IVF/IUI కోసం అండాశయ ఉద్దీపన గురించి మీకు తెలుసా?
Author: Dr.Hema Vaithianathan ,Senior Consultant & Fertility Specialist
ప్రపంచవ్యాప్తంగా వంధ్యత్వం అనే పరిస్థితి ప్రతి 6 మందిలో 1 వ్యక్తిని ప్రభావితం చేస్తుంది
వంధ్యత్వం పురుషులు మరియు స్త్రీలు ఇద్దరి మానసిక మరియు శారీరక శ్రేయస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ (ART), సమర్ధవంతంగా ప్రణాళిక చేయబడిన ఒక సంక్లిష్ట విధానాల ఏర్పాటు, ఇవి సంతానోత్పత్తి సమస్యలతో పోరాడుతున్న జంటలకు ఊపిరిగా ఉన్నాయి.
సాంకేతిక పురోగతులు మరియు సాక్ష్య-ఆధారిత పరిశోధనలతో, ఈ విధానాలు దంపతులకు చికిత్స కోసం వెచ్చించే సమయాన్ని తక్కువ చేసి చికిత్సను సులభంగా ప్రణాళిక చేయడానికి మరియు నిర్వహించడానికి తేలికగా మార్చబడ్డాయి మరియు సరళీకృతం చేయబడ్డాయి. ఈ పురోగతులు ప్రస్తుత సహాయక పునరుత్పత్తి చికిత్సను ‘రోగికి అనుకూలంగా మారి’ చాలా విజయవంతమయ్యాయి.
IVF మరియు IUI వంటి విధానాలలో, ప్రక్రియ యొక్క విజయం అధిక-నాణ్యత గేమేట్‌ల వెలికితీతపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ రోజులలో, సహజ ఋతు చక్రం క్రమంలో సహాయక పునరుత్పత్తి ప్రక్రియలు నిర్వహించబడ్డాయి. అండములు సహజ అండోత్సర్గము దశలో సంగ్రహించబడ్డాయి. తరువాత అండాశయ ఉద్దీపన కోసం కొత్త ఔషధాల ఆగమనంతో, అండాశయ ఉద్దీపన యొక్క మెరుగైన దశ ART అభ్యాసంలో విలీనం చేయబడింది.
అండాశయ ఉద్దీపన:
అండాశయాలు కొన్ని ఔషధాల (హార్మోనల్ డెరివేటివ్స్) వాడకంతో ఒకేసారి అనేక పరిపక్వ అండములను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించబడతాయి.
ఈ ప్రక్రియ గర్భధారణ యొక్క అవకాశాలను పెంచడానికి గర్భాశయ బదిలీ కోసం తగినంత మరియు అనేక మంచి-నాణ్యత గల పిండాలను పొందేందుకు అవకాశమును అందిస్తుంది.
అదనంగా, ఇది అండాశయ నిల్వలు అల్పంగా ఉన్నవారికి మరియు వారి సంతానోత్పత్తిని కాపాడుకోవాలనుకునే వారికి కూడా సహాయపడుతుంది.
ఇది ఎలా పనిచేస్తుంది?
అండాశయాలు 8-14 రోజుల పాటు ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) మరియు లుటినైజింగ్ హార్మోన్ (LH) యొక్క హార్మోన్ల ఇంజెక్షన్‌లతో ప్రేరేపించబడి అండమును తిరిగి పొందేందుకు అనేక అండములను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్లు శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడినప్పటికీ, ఇంజెక్షన్లు ఈ హార్మోన్ల యొక్క అధిక స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి, ఇది అండాశయంలో అధికంగా అండములు పరిపక్వం చెందడానికి వీలుకలిగిస్తుంది.
ఉద్దీపన కోసం పట్టే సమయం ఫోలికల్స్ యొక్క పరిపక్వత సమయం మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు హార్మోన్ల మందులు అండాశయ స్టిమ్యులేషన్ ప్రారంభానికి ముందు సూచించబడతాయి మరియు అండాశయ ఫోలికల్స్ను సిద్ధం చేస్తాయి.
