మహిళల్లో వంధ్యత్వానికి కారణాలను గుర్తించడం
Author: Dr. Sai Manasa Darla, Consultant, Fertility Specialist & Laparoscopic Surgeon
అనేక వైద్య, జీవనశైలి కారణాల వల్ల వంధ్యత్వం అనేది సర్వత్రా వ్యాప్తి చెందిన ఒక ఆరోగ్య పరిస్థితి. 30% వంధ్యత్వానికి కారణం స్త్రీలలో సంతానోత్పత్తి కారకాలు. స్త్రీలలో వంధ్యత్వం వారిని మానసికంగా మరియు శారీరకంగా కృంగ తీస్తుంది. మహిళల్లో వంధ్యత్వానికి గల కారణాలను గుర్తించడం మరియు తెలుసుకోవడం అనేది సమస్యను పరిష్కరించడానికి, చికిత్స చేయడానికి మరియు తద్వారా గర్భధారణకు సహాయపడుతుంది.
మహిళల్లో వంధ్యత్వానికి సామాన్య కారణాలను అన్వేషించడం:
– అండోత్సర్గ రుగ్మతలు
– గర్భాశయ వ్యాధులు
– బీజవాహికల – సంబంధిత వంధ్యత్వం
అండోత్సర్గ రుగ్మతలు
అండోత్సర్గ రుగ్మతలు మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణాలకు దోహదం చేస్తాయి.
అండోత్సర్గం అనేది ఋతు చక్రంలో ఒక దశ, ఎఏ దశలో అండాశయాల నుండి ఒక పరిపక్వ అండం విడుదల అవుతుంది, ఇది వీర్యంతో ఫలదీకరణం చెందితే గర్భధారణకు దారితీస్తుంది. అండోత్సర్గ ప్రక్రియలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే అవి అండము విడుదల కావడంలో సమస్యలకు దారితీస్తాయి. అండోత్సర్గ రుగ్మతలు 25% వంధ్యత్వ సమస్యలకు దోహదం చేస్తాయి.
అండము విడుదల కావడంలో సమస్యలు, జీవ ప్రక్రియలో జోక్యం చేసుకునే కారకాల ఫలితంగా మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే వివిధ కారకాలు అయి ఉండవచ్చు.
అండము విడుదల కావడంలో అవకతవకలు లేదా అండము విడుదల కాకపోవడం(లేకపోవడం) వంటి అనేక కారణాల కావచ్చు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి:
1. ప్రాధమిక అండాశయ లోపం (POI):
దీనినే అకాల అండాశయ వైఫల్యం అని కూడా పిలుస్తారు. POI వలన చాలా తక్కువ సంఖ్యలోఅండములు ఉండటం లేదా కొన్ని సందర్భాల్లో 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో అండాశయాలు ముందుగానే అండాల ఉత్పత్తి చేయడాన్ని ఆపివేస్తాయి. తత్ఫలితంగా ఇది మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతుంది.
2. హార్మోన్ అవకతవకలు:
హార్మోన్ అవకతవకలు క్రమరహిత అండోత్సర్గము యొక్క ప్రధాన దోషములలో ఒకటి. ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లుటినైజింగ్ హార్మోన్ (LH) మరియు ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ల సంక్లిష్టమైన మరియు సున్నితమైన సమతుల్యత అండముల విడుదల ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏవిధమైన హార్మోన్ అవకతవకలైనా అండము విడుదలను మరియు గర్భధారణ అవకాశాలను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ అవకతవకల కారణంగా తలెత్తే కొన్ని పరిస్థితులు:
– పాలిసిస్టిక్ ఒవెరియన్ సిండ్రోమ్ (పిసిఒఎస్): మహిళల్లో వంధ్యత్వానికి పిసిఒఎస్ సాధారణ మరియు ప్రధాన కారణాలలో ఒకటి. అండోత్సర్గ సమస్యలకు దారితీసే అనేక చిన్న తిత్తులు (ద్రవం నిండిన సంచులు) అండాశయాలలో ఏర్పడతాయి. క్రమరహిత ఋతు చక్రం, టెస్టోస్టెరాన్ అధిక ఉత్పత్తి, స్త్రీ హార్మోన్ అవకతవకలు, అండము విడుదలలో అవకతవకలు మరియు ఇన్సులిన్ నిరోధకత PCOSతో ముడిపడి ఉంటాయి.
