సంతానోత్పత్తి సమస్య ఉన్న చాలా మంది జంటలకు ఆశను కలిగిస్తుంది.
అయితే, ప్రతికూల ఫలితానికి కూడా ఎల్లప్పుడూ ఒక అవకాశం ఉంటుంది. కొన్ని జంటలకు గర్భం దాల్చడానికి ఒకటి కంటే ఎక్కువ ఐవిఎఫ్ ప్రక్రియలు పట్టవచ్చు
సంతానోత్పత్తి చికిత్సలు శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి మరియు ఆర్థిక అంశాలతో కూడినవి. విఫలమైన ఐవిఎఫ్ ప్రక్రియ తరువాత, ఒక జంట నిస్సహాయంగా, విచారంగా లేదా కోపంగా ఉండడం సహజం. అటువంటి సందర్భాలలో, దుఃఖించుటకు మరియు మార్పునకు సమయాన్ని వెచ్చించండి, మీరు సిద్ధంగా ఉన్నప్పుడు రెండవ అభిప్రాయం తీసుకోవడం గురించి ఆలోచించండి.
రెండవ అభిప్రాయము ఎందుకు? ఐవిఎఫ్ చికిత్స విఫలమైన తర్వాత, తదుపరి దశను నిర్ణయించడం నిరాశతోనూ మరియు క్లిష్టంగానూ ఉంటుంది. ప్రత్యేకించి లోపం ఏమిటో మీకు తెలియకపోతే, రెండవ అభిప్రాయాన్ని పొందడం కష్టమైన నిర్ణయం కావచ్చు కానీ కొన్నిసార్లు, రెండవ అభిప్రాయము తీసుకోవడం మేలు చేయవచ్చు.
1. మునుపటి IVF విఫలమవడానికి గల కారణాల సమీక్ష
ఇది ప్రస్తుతం ఉన్న సమస్యలపై కొత్త దృక్పథాన్ని ఇస్తుంది. గతంలో విఫలమైన ప్రక్రియల కారణాలను అర్థం చేసుకోవడానికి రెండవ అభిప్రాయం సహాయపడుతుంది. ఐవిఎఫ్ వైఫల్యానికి చాలా ఇతర కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని:
– గర్భంలోకి పిండాన్ని ప్రవేశ పెట్టుటలో వైఫల్యం · అండముల నాణ్యత
– తక్కువ వీర్య కణముల నాణ్యత
– జన్యుపరమైన అసాధారణతలు
2. మీకు ప్రత్యామ్నాయ ఎంపికలు ఉంటాయి
మీ తదుపరి ఐవిఎఫ్ ప్రక్రియలో గర్భవతి అయ్యే అవకాశాలను మెరుగు పరచడానికి అనుకూలీకరించిన విధానం మరియు మెరుగైన రోగనిర్ధారణ పద్ధతులను ఎంచుకోవచ్చు.
– సహజ గర్భధారణ ఐవిఎఫ్ ఎంచుకున్నతర్వాత సహజంగా గర్భం దాల్చే అవకాశం లేదని చాలా మంది అనుకుంటారు. కానీ సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్సతో, ఐవిఎఫ్ విఫలమైన తర్వాత కూడా సహజంగానే గర్భం దాల్చవచ్చు.
– ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (PGT)
ప్రి ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (PGS) అనేది ఏదైనా జన్యు లేదా క్రోమోజోమ్ అసాధారణతలను తెలుసుకోవడం కోసం, గర్భంలో ప్రవేశ పెట్టవలసిన పిండాలను పరీక్షించే అదనపు పరీక్షా పద్ధతి. ఇప్పటికే ఉన్న అసాధారణ జన్యువు లేదా ఐవిఎఫ్ సమయంలో సంభవించిన జన్యుపరమైన అసాధారణతలు గర్భస్రావానికి దారితీయవచ్చు.
– ఎండోమెట్రియాల్ రిసెప్టివిటీ విశ్లేషణ (ERA)
కొన్నిసార్లు పిండం ఎండోమెట్రియంలో ప్రవేశ పెట్టడంలో విఫలమవుతుంది, ఇది విఫలమైన ఐవిఎఫ్ కు దారితీస్తుంది. ఎండోమెట్రియం యొక్క గ్రాహక కారకాన్ని ERA విశ్లేషిస్తుంది. ఎండోమెట్రియాల్ లైనింగ్ం, పిండ ప్రవేశానికి ఎప్పుడు సిద్ధంగా ఉందో నిర్ణయించడానికి ఈ ప్రత్యేకమైన నైపుణ్యం అనుమతిస్తుంది.
– దాత అండములు మరియు వీర్యం
ఐవిఎఫ్ ప్రక్రియలో ఉపయోగించే వీర్యం లేదా అండాల నాణ్యతలో సమస్య ఉంటే ఈ పద్ధతి విఫలమయ్యే అవకాశం ఉంది. అటువంటప్పుడు, చక్కని విజయవంతమైన అవకాశాల కోసం దాత అండములు మరియు వీర్యాన్ని ఎంచుకోవడాన్ని పరిగణించాలనుకోవచ్చు.
విషయం ఏమిటంటే:
ఐవిఎఫ్ విఫలమైతే, మీరు తల్లితండ్రులయ్యే అవకాశాలు ముగిసినట్టు కాదు. ఆశను కోల్పోకండి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి మరియు సరైన సమయంలో సరైన అడుగు వేయడం ముఖ్యం. సరైన సంతానోత్పత్తి నిపుణులను ను సంప్రదించండి, వారు ప్రతి దశలో మీతో ఉంటారు మరియు మీ ప్రయాణంలో మార్గదర్శకత్వాన్నివహిస్తూ మీకు సహాయపడతారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ లో, మేము మావద్దకు వచ్చేవారికి ఉత్తమ సంతానోత్పత్తి సంరక్షణను అందిస్తాము. మా విశ్వసనీయ నిపుణులు మరియు అనుభవజ్ఞులైన పిండ శాస్త్రవేత్తల బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. తల్లితండ్రులయ్యే మీ కలను సాధించడంలో మీకు సహాయపడటానికి మేము మా వంతు కృషి చేస్తాము మరియు ఇందులో ఎటువంటి అవకాశాన్ని వదులుకోము.