చికిత్స ప్రారంభించిన తర్వాత ఏమి జరుగుతాయి?
- హార్మోన్ల మందులు ప్రతిరోజూ ఇవ్వబడతాయి
- శరీరంలోని హార్మోన్ స్థాయిలను పర్యవేక్షించడానికి తరచుగా బ్లడ్ వర్క్స్ జరుగుతాయి
- అండాశయాలలో ఫోలికల్స్ పెరుగుదలను అంచనా వేయడానికి అల్ట్రాసౌండ్ స్కాన్లు చేస్తారు
- మందులు మరియు హార్మోన్ల ఇంజెక్షన్లు మూడ్ స్వింగ్స్ వంటి కొన్ని ప్రభావాలను తీసుకురావచ్చు
- అండాశయాలు ఆశించిన విధంగా స్పందించకపోతే ప్రక్రియ రద్దు చేయబడవచ్చు
సంభవించే అవకాశాలున్న దుష్ప్రభావాలు:
- రొమ్ము సున్నితత్వం
- ఇంజెక్షన్ చేసిన చోటు వాపు లేదా దద్దుర్లు
- సహజమైన గర్భధారణ విషయంలో బహుళ ఫలదీకరణ పిండాలు
- అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్
- మూడ్ స్వింగ్స్ మరియు చిరాకు
అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS)
పేరు సూచించినట్లుగా, అండాశయాలలో వాపు మరియు శరీరంలోకి ద్రవాన్ని ఊరించే అదనపు హార్మోన్ల కారణంగా అండాశయాలు ఎక్కువగా ప్రేరేపించబడినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
IVF చేయించుకుంటున్న PCOS ఉన్న మహిళల్లో ఇది మరి ఎక్కువ సర్వసాధారణం.
చికిత్స పరిస్థితి యొక్క తీవ్రత మరియు లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రమాదం ఎక్కువగా ఉన్న మహిళలు CAPA – IVMని ఎంచుకోవచ్చు.
CAPA – IVM, ఔషధ రహిత IVF చికిత్స
ఇది ఇన్ విట్రో మెచ్యూరేషన్ (IVM) యొక్క అధునాతన వెర్షన్ మరియు ఇంజెక్షన్ల సంఖ్య మరియు విపరీతమైన దుష్ప్రభావాలను మినహాయించి సాంప్రదాయ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) కంటే మెరుగైన ఫలితాలను కలిగి ఉంది.
ఈ తక్కువ ఖర్చు మరియు తక్కువ తీవ్రతగల ప్రక్రియ PCOS ఉన్న స్త్రీలకు, అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS) ప్రమాదం ఎక్కువగా ఉన్న రోగులకు సిఫార్సు చేయబడింది.
ఈ ప్రక్రియ కోసం అండాశయ ఉద్దీపన చాలా తక్కువ లేక అసలు అవసరం లేదు.
మీరు అండాశయ ఉద్దీపనను కోసం ఆలోచిస్తుంటే వీటిని పరిగణనలోకి తీసుకోవటం గుర్తుంచుకోండి:
- మీ మందులు, పరీక్షలు మరియు స్కాన్‌లను ఎల్లప్పుడూ కనిపెట్టుకోండి
- ఏదైనా సంబంధిత లక్షణాల కనిపిస్తే తక్షణమే వైద్య సహాయం కోరండి
- ప్రక్రియ కొన్నిసార్లు అతిగా మరియు ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. మీతో మీరు దయగా మరియు సున్నితంగా ఉండండి.
fill up the form to get a
Free Consultation
Avail 0% interest on EMI
All Procedures | No Upper Limit
How we reviewed this article:
- Current Version
- September 11, 2023 by Oasis Fertility
- August 29, 2023 by Oasis Fertility