– అధిక ప్రోలాక్టిన్ స్థాయిలు (హైపర్ ప్రోలాక్టినిమియా): కొన్ని సందర్భాల్లో, పిట్యూటరీ గ్రంధి పనిచేయకపోవడం వల్ల ప్రోలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. పెరిగిన ప్రోలాక్టిన్ స్థాయిలు అండము విడుదలలో సమస్యలను మరియు సంతానోత్పత్తి సమస్యలకు దారితీసే FSH మరియు LH స్థాయిలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
– థైరాయిడ్ సరిగా పనిచేయకపోవడం: థైరాయిడ్ పనిచేయకపోవడం వంటి ఎండోక్రైన్ రుగ్మతలు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమయ్యే నెమ్మదించిన లేదా అతి చురుకైన థైరాయిడ్ గ్రంధికి దారితీయవచ్చు. థైరాయిడ్ పనిచేయకపోవడం అండము విడుదలపై మరియు గర్భ ధారణ అవకాశాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది.
3. తగ్గిన అండము యొక్క నాణ్యత మరియు సంఖ్య :
స్త్రీ సంతానోత్పత్తి అండము యొక్క నాణ్యత మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. స్త్రీలు ఖచ్చితమైన సంఖ్యలో అండములతో పుడతారు మరియు ఈ అండముల నాణ్యత మరియు పరిమాణం వయసు పెరిగే కొద్దీ బాగా క్షీణిస్తుంది. వయస్సు పెరిగేకొద్దీ, అండములు జన్యు అసాధారణతలను అభివృద్ధి చేస్తాయి, ఇవి జనన లోపాలు లేదా పునరావృత గర్భస్రావాల ప్రమాదాన్ని పెంచుతుంది.
గర్భాశయ వ్యాధులు
గర్భం ధారణకు , గర్భధారణ కాలం పూర్తి అయ్యే వరకు, గర్భం కొనసాగడానికి, గర్భాశయ ఆరోగ్యం చాలా ముఖ్యం. గర్భాశయ వ్యాధులు గర్భధారణను అడ్డుకోవడం ద్వారా పిండం పెరుగుదలను నిరోధిస్తాయి. గర్భధారణ జరిగినా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఫైబ్రాయిడ్ లు, గర్భాశయ పాలిప్స్, గర్భాశయ అసాధారణతలు, ఎండోమెట్రియోసిస్ మరియు గర్భాశయం కుంచించుట వంటి గర్భాశయ వ్యాధులు గర్భధారణ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
1. ఫైబ్రాయిడ్ లు:
ఫైబ్రాయిడ్లు గర్భాశయ కండరాల యొక్క క్యాన్సర్ రహిత పెరుగుదల. అవి ఫలదీకరణం చెందిన అండం అమరికను అడ్డుకుంటాయి లేదా దాని పరిమాణం మరియు పెరుగుదల స్థానాన్ని బట్టి అండము లేదా వీర్యం యొక్క కదలికను అడ్డుకుంటాయి.
2. గర్భాశయ అసాధారణతలు:
పుట్టుకతో వచ్చే కారణాల వల్ల అసాధారణ ఆకారంలో ఉన్న గర్భాశయంతో కొద్దిమంది మహిళలు పుడతారు. ఈ నిర్మాణాత్మక వైకల్యాలు గర్భధారణలో సమస్యలను కలిగిస్తాయి మరియు ఎక్కువగా పునరావృత గర్భస్రావాల ప్రమాదాన్ని కలిగి ఉంటాయి .
3. ఎండోమెట్రియోసిస్:
మహిళల్లో వంధ్యత్వానికి కారణమయ్యే ప్రధాన కారణాలలో ఎండోమెట్రియోసిస్ ఒకటి. సుమారు 30% మహిళా వంధ్యత్వ కేసులు ఎండోమెట్రియోసిస్ కారణంగానే జరుగుతాయి. ఇది అండాశయాలు, గర్భాశయం వెనుక, ఫెలోపియన్ నాళాలు మరియు కటి ప్రాంతం వంటి గర్భాశయం వెలుపల, లోపల గర్భాశయ లైనింగ్ (ఎండోమెట్రియం) పెరిగే పరిస్థితి. తీవ్రమైన సందర్భాల్లో, మచ్చల కణజాలాల( గర్భాశయ మందం పెరుగుట) వలన గర్భాశయ కుదింపుకు కారణం అవుతాయి. ఎండోమెట్రియోసిస్ యొక్క లక్షణాలు బాధాకరమైన మరియు క్రమరహిత ఋతు చక్రం, తీవ్రమైన కటి నొప్పి, సంభోగం సమయంలో నొప్పి మొదలైనవి.
ఇది పూడుకున్నఫెలోపియన్ గొట్టాలు, గర్భధారణలో ఆటంకం మరియు గర్భాశయం యొక్క వాపుకు కారణమవుతుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే అది గర్భధారణ వైఫల్యాలకు మరియు పునరావృత గర్భస్రావాలకు దారితీయవచ్చు.
4. పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ (PID):
మహిళల్లో వంధ్యత్వానికి ప్రధాన కారణాలలో పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఒకటి. స్త్రీ పునరుత్పత్తి అవయవాలకు లైంగికంగా సంక్రమించే బ్యాక్టీరియా యోని నుండి గర్భాశయానికి, ఫెలోపియన్ నాళాలకు మరియు
అండాశయాలకు వ్యాపిస్తాయి. దీర్ఘకాలిక PID మచ్చ కణజాలం(మందం) పెరగడానికి కారణమవుతుంది మరియు నిర్మాణ సమస్యలకు దారితీస్తుంది. చికిత్స చేయని దీర్ఘకాలిక PID ఎక్టోపిక్ గర్భం మరియు మరింత వంధ్యత్వ ప్రమాదంతో ముడిపడి ఉంటుంది.
బీజవాహికల – సంబంధిత వంధ్యత్వం
ఫెలోపియన్ ట్యూబ్ లోని అడ్డంకి వీర్యాన్ని అండముతో ఫలదీకరణం జరగకుండా నిరోధిస్తుంది. అలాగే, ఫలదీకరణం జరిగినప్పటికీ, ఫెలోపియన్ ట్యూబ్ లో అడ్డంకి కారణంగా పిండం గర్భాశయానికి రవాణా చేయబడదు, దీని ఫలితంగా దీని ఫలితంగా గర్భస్రావానికి దారితీసే ఎక్టోపిక్ గర్భం తీసి వేయబడవలసి వస్తుంది.
క్లామిడియా మరియు గోనేరియా వంటి లైంగిక సంక్రమణ వ్యాధులు, మునుపటి శస్త్రచికిత్సల కారణంగా మచ్చలు, దీర్ఘకాలిక పిఐడి, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్ లు లేదా పాలిప్స్ మొదలైనవి గొట్టాలను దెబ్బతీస్తాయి, గొట్టాలు దెబ్బతింటాయి మరియు ఆ ట్యూబల్ బ్లాకేజ్ సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది.
మహిళల్లో సంతానోత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాద కారకాలు
పైన పేర్కొన్న కారణాలతో పాటు, గర్భధారణ అవకాశాలను ప్రభావితం చేసే కొన్ని ప్రమాద కారకాలు:
– వయస్సు: అండముల నాణ్యత మరియు సంఖ్య తగ్గడం వల్ల ఆడవారి సంతానోత్పత్తి వయస్సుతో పాటు తగ్గుతుంది.
– లైంగికంగా సంక్రమించిన అంటువ్యాధులు: ముందుగా చర్చించినట్లుగా, STI లు వ్యాప్తి చెందుతాయి మరియు గర్భాశయ ముఖ్య ద్వారం, గర్భాశయం మరియు ఫాలోపియన్ గొట్టాలకు సోకుతాయి, ఇది మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది.
– ధూమపానం మరియు మద్యం వినియోగం: ఇది పురుషులలో మరియు మహిళలలో, ఇద్దరికీ వంధ్యత్వ ప్రధాన ప్రమాద కారకాల్లో ఒకటి. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేయడమే కాక, ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యాన్ని కూడా బలహీనపరుస్తుంది.
– ఊబకాయం: అధిక బరువు ఉండటం సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది మరియు గర్భం ధరించడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
– లోపాలు మరియు ఇతర పోషక కారకాలు: విటమిన్ లోపాలు మరియు అసమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల హార్మోన్ ఉత్పత్తికి మరియు పునరుత్పత్తి వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు ముఖ్యమైన అవసరమైన సప్లిమెంట్ లు లేకపోవడం వల్ల మీ పునరుత్పత్తి వ్యవస్థ గర్భధారణకు అనర్హంగా మారుతుంది.
– ఒత్తిడి: ఒత్తిడి అండోత్సర్గమును ప్రభావితం చేస్తుంది మరియు లైంగిక వాంఛ తగ్గడానికి దారితీస్తుంది.
ముగింపు
గర్భం దాల్చని జంటలకు, గర్భం దాల్చకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడం, ఆ పరిస్థితిని చక్కగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. సరైన రోగ నిర్ధారణ సమర్థవంతమైన వ్యక్తిగతీకరించిన చికిత్స ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది. పునరుత్పత్తి ఔషధం రంగంలో పురోగతికి ధన్యవాదాలు, సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఇప్పటికీ గర్భవతులు కావచ్చు మరియు ఇన్ విట్రో ఫలదీకరణం, గర్భాశయ లోపల గర్భధారణ, ఇన్ విట్రో మెచ్యూరేషన్ మొదలైన అనేక సంతానోత్పత్తి చికిత్సల సహాయంతో వారు మాతృత్వం యొక్క కలను సాధించవచ్చు. మీ సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించడానికి అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణుడిని సంప్రదించండి.